ఉద్యోగాలపై ప్రశ్నిస్తే దాడులా? కాంగ్రెస్ పాలనలో ప్రజాస్వామ్యం ఖూనీ: నాగరాజు గుర్రాల
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాస్వామ్య విలువలను కాలరాస్తోందని, ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించే ప్రతిపక్ష గొంతుకలను అణచివేయడానికి ప్రయత్నిస్తోందని బీఆర్ఎస్ ఎన్నారై నాయకుడు నాగరాజు గుర్రాల విమర్శించారు.
జోహన్నెస్‌బర్గ్, నవంబర్ 27: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాస్వామ్య విలువలను కాలరాస్తోందని, ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించే ప్రతిపక్ష గొంతుకలను అణచివేయడానికి ప్రయత్నిస్తోందని బీఆర్ఎస్ ఎన్నారై నాయకుడు నాగరాజు గుర్రాల విమర్శించారు. ఉద్యోగాలపై ప్రశ్నిస్తే దాడులకు దిగడం ప్రభుత్వ అసహనానికి, నిరంకుశ ధోరణికి నిదర్శనమని ఆయన మండిపడ్డారు. రాజ్యాంగ దినోత్సవం రోజునే ప్రజాస్వామ్య హక్కులకు విఘాతం కలిగించే ఘటన చోటుచేసుకోవడం దురదృష్టకరమని పేర్కొన్నారు.
హైదరాబాద్‌లోని ఆర్టీసీ క్రాస్‌రోడ్స్ బావర్చి హోటల్లో బీఆర్ఎస్ నేత మన్నె క్రిశాంక్ ఆధ్వర్యంలో నిర్వహించిన నిరసన కార్యక్రమంపై కాంగ్రెస్ నాయకులు, అనుచరులు దాడికి పాల్పడిన ఘటనను నాగరాజు గుర్రాల తీవ్రంగా ఖండించారు. నిరుద్యోగులకు రెండు లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని ఎన్నికల సమయంలో రాహుల్ గాంధీ ఇచ్చిన హామీపై ప్రశ్నిస్తూ ఆయన చిత్రపటంతో డిన్నర్ కార్యక్రమం నిర్వహించడం తప్పెలా అవుతుందని నిలదీశారు.
ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలుపై ప్రశ్నించడం, నిరుద్యోగుల సమస్యలను పాలకుల దృష్టికి తీసుకెళ్లడం ప్రతిపక్షాల ప్రజాస్వామ్య హక్కు అని స్పష్టం చేశారు. ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు ప్రతిపక్షాలకు లేదా? ఉద్యోగాలపై సమాధానం చెప్పాల్సిన ప్రభుత్వం ప్రశ్నించిన వారిపై దాడులకు దిగడం ఏమిటని ప్రశ్నించారు. హామీల అమలుపై నిలదీస్తున్న నిరసన కార్యక్రమాలను భౌతిక దాడులతో అడ్డుకోవడం కాంగ్రెస్ ప్రభుత్వ అసహనానికి పరాకాష్ట అని విమర్శించారు.
ఈ ఘటనలో స్వయంగా ఒక రాజ్యసభ సభ్యుడే దాడికి నాయకత్వం వహించి, తన అనుచరులతో దాడులు చేయించారనే ఆరోపణలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయని నాగరాజు గుర్రాల అన్నారు. ప్రజాప్రతినిధులు ప్రజాస్వామ్య విలువలను కాపాడాల్సిన బాధ్యత కలిగి ఉంటారని, అలాంటి వారిపై దాడులకు నాయకత్వం వహించారనే ఆరోపణలు రావడం తీవ్రంగా పరిగణించాల్సిన అంశమని పేర్కొన్నారు. శాంతియుతంగా నిరసన తెలియజేస్తున్న బీఆర్ఎస్ యువ నాయకులు మన్నె క్రిశాంక్, ముఠా జైసింహ, జగన్ పాటిమీది, దినేశ్ చౌదరి, విష్ణువర్ధన్ రెడ్డి, హరీశ్ రెడ్డిలపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు.
ఈ ఘటనకు రాష్ట్ర ప్రభుత్వం పూర్తి బాధ్యత వహించాలని, నిష్పక్షపాతంగా విచారణ జరిపించాలని నాగరాజు గుర్రాల డిమాండ్ చేశారు. దాడికి పాల్పడిన వారితో పాటు, దాడిని ప్రోత్సహించిన లేదా నాయకత్వం వహించిన వారిపై కూడా చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. తెలంగాణలో ప్రజాస్వామ్య హక్కులకు, నిరుద్యోగుల గొంతుకకు, ప్రతిపక్షాల నిరసన స్వేచ్ఛకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు.
ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ నాయకత్వానికి, ముఖ్యంగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు దక్షిణాఫ్రికా బీఆర్ఎస్ ఎన్నారై విభాగం తరఫున సంపూర్ణ సంఘీభావం ప్రకటించారు.
“ఉద్యోగాలు అడగడం నేరం కాదు. ప్రభుత్వాన్ని ప్రశ్నించడం తప్పు కాదు. ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే గొంతును భౌతిక దాడులతో అణచివేయలేరు. నిరుద్యోగులకు ఇచ్చిన హామీలపై సమాధానం చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే” అని నాగరాజు గుర్రాల స్పష్టం చేశారు.
Read Today's Latest Nri News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఉద్యోగాలపై ప్రశ్నిస్తే దాడులా? కాంగ్రెస్ పాలనలో ప్రజాస్వామ్యం ఖూనీ: నాగరాజు గుర్రాల
Jithu Madhavan | టాలీవుడ్లోకి ‘సీన్’ డైరెక్టర్ ఎంట్రీ.. మైత్రీ మూవీ మేకర్స్‌తో భారీ ప్రాజెక్ట్, హీరో ఎవరంటే?
Dads Little Friend | ‘డాడ్స్ లిటిల్ ఫ్రెండ్’ మూవీ రివ్యూ.. కంటతడి పెట్టించే ఫీల్‌గుడ్ ఫ్యామిలీ డ్రామా!
I Hate Marriage | ‘ఐ హేట్ మ్యారేజ్’ రివ్యూ.. నేటి తరం ప్రేమ, పెళ్లి ఆలోచనలకు అద్దం పట్టే చిత్రం ఎలా ఉందంటే?
Pawan Kalyan | పవన్ కళ్యాణ్ సినిమాను వదులుకోవడానికి అసలు కారణం ఇదే.. పదేళ్ల తర్వాత నిజం చెప్పిన దర్శకుడు సంపత్ నంది!
ట్రెండింగ్ వార్తలు
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!
Anjali Kulthe | ఆ ఉగ్రదాడి నుంచి 20 మంది గర్భిణీలను కాపాడిన నర్సు..!
Watch: బస్‌స్టాప్ వద్ద వేచి ఉన్న విద్యార్థులు.. వారిపైకి దూసుకెళ్లిన వాహనం
Rahul Gandhi | నా తండ్రిని చంపడానికే ఆయన భద్రతను తొలగించారు.. అప్పటి కేంద్ర సర్కారుపై రాహుల్‌గాంధీ ఆరోపణ..!
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ

