Devjit Saikia | ఆసియా కప్ ట్రోఫీలు వచ్చేస్తాయి.. అగార్కర్‌పై త్వరలోనే నిర్ణయం..!
Devjit Saikia : భారత పురుషుల సీనియర్ క్రికెట్ జట్టు చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ భవితవ్యంపై వస్తున్న ఊగాహానాలపై బీసీసీఐ సెక్రటరీ దేవజిత్ సైకియా (Devjit Saikia) ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
Devjit Saikia : భారత పురుషుల సీనియర్ క్రికెట్ జట్టు చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్(Ajit Agarkar) భవితవ్యంపై వస్తున్న ఊగాహానాలపై బీసీసీఐ సెక్రటరీ దేవజిత్ సైకియా (Devjit Saikia) ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. త్వరలోనే అగార్కర్‌పై నిర్ణయం తీసుకుంటారని పేర్కొన్న సైకియా.. దుబాయ్‌లో ఉండిపోయిన ఆసియా కప్ ట్రోఫీలు త్వరలోనే బీసీసీఐ కార్యాలయానికి వస్తాయని స్పష్టం చేశాడు.
బీసీసీఐ 95వ వార్షిక సమావేశం అనంతరం కార్యదర్శి దేవజిత్ సైకియా మీడియాతో పలు విషయాలు వెల్లడించాడు. చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ పదవీ కాలం ముగియనున్నందున త్వరలోనే నిర్ణయ తీసుకుంటామని ఆయన తెలిపాడు. ‘అగార్కర్ కాంట్రాక్టు ముగియడానికి ఇంకా సమయం ఉంది. క్రికెట్లో 15 రోజుల సమయం అనేది చాలా పెద్దది. సరైన సమయంలో మేము నిర్ణయం తీసుకుంటాం. మీకు కచ్చితంగా తెలియజేస్తాం’ అని పేర్కొన్న బీసీసీఐ కార్యదర్శి.. దుబాయ్‌లోనే ఉండిపోయిన ఆసియా కప్ ట్రోఫీలపైనా స్పందించారు.
VIDEO | “We still have 15 days to go, which is a long time in the world of Cricket. We will take a decision at the appropriate time and will let you know,” says BCCI secretary Devajit Saikia on Ajit Agarkar’s future as chairman of selectors.
(Full video available on PTI Videos -… pic.twitter.com/INl36xujI9
— Press Trust of India (@PTI_News) September 18, 2026
VIDEO | “I will not give you timeline but I can assure you that both Asia Cup trophies will land up in BCCI office,” says BCCI secretary Devajit Saikia.
(Full video available on PTI Videos – https://t.co/d8jp61yd2p) pic.twitter.com/HbKcHJXyMG
— Press Trust of India (@PTI_News) September 18, 2026
‘ఎప్పుడు అనేది చెప్పలేను కానీ, మన జట్లు గెలుపొందిన రెండు ఆసియా కప్ ట్రోఫీలు బీసీసీఐ కార్యాలయానికి వచ్చేస్తాయి’ అని ఆయన చెప్పారు. ఇక భారత పురుషుల జట్టుకు ఫీల్డింగ్ కోచ్‌గా సుభాదీప్ ఝోష్ను తాత్కాలిక కాలానికి నియమించామని, అతడి పనితీరును పరిశీలిస్తామని సైకియా వెల్లడించాడు.
రెండూ అక్కడే..
పహల్గాం ఉగ్రదాడి, ఆపరేషన్ సిందూర్ అనంతరం.. భారత్, పాకిస్థాన్ మధ్య క్రికెట్ సంబంధాలు మరింత దెబ్బతిన్నాయి. ఆటగాళ్లు కరచాలనం చేసుకోవడం ఆపేయగా.. ఏసీసీ చీఫ్‌గా ఉన్న పీసీబీ అధ్యక్షుడు మొహ్సిన్ నఖ్వీ చేతుల మీదుగా ఆసియా కప్‌ను తీసుకునేందుకు టీమిండియా నిరాకరించింది. సూర్యకుమార్ యాదవ్ బృందం ట్రోఫీని తీసుకోలేదు.

ఈమధ్యే శ్రీలంకను చిత్తు చేసి ఎనిమిదోసారి ఆసియా విజేతగా నిలిచిన హర్మన్‌ప్రీత్ కౌర్ టీమ్ కూడా నఖ్వీ రాకతో ట్రోఫీని అందుకోలేదు. దాంతో.. ఈ రెండు ట్రోఫీలు దుబాయ్‌లోని ఏసీసీ కార్యాలయంలో ఉన్నాయి. ప్రస్తుతం ఆసియా క్రికెట్ మండలి(ACC) ఛైర్మన్‌గా కొనసాగుతున్న మొహ్సిన్ నఖ్వీ పదవీకాలం వచ్చే ఏడాది ఏప్రిల్‌లో ముగియనుంది. దాంతో.. ఆ తర్వాత దుబాయ్‌లోని ఏసీసీ కార్యాలయం నుంచి ఆసియా కప్ ట్రోఫీలను బీసీసీఐ స్వీకరించనుందని సమాచారం.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Puneeth Rajkumar: గంటన్నర పాటు కిక్ బాక్సింగ్.. పునీత్ రాజ్‌కుమార్ చివరి క్షణాలు గురించి చెప్పిన డాక్టర్
‘పేదింటి ఆడబిడ్డల పెళ్లికి భరోసా కల్యాణలక్ష్మి’
వైటీపీఎస్ స్టేజ్ -1 చీఫ్ ఇంజినీర్ సురేష్ నాయక్ సస్పెన్షన్
Vijay Deverakonda | ‘రణబాలి’ విడుదల వేళ పుట్టపర్తిలో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న!
Jobs | యూకో బ్యాంక్‌లో 530 అప్రెంటిస్ ఖాళీలు.. అక్టోబర్ 29 చివరితేదీ
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

