ముంబై, సెప్టెంబర్ 18: మహీంద్రా అండ్ మహీంద్రా..దేశీయ మార్కెట్లోకి సరికొత్త ఎస్‌యూవీని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఎక్స్‌యూవీ 3ఎక్స్వో రెవెక్స్ ఎడ్జ్ పేరుతో విడుదల చేసిన ఈ కారు ప్రారంభ ధర రూ.9.39 లక్షలు కాగా, గరిష్ఠంగా రూ.10.39 లక్షలుగా నిర్ణయించింది.
దీంట్లో పెట్రోల్ ఆటోమేటిక్ రకం మాడల్ ధర రూ.9.99 లక్షలు. ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ప్లే, క్రూజ్ కంట్రోల్, రివ్యూ కెమెరా, 26.03 ఇంచుల హెచ్డీ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, కీలెస్ ఎంట్రీ, పుష్-బటన్ స్టార్ట్, ఆటోమేటిక్ హెడ్‌ల్యాంప్స్, ఆటోమేటిక్ వైపర్లు ఉన్నాయి.