Vijayasai Reddy | కాంగ్రెస్‌కు వైఎస్ జగనే వెన్నుపోటుదారుడు : పీఆర్పీ అధ్యక్షుడు విజయసాయిరెడ్డి
Vijayasai Reddy | ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి చనిపోయాక కాంగ్రెస్‌కు జగన్ వెన్నుపోటు పొడిచారని పరివర్తన్ రాజనీతి పార్టీ అధ్యక్షుడు, మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి ఆరోపించారు.
అమరావతి : ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ( YSR ) చనిపోయాక కాంగ్రెస్‌కు జగన్ ( Jagan) వెన్నుపోటు పొడిచారని పరివర్తన్ రాజనీతి పార్టీ అధ్యక్షుడు, మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి ( Vijayasai Reddy ) ఆరోపించారు. బుధవారం ఢిల్లీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పలు అంశాలపై మాట్లాడారు.
వైఎస్సార్ మరణానంతరం ము ఖ్యమంత్రి కావాలని జగన్ ప్రయత్నించారని, పదవి ఇవ్వలేదనే కాంగ్రెస్ నుంచి జగన్ బయటకు వచ్చి వెన్నుపోటు పొడిచారని, తాను కాదని స్పష్టం చేశారు. వైఎస్ చనిపోయాక ఏం జరిగిందో సోనియా ఆత్మకథలో రాశారని గుర్తు చేశారు. ఆత్మగౌరవం కోసమే వైసీపీ నుంచి బయటక వచ్చానని, స్పష్టం చేశారు.
రెండు కుటుంబాలే ఏపీని పాలిస్తున్నాయని దుయ్యబట్టారు. పీఆర్పీలో యువతకే అధిక ప్రాధాన్యత ఇస్తామని వెల్లడించారు. తమ పార్టీలో సామాజిక న్యాయం పాటిస్తామన్నారు. తాను పార్టీ అధినేతనైనా సీఎం అభ్యర్థిని కాదని స్పష్టం చేశారు. పార్టీకి థాక్రే మాదిరిగా రాజకీయ సలహాదారుడిగా మాత్రమే ఉంటానని అన్నారు. జెన్‌జీ యువత రాజకీయాలకు రావాలి.. చట్టాలు చేసే శక్తిగా ఎదగాలని సూచించారు. ప్రజా సమస్యలపై వచ్చే ఉగాది తరువాత ఏపీలో పాదయాత్ర చేస్తానని విజయసాయి రెడ్డి పేర్కొన్నారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Vijayasai Reddy | కాంగ్రెస్‌కు వైఎస్ జగనే వెన్నుపోటుదారుడు : పీఆర్పీ అధ్యక్షుడు విజయసాయిరెడ్డి
Skin Care | పగలు, రాత్రిని బట్టి చర్మాన్ని భిన్నంగా సంరక్షించాల్సిందే.. ఎందుకంటే..?
Suvendu Adhikari | మోదీతో కలిసి పనిచేయాలని ప్రణబ్ ముఖర్జీ సలహా ఇచ్చారు: సువేందు అధికారి
‘ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలి’
మందుల్లేని ప్రభుత్వ ఆస్పత్రులు… రోగులకు తిప్పలు
ట్రెండింగ్ వార్తలు
Rahul Gandhi | నా తండ్రిని చంపడానికే ఆయన భద్రతను తొలగించారు.. అప్పటి కేంద్ర సర్కారుపై రాహుల్‌గాంధీ ఆరోపణ..!
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్

