మెదడు.. రెండు అవయవాల కలయిక!
మానవ మెదడు ఒకే అవయవం అని శతాబ్దాలుగా శాస్త్రవేత్తలు భావిస్తూ వచ్చారు. అయితే అది ఒక్కటి కాదని, రెండు వేర్వేరు అవయవాల కలయిక అని తాజా అధ్యయనం వెల్లడించింది. మనిషి మెదడులో రెండు పురాతన నాడీ వ్యవస్థలు ఉన్నాయని, అవి వేర్వేరుగా అభివృద్ధి చెందాయని అమెరికాలోని స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ శాస్త్రవేత్తల అధ్యయనం వెల్లడించింది.
- తాజా అధ్యయనంలో వెల్లడి
కాలిఫోర్నియా : మానవ మెదడు ఒకే అవయవం అని శతాబ్దాలుగా శాస్త్రవేత్తలు భావిస్తూ వచ్చారు. అయితే అది ఒక్కటి కాదని, రెండు వేర్వేరు అవయవాల కలయిక అని తాజా అధ్యయనం వెల్లడించింది. మనిషి మెదడులో రెండు పురాతన నాడీ వ్యవస్థలు ఉన్నాయని, అవి వేర్వేరుగా అభివృద్ధి చెందాయని అమెరికాలోని స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ శాస్త్రవేత్తల అధ్యయనం వెల్లడించింది. ప్రస్తుతం మన శరీరంలో వెనుక మెదడు, ముందు మెదడు కలిసి పనిచేస్తున్నాయి. వీటిలో మొదటిది (వెనుక మెదడు), మనం శ్వాస తీసుకోవడానికి, నిద్రించడానికి, గుండె కొట్టుకోవడాన్ని నియంత్రించడానికి సహాయపడుతుంది. మరొకటి భాష, చైతన్యం, సంక్లిష్టమైన ఆలోచనలు, భావనలను అర్థం చేసుకోవడం వంటి విధులతో సంబంధం కలిగి ఉంటుంది.
పరిశోధన ఎందుకు ప్రారంభించారంటే..
మిలియన్ల సంవత్సరాల క్రితం మెదడులోని ఈ రెండు భాగాలు స్వతంత్రంగా అభివృద్ధి చెందిన రెండు వేర్వేరు అవయవాలుగా ఉండేవి. ఇది రెండు నాడీ వ్యవస్థలను కలిగి ఉండే జెల్లీ ఫిష్లను పోలి ఉంటుంది. మెదడు ముందు భాగం, వెనుక భాగం కంటే పూర్తిగా భిన్నమైన మూలకణాల నుంచి ఏర్పడుతుందని నిరూపించడం ఇదే మొదటిసారి అని ఈ అధ్యయన రచయితలలో ఒకరైన డాక్టర్ కైల్ లోహ్ తెలిపారు. శాస్త్రవేత్తలు ఎన్నో ఏండ్లుగా ఎదుర్కొంటున్న ఒక సమస్య కారణంగా ఈ పరిశోధన ప్రారంభమైంది. ప్రయోగశాలలో మానవ వెనుక మెదడు నాడీకణాలను పెంచడం వారికి ఇప్పటివరకు సాధ్యం కాలేదు. దీని వల్ల స్పైనల్ మస్క్యులర్ అట్రోఫీ వంటి వ్యాధులపై పరిశోధనలకు ఆటంకం ఏర్పడింది. అయితే మెదడు ముందు భాగపు కణాలను ఉత్పత్తి చేయడం అంత కష్టంగా అనిపించలేదు. శిశువు గర్భంలో ఎదుగుతున్నప్పుడు మెదడు ఎలా రూపుదిద్దుకుంటుందో కచ్చితంగా గమనించాలని పరిశోధకులు నిర్ణయించారు. ఇందుకోసం ఎదుగుతున్న ఎలుక పిండాలను పరిశీలించగా, వెనుక మెదడు అభివృద్ధి మార్గం మెదడులోని ఇతర ప్రాంతాల కంటే పూర్తిగా భిన్నంగా ఉన్నట్టు గుర్తించారు.
జన్యు అమరిక భిన్నం
ఈ రెండు ప్రాంతాల మధ్య డీఎన్ఏ ప్యాకేజింగ్ రూపాలు కూడా వేర్వేరుగా ఉన్నాయని పరిశోధకులు గుర్తించారు. ఇప్పుడు తాము వెనుక మెదడుకు సంబంధించిన న్యూరాన్లను ప్రయోగశాలలో పెంచి, వాటి పనితీరును అధ్యయనం చేయగలం అని డాక్టర్ లోహ్ తెలిపారు. మునుపటి ప్రయత్నాలు విఫలం కావడానికి గల కారణాన్ని రచయిత డాక్టర్ రయ్యాస్ జోఖై వివరిస్తూ.. శాస్త్రవేత్తలు ముందు, మధ్య మెదడు మూలకణాలను వెనుక మెదడు కణాలుగా మార్చడానికి ప్రయత్నించారని, కానీ తాజా అధ్యయనం ప్రకారం అది అసాధ్యం అని పేర్కొన్నారు. ఈ ఆవిష్కరణ ద్వారా పరిశోధక బృందం ప్రయోగశాలలో మొదటిసారిగా వెనుక మెదడు న్యూరాన్లను విజయవంతంగా తయారు చేసింది. ఈ ముందడుగు స్పైనల్ మస్క్యూలర్ అట్రోఫీ వంటి వ్యాధులపై పరిశోధనలకు ఎంతగానో ఉపయోగపడుతుంది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

