Deepveer | సిద్ధి వినాయకుడిని దర్శించుకున్న ‘దీప్‌వీర్’.. వీడియో..!
Deepveer : రెండోసారి తల్లిదండ్రులు కాబోతున్న రణ్వీర్ సింగ్(Ranveer Singh), దీపికా పదుకొనే(Deepika Padukone )లు గణేశుడి ఆశీర్వాదం తీసుకున్నారు. ముంబైలోని ప్రసిద్ధ సిద్ధి వినాయకుడి(Siddi Vinayaka)ని దర్శించుకున్నారు.
Deepveer : రెండోసారి తల్లిదండ్రులు కాబోతున్న రణ్వీర్ సింగ్(Ranveer Singh), దీపికా పదుకొనే(Deepika Padukone )లు గణేశుడి ఆశీర్వాదం తీసుకున్నారు. శుక్రవారం వీరు ముంబైలోని ప్రసిద్ధ సిద్ధి వినాయకుడి(Siddi Vinayaka)ని దర్శించుకున్నారు. సంప్రదాయ దుస్తుల్లో విఘ్నేశుడి దర్శనానికి వచ్చిన దీప్వీర్కు అలయ అధికారులు, పుజారులు స్వాగతం పలికారు. గణపయ్య దర్శనం ముగిసేంత వరకూ ఈ బాలీవుడ్ స్టార్ జంటకు పోలీసులు భద్రతా వలయం ఏర్పాటు చేశారు. రణ్వీర్ సింగ్ తల్లిదండ్రులు కూడా సిద్ధివినాయకుడిని దర్శించుకున్నారు.
గణేశ్ నవరాత్రులను పునస్కరించుకొని బాలీవుడ్ జంట రణ్వీర్ సింగ్, దీపికా పదుకొనే ముంబై సిద్ధివినాయకుడిని దర్శించుకుంది. రెండోసారి తల్లిదండ్రులు కాబోతున్న దీప్‌వీర్ జోడీ శుక్రవారం అక్కడి ప్రసిద్ధమైన లంబోదరుడి ఆశీర్వాదం తీసుకుంది. తొలి కాన్పు ముందు కూడా దీపిక – రణ్‌వీర్‌లు సిద్ధివినాయకుడిని దర్శించుకున్నారు. ఇప్పుడు కూడా అదే ఆనవాయితీని కొనసాగించిన ఈ జంట.. గణపయ్య దీవెనలు పొందింది.
Ranveer Singh and Deepika Padukone with Ranveer’s parents at Siddhivinayak Temple 😍🥰♥️♥️ #deepveer pic.twitter.com/6T4LjUA7CF
— DeepVeer Fanclub (@DeepVeer_FC) September 18, 2026
ఈ మధ్యే మెటర్నిటీ ఫొటోషూట్ ఫొటోలను పంచుకున్న విషయం తెలిసిందే. తమ గారాలపట్టి దుపా పదుకొనె సింగ్ రెండో పుట్టిన రోజును పునస్కరించుకొని దీపిక తన మెటర్నిటీ ఫొటోషూట్‌కు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

