Watch: బస్‌స్టాప్ వద్ద వేచి ఉన్న విద్యార్థులు.. వారిపైకి దూసుకెళ్లిన వాహనం
truck runs over students | ఒక బస్‌స్టాప్ వద్ద కొందరు విద్యార్థులు వేచి ఉన్నారు. అదుపుతప్పిన వాహనం వారిపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ముగ్గురు విద్యార్థులు మరణించారు. మరో ఆరుగురు గాయపడ్డారు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
ముంబై: ఒక బస్‌స్టాప్ వద్ద కొందరు విద్యార్థులు వేచి ఉన్నారు. అదుపుతప్పిన వాహనం వారిపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ముగ్గురు విద్యార్థులు మరణించారు. మరో ఆరుగురు గాయపడ్డారు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. (truck runs over students) మహారాష్ట్రలోని పూణేలో ఈ సంఘటన జరిగింది. బుధవారం మధ్యాహ్నం 1.30 గంటల సమయంలో పూణేలోని బోప్‌దేవ్ ఘాట్ ప్రాంతంలో ఘోర ప్రమాదం జరిగింది. గర్వా హోటల్ సమీపంలోని బస్‌స్టాప్ షెల్టర్ వద్ద కొందరు విద్యార్థులు నిల్చొని ఉన్నారు.
కాగా, అక్కడి బిజీ రోడ్డుపై వెళ్తున్న ఒక రవాణా మినీ లారీ అదుపుతప్పింది. బస్‌స్టాప్ వద్ద బస్సు కోసం వేచి ఉన్న విద్యార్థులపైకి అది దూసుకెళ్లింది. గమనించిన కొందరు స్టూడెంట్స్ తప్పించుకునేందుకు పరుగులు తీశారు. అయితే మరి కొందరు విద్యార్థులు ఆ వాహనం కింద నలిగిపోయారు. ఈ సంఘటన తర్వాత ఆ ట్రక్ ఆగకుండా అక్కడి నుంచి వెళ్లిపోయింది.
మరోవైపు ఈ ప్రమాదంలో ముగ్గురు విద్యార్థులు మరణించారు. మరో ఆరుగురు గాయపడ్డారు. స్థానికులు వెంటనే స్పందించి సహాయక చర్యలు చేపట్టారు. పోలీసులు కూడా అక్కడకు చేరుకున్నారు. గాయపడిన విద్యార్థులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ప్రమాదంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆ వాహనాన్ని గుర్తించి డ్రైవర్‌ను అరెస్ట్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఆ ప్రాంతంలోని సీసీటీవీలో రికార్డైన ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
Pune, Bopdev Ghat 🚨⚠️
Disturbing Visuals 🚨🚨
Undivided Route + School Zone ⚠️
School Students, 2 wheelers, Auto Crossing + Student waiting near Bus Stand on the right…
Left side traffic slowed down over crossings ahead…Eicher container didnot slow down, instead swerved left…drove on unpaved road shoulder near Bus Stand hitting students & fled the scene…car on the left rammed auto…2 students dead, 3 injured
What’s wrong with Eicher Lorry Driver? Issues with braking/driver intoxicated?
@DriveSmart_IN
— Dave (Road Safety: City & Highways) (@motordave) November 25, 2026
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Watch: బస్‌స్టాప్ వద్ద వేచి ఉన్న విద్యార్థులు.. వారిపైకి దూసుకెళ్లిన వాహనం
KTR | రోడ్డు ప్రమాద బాధితుడికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ భరోసా
Exercise | వ్యాయామం చేయకముందు, చేసిన తరువాత ఎలాంటి ఆహారాలను తీసుకోవాలి..?
Sai Pallavi | సాయిపల్లవి నయా షేడ్.. ఇక కమర్షియల్ హీరోయిన్గా..!
AP Rains | ఏపీలో మరో రెండు రోజులపాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బస్‌స్టాప్ వద్ద వేచి ఉన్న విద్యార్థులు.. వారిపైకి దూసుకెళ్లిన వాహనం
Rahul Gandhi | నా తండ్రిని చంపడానికే ఆయన భద్రతను తొలగించారు.. అప్పటి కేంద్ర సర్కారుపై రాహుల్‌గాంధీ ఆరోపణ..!
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

