Suvendu Adhikari | మోదీతో కలిసి పనిచేయాలని ప్రణబ్ ముఖర్జీ సలహా ఇచ్చారు: సువేందు అధికారి
Suvendu Adhikari | పశ్చిమ బెంగాల్ సీఎం సువేందు అధికారి సంచలన విషయం బయటపెట్టారు. రాజకీయాల్లో తన సొంత బలంతో ఎదగాలనుకుంటే తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ)ని వీడి ప్రధానమంత్రి మోదీతో కలిసి పనిచేయాలని మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ తనకు సలహా ఇచ్చారని ఆయన తెలిపారు.
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ సీఎం సువేందు అధికారి సంచలన విషయం బయటపెట్టారు. రాజకీయాల్లో తన సొంత బలంతో ఎదగాలనుకుంటే తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ)ని వీడి ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో కలిసి పనిచేయాలని మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ తనకు సలహా ఇచ్చారని ఆయన తెలిపారు. (Suvendu Adhikari) మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, ఆమె మేనల్లుడు అభిషేక్ బెనర్జీ నడుపుతున్న టీఎంసీ ఒక ప్రైవేట్ సంస్థ అని సువేందు అధికారి ఆరోపించారు. ‘నేను కూడా అక్కడ ఉన్నాను. కానీ నేను ఉద్యోగిగా ఉండను, అందుకే బయటకు వచ్చేశాను’ అని మీడియాతో అన్నారు.
కాగా, తన రాజకీయ పరివర్తనకు మార్గనిర్దేశం చేసిన మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని సువేందు అధికారి ప్రశంసించారు. ‘నాకు మొదట సలహాదారుగా ఉన్నది దివంగత ప్రణబ్ ముఖర్జీ గారు. ఆయన రాష్ట్రపతి అయిన తర్వాత రైసీనా హిల్స్‌కు నేను వెళ్లాను. అప్పుడు నా మేనల్లుడు కూడా నాతో పాటు వచ్చాడు. ప్రణబ్ నాతో ఇలా అన్నారు. ఎక్కువగా ఏమీ చెప్పకుండా, ‘నువ్వు ఏం చేయాలనుకుంటున్నావో ఆలోచించుకో. ఒకవేళ నువ్వు ఉద్యోగిగానే ఉండిపోవాలనుకుంటే, ఆమె దగ్గరే ఉండిపో. ఒకవేళ నీ సొంత శక్తితో ముందుకు వెళ్లాలనుకుంటే, అప్పుడు మోదీ దగ్గరకు వెళ్లు’ అని నాకు సూటిగా సలహా ఇచ్చారు’ అని అన్నారు.
మరోవైపు 2012 నుంచి 2017 వరకు రాష్ట్రపతిగా పనిచేసిన ప్రణబ్ ముఖర్జీ, 2020లో కన్నుమూశారు. అయితే ప్రణబ్ ముఖర్జీని ఎప్పుడు కలిశారు, ఆయన ఎప్పుడు ఈ సలహా ఇచ్చారు అన్నది సువేందు అధికారి వెల్లడించలేదు. నాటి మమతా బెనర్జీ ప్రభుత్వంలో కీలక వ్యూహకర్తగా, క్యాబినెట్ మంత్రిగా పనిచేసిన ఆయన, 2020 డిసెంబర్లో టీఎంసీకి రాజీనామా చేశారు. మిడ్నాపూర్‌లో జరిగిన బహిరంగ సభలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా సమక్షంలో బీజేపీలో చేరారు. 2021 అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ తరుఫున పోటీ చేసిన సువేందు అధికారి, ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత బీజేపీలో కీలక నేతగా ఎదిగారు. 2026 అసెంబ్లీ ఎన్నికల్లో బెంగాల్లో బీజేపీ విజయం సాధించడంతో సువేందు అధికారి సీఎం అయ్యారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Skin Care | పగలు, రాత్రిని బట్టి చర్మాన్ని భిన్నంగా సంరక్షించాల్సిందే.. ఎందుకంటే..?
Suvendu Adhikari | మోదీతో కలిసి పనిచేయాలని ప్రణబ్ ముఖర్జీ సలహా ఇచ్చారు: సువేందు అధికారి
‘ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలి’
మందుల్లేని ప్రభుత్వ ఆస్పత్రులు… రోగులకు తిప్పలు
విద్యార్థుల అభ్యసన స్థాయి పరిశీలన
ట్రెండింగ్ వార్తలు
Rahul Gandhi | నా తండ్రిని చంపడానికే ఆయన భద్రతను తొలగించారు.. అప్పటి కేంద్ర సర్కారుపై రాహుల్‌గాంధీ ఆరోపణ..!
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్

