Telangana | రాష్ర్టానికి మళ్లీ మొండిచెయ్యి.. 16వ ఆర్థిక సంఘం సిఫారసుల్లో రాష్ట్రానికి అత్తెసరు నిధులే!
Telangana | పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో కేసీఆర్ వేసిన ఆర్థిక పునాదులతో దేశ ఆర్థిక వ్యవస్థలో కీలకంగా మారిన తెలంగాణకు 16వ ఆర్థిక సంఘం సిఫార్సులు మరోసారి నిరాశ కలిగిస్తున్నాయి.
Telangana | హైదరాబాద్, ఆగస్టు 10 (నమస్తే తెలంగాణ): పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో కేసీఆర్ వేసిన ఆర్థిక పునాదులతో దేశ ఆర్థిక వ్యవస్థలో కీలకంగా మారిన తెలంగాణకు 16వ ఆర్థిక సంఘం సిఫార్సులు మరోసారి నిరాశ కలిగిస్తున్నాయి. కేంద్ర పన్నుల వసూళ్లలో రాష్ట్రాల వాటాను 41 శాతంగా కొనసాగించినా, ఆ మొత్తంలో తెలంగాణకు దకే వాటా మాత్రం ఆశించిన స్థాయిలో పెరుగలేదు. తెలంగాణ ఆర్థిక వ్యవస్థ దేశానికి ఇస్తున్న నిధులకు.. ప్రతిఫలంగా రాష్ట్రానికి కేంద్రం ఇస్తున్న నిధులకు ఎక్కడా పొంతన కుదరడం లేదు. తెలంగాణ వాటాకు సంబంధించిన గణాంకాలను విశ్లేషి స్తే ఈ విషయం స్పష్టంగా అర్థమవుతున్నది. 14వ ఆర్థిక సంఘం కాలంలో కేంద్ర పన్నుల్లో తెలంగాణ వాటా 2.44% ఉండగా, 15వ సంఘం కాలానికి అది 2.10 శాతానికి తగ్గిం ది. 16వ సంఘం సిఫారసుల్లో 2.17 శాతానికి స్వల్పంగా పెరిగినప్పటికీ, 14వ ఆర్థిక సం ఘం కాలంతో పోలిస్తే 0.27% పాయింట్లు తక్కువగా నమోదయ్యాయి.
అభివృద్ధిలో దూ సుకుపోతున్న రాష్ట్రానికి పన్నుల వాటాలో మాత్రం వెనుకడుగు ఎందుకనే ప్రశ్న తలెత్తుతున్నది. కేసీఆర్ సర్కారు చేపట్టిన గుణాత్మక సంస్కరణలతో తెలంగాణ గడిచిన 12 ఏండ్లు గా వేగంగా అభివృద్ధి చెందుతున్నది. పారిశ్రామిక, సేవా రంగాల విస్తరణతో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ విస్తరిస్తున్నది. రాష్ట్ర జీఎస్డీపీ, పన్నుల వసూళ్లు, పారిశ్రామిక-సేవా రంగాల విస్తరణ వంటి అంశాల్లో రాష్ట్రం.. జాతీయ ఆర్థిక వ్యవస్థకు గణనీయంగా సహకరిస్తున్నది. అందుకు అనుగుణంగా కేంద్ర పన్నుల పంపిణీలో న్యాయమైన వాటా దకాల్సిన అవసరం ఉన్నదని తెలంగాణవాదులు డిమాండ్ చేస్తున్నారు.
ఖర్చుచేసే స్వేచ్ఛ ఎంత?
16వ ఆర్థిక సంఘం ఐదేండ్ల కాలానికి మొత్తం రూ.9.47 లక్షల కోట్ల గ్రాంట్లను సిఫార్సు చేసింది. ఇందులో స్థానిక సంస్థలు, విప త్తు నిర్వహణకు ప్రధానంగా నిధులు కేటాయించారు. 15వ ఆర్థిక సంఘం సిఫారసు చేసి న రెవెన్యూ డెఫిసిట్, రంగాలవారీగా రాష్ట్ర ప్రత్యేక గ్రాంట్లను 16వ సంఘం కొనసాగించలేదు. తెలంగాణకు స్థానిక సంస్థల గ్రాంట్ల కింద గ్రామీణ స్థానిక సంస్థలకు బేసిక్ గ్రాంట్‌గా రూ.7,974 కోట్లు, పనితీరు గ్రాంట్లకు రూ.997 కోట్లు చొప్పున కేటాయింపులు ఉన్నాయి. పట్టణ స్థానిక సంస్థలకు బేసి క్ గ్రాంట్‌గా 9,239 కోట్లు, పనితీరు గ్రాం ట్ల కు 1,155 కోట్లు చొప్పున ఉన్నాయి. విపత్తు నిర్వహణ గ్రాంట్ 2,774 కోట్లుగా ఉన్నది.
నిధులు కావాలంటే ముందుగా షరతులు!
స్థానిక సంస్థల గ్రాంట్ల విడుదలకు మూడు ప్రధాన షరతులను 16వ ఆర్థిక సంఘం నిర్దేశించింది. రాజ్యాంగ నిబంధనల ప్రకారం స్థానిక సంస్థల ఏర్పాటు, వాటి ప్రొవిజనల్, ఆడిటెడ్ ఖాతాలను ప్రజలకు అందుబాటులో ఉంచడం, రాష్ట్ర ఆర్థిక సంఘాన్ని సకాలంలో ఏర్పాటు చేయడం తప్పనిసరి. బేసిక్ గ్రాంట్‌లో సగం పారిశుద్ధ్యం, ఘన వ్యర్థాల నిర్వహణ లేదా నీటి నిర్వహణకు కట్టిపడేశారు. ఇలాంటి నిబంధనలు పారదర్శకతకు ఉపయోగపడవచ్చు. కానీ రాష్ట్రాలకు అవసరమైన చోట నిధులను వినియోగించుకునే ఆర్థిక స్వేచ్ఛను తగ్గించే అవకాశం కూడా ఉన్నది. ఒకే షరతులతో నిధుల్ని కట్టడి చేయడం ఎంతవరకు సమర్థనీయం అనే ప్రశ్న తలెత్తుతున్నది.
హైదరాబాద్‌కు ప్రత్యేక గ్రాంట్ ఎక్కడ?
16వ ఆర్థిక సంఘం పట్టణ స్థానిక సంస్థలకు ప్రత్యేక మౌలిక వసతుల గ్రాంట్‌గా రూ.56,100 కోట్లను సిఫారసు చేసింది. 2011 జనాభా ప్రకారం 10 నుంచి 40 లక్షల జనాభా ఉన్న నగరాల్లో సమగ్ర మురుగునీటి నిర్వహణ వ్యవస్థ కోసం ఈ నిధులను వినియోగించాలి. అయితే అర్హత నగరాల జాబితాలో తెలంగాణ నుంచి ఒక నగరం కూడా చోటు కల్పించలేదు. హైదరాబాద్ వంటి మహానగరానికి మౌలిక వసతులు పెరుగాల్సి ఉన్నప్పటికీ 2011 జనాభా ఆధారంగా రూపొందించిన అర్హత ప్రమాణాల వల్ల గ్రాంట్ పరిధిలోకి రాకపోవడం విధానపరమైన లోపంగా నిఫుణులు భావిస్తున్నారు.
ఆర్థిక క్రమశిక్షణ పేరుతో రాష్ట్రాలపై కట్టడి
రాష్ట్రాల ఆర్థిక లోటును జీఎస్డీపీలో 3 శాతానికి పరిమితం చేయాలని ఆర్థిక సంఘం సిఫారసు చేసింది. ఆఫ్-బడ్జెట్ రుణాలను నిలిపివేసి.. వాటినీ బడ్జెట్లో చూపించాలని సూచించింది. ఆర్థిక క్రమశిక్షణ అవసరమే… కానీ అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాలకు భారీ మౌలిక వసతుల అవసరాలు ఉన్న సమయంలో రుణ పరిమితులు, ఖర్చులపై నియంత్రణలు పెంచితే కొత్త ప్రాజెక్టులు, పట్టణ మౌలిక వసతులు, సాగునీరు, పారిశ్రామిక వసతులపై రాష్ట్రాల పెట్టుబడి సామర్థ్యం దెబ్బతినే ప్రమాదం ఉన్నది. వాస్తవ అభివృద్ధి అవసరాలనూ 16వ ఆర్థిక సంఘం సిఫారసులు పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరమున్నది.
జనాభా ప్రాతిపదిక.. తెలంగాణకు మరో సవాల్
16వ ఆర్థిక సంఘం పంపిణీలో 2011 జనాభాకు 17.5 శాతం వాటా ఇచ్చింది. జనాభా నియంత్రణలో మెరుగైన పనితీరు కనబరిచిన రాష్ట్రాలకు ప్రోత్సాహం ఇచ్చే ‘డెమోగ్రాఫిక్ పర్ఫార్మెన్స్’ వాటాను 12.5 శాతం నుంచి 10 శాతానికి తగ్గించింది. అంటే జనాభా నియంత్రణలో మెరుగైన పనితీరు కనబరిచిన రాష్ట్రాలకు లభించే ప్రయోజనం తగ్గింది. తెలంగాణ వంటి రాష్ట్రాలు అభివృద్ధి, పట్టణీకరణ, మౌలిక వసతుల విస్తరణతోపాటు జనాభా నియంత్రణలోనూ ముందంజలో ఉన్నప్పటికీ, నిధుల పంపిణీ విధానంలో ఆ పనితీరుకు తగిన స్థాయి ప్రాధాన్యం దక్కలేదని తెలుస్తున్నది. 15వ ఆర్థిక సంఘంలో పన్నులు వసూలు చేసే సామర్థ్యాన్ని ప్రోత్సహించే ‘ట్యాక్స్ అండ్ ఫిసల్ ఎఫర్ట్స్’కు 2.5 శాతం వెయిటేజ్ ఉండగా, 16వ సంఘం దానిని తొలగించి ‘కాంట్రిబ్యూషన్ టు జీడీపీ’కి 10 శాతం వెయిటేజ్ ఇచ్చారు.
2026- 31లో తెలంగాణకు సిఫారసులు
- కేంద్ర పన్నుల్లో తెలంగాణ వాటా: 2.17%
- గ్రామీణ స్థానిక సంస్థల బేసిక్ గ్రాంట్: రూ.7,974 కోట్లు
- గ్రామీణ పనితీరు గ్రాంట్ : 997 కోట్లు
- పట్టణ స్థానిక సంస్థల బేసిక్ గ్రాంట్ : రూ.9,239 కోట్లు
- పట్టణ పనితీరు గ్రాంట్: 1,155 కోట్లు
- విపత్తు నిర్వహణ గ్రాంట్: 2,774 కోట్లు
- పట్టణ ప్రత్యేక మౌలిక వసతుల గ్రాంట్: తెలంగాణ నగరాలకు చోటులేదు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

