AP Rains | ఏపీలో మరో రెండు రోజులపాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు
AP Rains | ఏపీలో మరో రెండు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది.
అమరావతి : ఏపీలో ( Andhra Pradesh) మరో రెండు రోజుల పాటు వర్షాలు ( Rains ) కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. మన్నార్ గల్ఫ్ నుంచి నైరుతి బంగాళాఖాతం వరకు సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో ద్రోణి కొనసాగుతోందని తెలియజేసింది. ఈ ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో పిడుగులు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని స్పష్టం చేసింది.
గురువారం తూర్పుగోదావరి,పోలవరం, బాపట్ల, ప్రకాశం, కోనసీమ, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి , నెల్లూరు, కడప జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రకటించింది. బుధవారం మధ్యాహ్నం తిరుపతి జిల్లా నాయుడుపేటలో అత్యధికంగా 45.3 మిల్లీమీటర్లు, వాకాడులో 32.5 మి.మీ, పెన్నేపల్లెలో 30 మి.మీ. వర్షపాతం నమోదైంది. నెల్లూరు జిల్లా అల్లంపాడులో 41.5 మి.మీ., గూడూరులో 32.7 మి.మీ., విడవలూరులో 32 మి.మీ. , మొలకలపుండ్లలో 28 మి.మీ, నెల్లూరులో 23.2 మి.మీ., భీమవరంలో 22.7 మి.మీ. వర్షపాతం నమోదైనట్లు అధికారులు వెల్లడించారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AP Rains | ఏపీలో మరో రెండు రోజులపాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు
Vijayasai Reddy | కాంగ్రెస్‌కు వైఎస్ జగనే వెన్నుపోటుదారుడు : పీఆర్పీ అధ్యక్షుడు విజయసాయిరెడ్డి
Skin Care | పగలు, రాత్రిని బట్టి చర్మాన్ని భిన్నంగా సంరక్షించాల్సిందే.. ఎందుకంటే..?
Suvendu Adhikari | మోదీతో కలిసి పనిచేయాలని ప్రణబ్ ముఖర్జీ సలహా ఇచ్చారు: సువేందు అధికారి
‘ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలి’
ట్రెండింగ్ వార్తలు
Rahul Gandhi | నా తండ్రిని చంపడానికే ఆయన భద్రతను తొలగించారు.. అప్పటి కేంద్ర సర్కారుపై రాహుల్‌గాంధీ ఆరోపణ..!
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్

