iPhone 18 Pro | బంగారం అమ్మి భార్యకు ఐఫోన్ 18ప్రో.. భారత్‌లో మొదలైన 18 సిరీస్ అమ్మకాలు..!
iPhone 18 Pro : యాపిల్ ఐఫోన్ 18 సిరీస్ భారత్‌లో శుక్రవారం విక్రయానికి వచ్చింది. కొత్త ఫోను కొనుగోలు చేసేందుకు ముంబై, న్యూఢిల్లీ, నోయిడా, బెంగళూరులోని యాపిల్ స్టోర్ల వద్దకు అభిమానులు భారీగా తరలివచ్చారు.
iPhone 18 Pro | న్యూఢిల్లీ : యాపిల్ ఐఫోన్ 18 సిరీస్ భారత్‌లో శుక్రవారం విక్రయానికి వచ్చింది. కొత్త ఫోను కొనుగోలు చేసేందుకు ముంబై, న్యూఢిల్లీ, నోయిడా, బెంగళూరులోని యాపిల్ స్టోర్ల వద్దకు అభిమానులు భారీగా తరలివచ్చారు. స్టోర్లు తెరవకముందే క్యూలో నిల్చోవడం, ఇతర రాష్ర్టాల నుంచి రావడం, ఏకంగా బంగారం విక్రయించి, ఫోన్ కొనుగోలు చేయడం వంటి ఘటనలు చోటుచేసుకున్నాయి. నోయిడాలోని యాపిల్ స్టోర్ వద్ద ఉదయం 8 గంటలకు దుకాణం తెరవక ముందే క్యూలు ఏర్పడ్డాయి. ఢిల్లీకి చెందిన ఓ వ్యక్తి తన భార్య కోసం ఐఫోన్ 18 ప్రో కొనుగోలు చేసేందుకు వచ్చాడు. ఈ ఫోను కొనుగోలు కోసం బంగారం అమ్మినట్లు వెల్లడించాడు.
అదేస్టోర్కు పంజాబ్ నుంచి గుర్దితా సింగ్ అనే వ్యక్తి స్నేహితుడితో కలసి వచ్చాడు. త్వరలో వివాహం కానుండటంతో తన కాబోయే భార్యకు బహుమతిగా ఐఫోన్ 18 ప్రో కొనుగోలు చేశాడు. తన కోసం కూడా మరో ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ తీసుకున్నాడు. రెండు ఫోన్ల కోసం రూ.3.5లక్షలకు పైగా మొత్తాన్ని వెచ్చించాడు. వీరిద్దరూ ఉదయం 6 గంటల నుంచే స్టోర్ వద్ద ఉన్నారు. ఐఫోన్ ప్రో 265జీబీ వేరియంట్ ప్రారంభ ధర రూ. 1,64,900గా ఉండగా, అదే స్టోరేజ్ సామర్థ్యం కలిగిన ఐఫోన్ 18 ప్రో మాక్స్ ధర రూ.1,79,900 నుంచి మొదలవుతున్నది. స్టోరేజ్ ఆప్షన్లను అనుసరించి ధరలు పెరుగుతాయి.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Candidates Ultimatum | టీజీపీఎస్సీకి గ్రూప్-1 అభ్యర్థుల అల్టిమేటం.. జీఆర్ఎల్ ఇవ్వకుంటే ఆమరణ దీక్ష
Narendra Modi | నోయిడాలోని జెవార్ ఎయిర్‌పోర్టుకు నరేంద్ర మోదీ పేరు.. ప్రకటించిన యూపీ సీఎం యోగి
గ్రామాల్లో ఎక్సైజ్ దాడులు.. నాటుసారా, బెల్లం పానకం పట్టివేత
Bus Collides With Truck | లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. డ్రైవర్ మృతి, 12 మంది ప్రయాణికులకు గాయాలు
Nithin | నితిన్ కంబ్యాక్‌పై ప్రత్యేక ఫోకస్.. ‘అలియాస్ రుక్మిణి’ రిలీజ్ డేట్ ఫిక్స్!
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

