కారుణ్య నియామకాలన్నీ క్రమబద్ధీకరణ ఆర్టీసీలో కార్మికులకు శుభవార్త
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీజీఎస్ఆర్టీసీ)లో కారుణ్య నియామకాల ద్వారా ఉద్యోగం చేస్తున్నవారికి సంస్థ శుభవార్త చెప్పింది. బ్రెడ్ విన్నర్, మెడికల్ ఇన్వాలిడేషన్ పథకాల కింద కన్సాలిడేటెడ్ పేపై నియమితులైన ఉద్యోగుల సేవలను క్రమబద్ధీకరిస్తూ ఎండీ వై నాగిరెడ్డి తాజాగా సర్యులర్ జారీ చేశారు.
- కారుణ్య నియామకాలన్నీ క్రమబద్ధీకరణ ఆర్టీసీలో కార్మికులకు శుభవార్త
హైదరాబాద్, సెప్టెంబర్ 18 (నమస్తే తెలంగాణ): తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీజీఎస్ఆర్టీసీ)లో కారుణ్య నియామకాల ద్వారా ఉద్యోగం చేస్తున్నవారికి సంస్థ శుభవార్త చెప్పింది. బ్రెడ్ విన్నర్, మెడికల్ ఇన్వాలిడేషన్ పథకాల కింద కన్సాలిడేటెడ్ పేపై నియమితులైన ఉద్యోగుల సేవలను క్రమబద్ధీకరిస్తూ ఎండీ వై నాగిరెడ్డి తాజాగా సర్యులర్ జారీ చేశారు. ఆగస్టు 12 నాటి కార్పొరేషన్ బోర్డు తీర్మానం ప్రకారం.. కన్సాలిడేటెడ్ పేపై పనిచేస్తున్న ఉద్యోగుల సేవలను ఆ తేదీ నుంచే క్రమబద్ధీకరించాలని నిర్ణయించారు.
బోర్డు ఆమోద తేదీ నాటికి 2 సంవత్సరాల సేవ, ప్రతి ఏటా 240 రోజులు పనిచేయాలనే నిబంధనతో సంబంధం లేకుండా అర్హులైన ఉద్యోగుల సేవలను తక్షణమే క్రమబద్ధీకరించాలని అపాయింటింగ్ అథారిటీస్‌ను ఎండీ ఆదేశించారు. ఇకపై బ్రెడ్ విన్నర్, మెడికల్ ఇన్వాలిడేషన్ పథకాల కింద చేపట్టే నియామకాలను రెగ్యులర్ ప్రాతిపదికన చేయాలని స్పష్టంచేశారు. ప్రస్తుతం దీర్ఘకాలిక సెలవు, అనారోగ్యం లేదా గైర్హాజరులో ఉన్న ఉద్యోగుల సేవలు వారు విధుల్లో చేరిన తేదీ నుంచి క్రమబద్ధీకరించబడుతాయని చెప్పారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
సింగరేణి మండలంలో 500 ఎకరాల్లో ఆయిల్‌పామ్ సాగు
మొక్కల వెంకటయ్యకు సత్కారం
Gayatri Devi | ఇంద్రకీలాద్రిపై గాయత్రీదేవి అలంకారంలో దర్శనమిచ్చిన దుర్గాదేవి
Ranabaali | ట్రైలర్‌కి డుమ్మా కొట్టిన రష్మిక .. ప్రీ రిలీజ్ ఈవెంట్లో విజయ్ దేవరకొండతో కలిసి సందడి
Supreme Court: సుప్రీంకోర్టును రాజకీయాల్లోకి లాగొద్దు: సీజేఐ సూర్యకాంత్
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

