బెర్క్‌షైర్ హ్యాథవేకు బఫెట్ బై
గిన విషయం తెలిసిందే. 56 ఏండ్లపాటు కంపెనీని ముందుండి నడిపించిన ఈయన.. ఇకపై చైర్మన్ ఎమిరేట్స్‌గా ఉంటారు. ఈ మేరకు శుక్రవారం కంపెనీ స్పష్టం చేసింది.
- చైర్మన్‌గా తప్పుకున్న దిగ్గజ మదుపరి
- 56 ఏండ్లపాటు సేవలు
- కొడుకే ఇక కొత్త సారథ్కిషైర్ హ్యాథవేకు సారథిగా కొనసా
గిన విషయం తెలిసిందే. 56 ఏండ్లపాటు కంపెనీని ముందుండి నడిపించిన ఈయన.. ఇకపై చైర్మన్ ఎమిరేట్స్‌గా ఉంటారు. ఈ మేరకు శుక్రవారం కంపెనీ స్పష్టం చేసింది. అలాగే సంస్థ బోర్డులో ఆయన డైరెక్టర్‌గా ఉంటారన్నది. కాగా, గత ఏడాదే కంపెనీ సీఈవోగా వారెన్ బఫెట్ తప్పుకున్న సంగతి విదితమే. దీంతో ఆ బాధ్యతలు గ్రెగ్ అబెల్ చేతికి వచ్చాయి.
నూతన చైర్మన్ కొడుకే
బెర్క్‌షైర్ హ్యాథవే నూతన చైర్మన్‌గా బఫెట్ కుమారుడు హోవర్డ్ బఫెట్‌కే బాధ్యతలు దక్కాయి. 1993 నుంచి కంపెనీ బోర్డులో హోవర్డ్ ఉన్నారు. ఇక వాటాదారులకు రాసిన ఓ లేఖలో ‘1965 నుంచి బెర్క్‌షైర్‌కు సేవలు అందిస్తున్నాను’ అని బఫెట్ అన్నారు. ‘ఈ వృత్తిలో 60 ఏండ్లకు పైగా ఉన్నప్పటికీ.. ఇంకా ప్రపంచంలో అత్యుత్తమ ఉద్యోగం నాదే. నా వయసులో ఉన్నవారెవరూ ఇలా చెప్పలేరు’ అంటూ బెర్క్‌షైర్ హ్యాథవేతో తనకు ఏర్పడిన విడదీయరాని అనుబంధాన్ని బఫెట్ ఈ సందర్భంగా వివరించారు.
అబెల్, హోవర్డ్ సారథ్యంలో కంపెనీ మరిన్ని విజయాలను సాధిస్తుందన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. ఇదిలావుంటే బెర్క్‌షైర్ హ్యాథవే స్టాక్స్ ద్వారా బఫెట్ సంపద గణనీయంగా పెరిగింది. ఈ ఏడాది జూలై 2026నాటికి అది 140 బిలియన్ డాలర్లకు పైగానే ఉన్నది. నిజానికి 2006 నుంచి బఫెట్ దాదాపు 66 బిలియన్ డాలర్ల స్టాక్స్‌ను వదులుకున్నారు. ఇక దాతృత్వంలోనూ ఆయన మేటిగానే నిలిచారు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Pushkar Singh Dhami | ఉత్తరాఖండ్‌లో మద్రాసాలలో శుక్రవారం సెలవు రద్దు.. ఇకపై ఆదివారమే సెలవు
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
KTR | కేటీఆర్‌ను కలిసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు.. వీడియో
SBI Data Leak | ఎస్బీఐపై సైబర్ దాడి.. డాటా లీక్.. ఖాతాదారులు ఏం చేయాలంటే
Asian Para Games: స్ప్రింటర్ సిమ్రన్ శర్మకు రెండో గోల్డ్ మెడల్
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!

