Exercise | వ్యాయామం చేయకముందు, చేసిన తరువాత ఎలాంటి ఆహారాలను తీసుకోవాలి..?
వ్యాయామం చేసిన తర్వాత శరీరానికి అవసరమైన పోషకాలను అందించడంపై చాలామంది దృష్టి పెడుతుంటారు. అయితే వ్యాయామానికి ముందు తీసుకునే ఆహారం కూడా అంతే ముఖ్యమని నిపుణులు చెబుతున్నారు.
Exercise | వ్యాయామం చేసిన తర్వాత శరీరానికి అవసరమైన పోషకాలను అందించడంపై చాలామంది దృష్టి పెడుతుంటారు. అయితే వ్యాయామానికి ముందు తీసుకునే ఆహారం కూడా అంతే ముఖ్యమని నిపుణులు చెబుతున్నారు. సరైన ఆహారం తీసుకోవడం వల్ల కండరాలకు అవసరమైన శక్తి అందడంతోపాటు త్వరగా అలసిపోకుండా వ్యాయామం చేయవచ్చని, అలాగే వ్యాయామానికి ముందు తీసుకునే ఆహారం కూడా అంతే ముఖ్యమని నిపుణులు చెబుతున్నారు. సాధారణంగా వ్యాయామానికి ముందు కార్బొహైడ్రేట్లు తీసుకోవడం మంచిది. ఇవి శరీరానికి త్వరగా శక్తిని అందించే ప్రధాన వనరు. అయితే ఎలాంటి వ్యాయామం చేస్తున్నారు, ఎంతసేపు చేస్తున్నారు, ఏ సమయంలో చేస్తున్నారు అనే అంశాలను బట్టి తీసుకోవాల్సిన ఆహారం మారుతుంది.
బ్లాక్ కాఫీ తాగితే ఎంతో మేలు..
వ్యాయామానికి ముందు బ్లాక్ కాఫీ లేదా కెఫీన్ తీసుకోవడం వల్ల ఏకాగ్రత పెరగడంతోపాటు అలసట తగ్గి, శారీరక సామర్థ్యం మెరుగుపడుతుంది. మెదడులో అలసట సంకేతాలను అడ్డుకోవడం ద్వారా వ్యాయామంపై దృష్టి పెట్టేందుకు సహాయపడుతుంది. ముఖ్యంగా ఉదయం వ్యాయామం చేసేవారికి ఇది ఉపయోగకరంగా ఉంటుంది. అయితే వ్యాయామానికి 30 నుంచి 60 నిమిషాల ముందు కాఫీ తీసుకోవడం మంచిది. ఇక కండరాల బలాన్ని పెంచుకోవడం, కండరాల పెరుగుదల లక్ష్యంగా వ్యాయామం చేసేవారికి ప్రొటీన్ అధికంగా ఉండే అల్పాహారం ఉపయోగపడుతుంది. ప్రొటీన్‌లోని అమైనో ఆమ్లాలు కండరాల విచ్ఛిన్నతను తగ్గించి, వాటి మరమ్మత్తు ప్రక్రియకు తోడ్పడతాయి. ముఖ్యంగా మూడు గంటలకు పైగా ఆహారం తీసుకోని వారు వ్యాయామానికి ముందు ప్రొటీన్ తీసుకోవడంపై దృష్టి పెట్టాలి.
గంటకు పైగా వ్యాయామం చేస్తే..
గంటకు పైగా వ్యాయామం చేసేవారు లేదా అధిక తీవ్రతతో శిక్షణ పొందేవారు కార్బొహైడ్రేట్లకు ప్రాధాన్యం ఇవ్వాలి. అరటిపండు, ఓట్స్, సంపూర్ణ ధాన్యాలతో తయారైన బ్రెడ్ వంటి ఆహారాలు శరీరానికి అవసరమైన శక్తిని అందిస్తాయి. ముఖ్యంగా 45 నుంచి 60 నిమిషాలకు మించి చేసే బరువుల వ్యాయామం, కార్డియో, అధిక తీవ్రత కలిగిన శిక్షణలో ఇవి ఉపయోగపడతాయి. అయితే వ్యాయామానికి ముందు ఏమీ తినకుండా ఉండడం సాధారణంగా మంచిది కాదు. దీనివల్ల త్వరగా అలసిపోవడం, వ్యాయామ సామర్థ్యం తగ్గడం జరుగుతుంది. అయినప్పటికీ ఉపవాస స్థితిలో వ్యాయామం చేయడానికి అలవాటు పడినవారు కొందరు ఇబ్బంది లేకుండా చేయవచ్చు. 45 నిమిషాల లోపు చేసే తక్కువ తీవ్రత కలిగిన కార్డియో వ్యాయామాలకు లేదా తిన్న వెంటనే కడుపులో అసౌకర్యం కలిగేవారికి ఇది అనుకూలంగా ఉంటుంది.
వ్యాయామం తరువాత ఏం తినాలి..?
వ్యాయామానికి ముందు కార్బొహైడ్రేట్లు, అవసరాన్ని బట్టి ప్రొటీన్ తీసుకోవడం శక్తి, వ్యాయామ సామర్థ్యం, కండరాల ఆరోగ్యానికి మేలు చేస్తుంది. కాఫీ ఏకాగ్రత, శారీరక సామర్థ్యాన్ని పెంచడంలో సహాయపడినా, అది సమతుల్య ఆహారానికి ప్రత్యామ్నాయం కాదు. సులభంగా జీర్ణమయ్యే కార్బొహైడ్రేట్లను ప్రధానంగా తీసుకుని, అదనపు ఉత్సాహం కోసం వ్యాయామానికి 30 నుంచి 60 నిమిషాల ముందు కాఫీ తీసుకోవచ్చు. వ్యాయామానికి ముందు కార్బొహైడ్రేట్లకు ప్రాధాన్యం ఇవ్వాలి. కండరాల పునరుద్ధరణ కోసం వ్యాయామం తర్వాత ప్రొటీన్ తీసుకోవడంపై దృష్టి పెట్టాలని నిపుణులు చెబుతున్నారు.
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | వ్యాయామం చేయకముందు, చేసిన తరువాత ఎలాంటి ఆహారాలను తీసుకోవాలి..?
Sai Pallavi | సాయిపల్లవి నయా షేడ్.. ఇక కమర్షియల్ హీరోయిన్గా..!
AP Rains | ఏపీలో మరో రెండు రోజులపాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు
Vijayasai Reddy | కాంగ్రెస్‌కు వైఎస్ జగనే వెన్నుపోటుదారుడు : పీఆర్పీ అధ్యక్షుడు విజయసాయిరెడ్డి
Skin Care | పగలు, రాత్రిని బట్టి చర్మాన్ని భిన్నంగా సంరక్షించాల్సిందే.. ఎందుకంటే..?
ట్రెండింగ్ వార్తలు
Rahul Gandhi | నా తండ్రిని చంపడానికే ఆయన భద్రతను తొలగించారు.. అప్పటి కేంద్ర సర్కారుపై రాహుల్‌గాంధీ ఆరోపణ..!
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్

