Skin Care | పగలు, రాత్రిని బట్టి చర్మాన్ని భిన్నంగా సంరక్షించాల్సిందే.. ఎందుకంటే..?
మన చర్మం పగలు, రాత్రి ఒకే విధంగా పనిచేయదు. శరీరానికి నిద్ర, మెలకువ సమయాలను నియంత్రించే జీవ గడియారం ఉన్నట్లే చర్మానికీ 24 గంటల సహజ జీవ చక్రం ఉంటుంది. దీనినే సర్కేడియన్ రిథమ్ అంటారు. ఈ చక్రం చర్మం రక్షణ సామర్థ్యం, తేమను నిలుపుకోవడం, కణాల పునరుద్ధరణ, మరమ్మత్తు ప్రక్రియలను ప్రభావితం చేస్తుంది.
Skin Care | మన చర్మం పగలు, రాత్రి ఒకే విధంగా పనిచేయదు. శరీరానికి నిద్ర, మెలకువ సమయాలను నియంత్రించే జీవ గడియారం ఉన్నట్లే చర్మానికీ 24 గంటల సహజ జీవ చక్రం ఉంటుంది. దీనినే సర్కేడియన్ రిథమ్ అంటారు. ఈ చక్రం చర్మం రక్షణ సామర్థ్యం, తేమను నిలుపుకోవడం, కణాల పునరుద్ధరణ, మరమ్మత్తు ప్రక్రియలను ప్రభావితం చేస్తుంది. ఈ మార్పులను అర్థం చేసుకుని ఉదయం, రాత్రి వేళలకు అనుగుణంగా చర్మ సంరక్షణ పద్ధతులను పాటిస్తే మెరుగైన ఫలితాలు పొందవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. పగటిపూట చర్మం ప్రధానంగా బయటి వాతావరణ ప్రభావాల నుంచి తనను తాను రక్షించుకోవడంపై దృష్టి పెడుతుంది. సూర్యుడి నుంచి వచ్చే అతినీలలోహిత కిరణాలు, వాయు కాలుష్యం, దుమ్ము, నీలి కాంతి, ఉష్ణోగ్రతల్లో మార్పులు చర్మంపై ప్రభావం చూపుతాయి. వీటి వల్ల ఆక్సీకరణ ఒత్తిడి పెరిగి, కణాలను దెబ్బతీసే ఫ్రీ రాడికల్స్ ఏర్పడతాయి. ఫలితంగా చర్మ రక్షణ పొర బలహీనపడడం, వయసు పైబడినట్లు కనిపించడం, చర్మం రంగులో అసమానతలు, నిస్తేజం వంటి సమస్యలు వస్తాయి.
ఉదయం చర్మ సంరక్షణ ఇలా..
అందువల్ల ఉదయం చర్మ సంరక్షణలో రక్షణ, తేమ అందించడం ప్రధాన లక్ష్యాలుగా ఉండాలి. గాలిక్ యాసిడ్, విటమిన్ ఇ వంటి యాంటీ ఆక్సిడెంట్లు ఫ్రీ రాడికల్స్ ప్రభావాన్ని తగ్గించడంలో సహాయపడతాయి. నియాసినమైడ్ చర్మ రక్షణ పొరను బలోపేతం చేయడంతో పాటు రంగులో అసమానతలను తగ్గించేందుకు తోడ్పడుతుంది. హైలురోనిక్ యాసిడ్ చర్మంలో తేమను నిలుపుకోవడానికి ఉపయోగపడుతుంది. ఉదయం ముందుగా మృదువైన క్లెన్సర్‌తో ముఖాన్ని శుభ్రం చేసుకుని, యాంటీఆక్సిడెంట్లు ఉన్న సీరమ్, మాయిశ్చరైజర్ రాసుకోవాలి. చివరిగా అన్ని రకాల అతినీలలోహిత కిరణాల నుంచి రక్షణనిచ్చే సన్‌స్క్రీన్ ను తప్పనిసరిగా ఉపయోగించాలి. యాంటీఆక్సిడెంట్లు సన్‌స్క్రీన్‌కు అదనపు రక్షణ మాత్రమేనని, దానికి ప్రత్యామ్నాయం కాదని గుర్తుంచుకోవాలి.
రాత్రివేళ ఏం చేయాలి..?
సాయంత్రం తర్వాత చర్మం పనితీరులో మార్పులు చోటుచేసుకుంటాయి. రాత్రివేళ కణాల మరమ్మత్తు, పునరుద్ధరణ ప్రక్రియలు చురుగ్గా సాగుతాయి. ఈ సమయంలో చర్మ రక్షణ పొర పనితీరు, ఇతర పదార్థాలను గ్రహించే సామర్థ్యం, తేమ కోల్పోయే విధానం కూడా మారుతాయి. అందుకే రాత్రి చర్మ సంరక్షణలో తేమను తిరిగి అందించడం, రక్షణ పొరను బలోపేతం చేయడం, మంట లేదా చికాకును తగ్గించడం ముఖ్యం.
ఏమేం పదార్థాలు సహాయం చేస్తాయి..
ప్రో విటమిన్ బి5గా పిలిచే పాంథెనాల్ చర్మానికి తేమను అందించడంతోపాటు రక్షణ పొర మరమ్మత్తుకు సహాయపడుతుంది. సెంటెల్లా ఆసియాటికా చర్మపు చికాకును తగ్గించడంలో ఉపయోగపడుతుంది. బిఫిడా ఫెర్మెంట్ అనే పులియబెట్టిన పదార్థం కూడా చర్మ రక్షణ పొర ఆరోగ్యానికి తోడ్పడుతుంది. గాలిక్ యాసిడ్, విటమిన్ ఇ పగటిపూట పేరుకుపోయిన ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టాన్ని తగ్గించేందుకు సహాయపడతాయి. రాత్రి పడుకునే ముందు సన్‌స్క్రీన్, మేకప్, చెమట, దుమ్ము, కాలుష్యాన్ని తొలగించేలా ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. ఆ తర్వాత తేమను అందించే సీరమ్, చర్మ రక్షణ పొరను బలోపేతం చేసే పదార్థాలున్న మాయిశ్చరైజర్ ఉపయోగించవచ్చు.
ఉదయం చర్మాన్ని బయటి ప్రభావాల నుంచి రక్షించడం, తేమను అందించడం ముఖ్యం. రాత్రివేళ చర్మం సహజ మరమ్మత్తు ప్రక్రియలకు తోడ్పడేలా సంరక్షణ తీసుకోవాలి. ఏ పదార్థాలను ఉపయోగిస్తున్నామన్నదే కాకుండా, వాటిని ఏ సమయంలో ఉపయోగిస్తున్నామన్నది కూడా చర్మ ఆరోగ్యంపై ప్రభావం చూపుతుందని నిపుణులు సూచిస్తున్నారు.
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Skin Care | పగలు, రాత్రిని బట్టి చర్మాన్ని భిన్నంగా సంరక్షించాల్సిందే.. ఎందుకంటే..?
Suvendu Adhikari | మోదీతో కలిసి పనిచేయాలని ప్రణబ్ ముఖర్జీ సలహా ఇచ్చారు: సువేందు అధికారి
‘ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలి’
మందుల్లేని ప్రభుత్వ ఆస్పత్రులు… రోగులకు తిప్పలు
విద్యార్థుల అభ్యసన స్థాయి పరిశీలన
ట్రెండింగ్ వార్తలు
Rahul Gandhi | నా తండ్రిని చంపడానికే ఆయన భద్రతను తొలగించారు.. అప్పటి కేంద్ర సర్కారుపై రాహుల్‌గాంధీ ఆరోపణ..!
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్

