Viral News | ఓ బాలుడి వింత ప్రవర్తన.. రోజుల తరబడి నీళ్లలోనే..!
Viral News | సాధారణంగా మనిషి ఎక్కువసేపు నీళ్లలో ఉండాలంటే ఇబ్బంది పడుతాడు. కానీ ఓ 16 ఏళ్ల బాలుడు (16 yers boy) ఇక్బాల్ షేక్ (Iqbal Sheik) మాత్రం రోజుల తరబడి నీళ్లలోనే ఉంటున్నాడు. వారంలో ఏకంగా నాలుగైదు రోజులు నీళ్లలోనే గడుపుతున్నాడు. ఒక్కోసారి ఏడు రోజులపాటు రాత్రిపగలూ చెరువు (Pond) లో ఉంటున్నాడు.
Viral News : సాధారణంగా మనిషి ఎక్కువసేపు నీళ్లలో ఉండాలంటే ఇబ్బంది పడుతాడు. కానీ ఓ 16 ఏళ్ల బాలుడు (16 yers boy) ఇక్బాల్ షేక్ (Iqbal Sheik) మాత్రం రోజుల తరబడి నీళ్లలోనే ఉంటున్నాడు. వారంలో ఏకంగా నాలుగైదు రోజులు నీళ్లలోనే గడుపుతున్నాడు. ఒక్కోసారి ఏడు రోజులపాటు రాత్రిపగలూ చెరువు (Pond) లో ఉంటున్నాడు. బయటికి వస్తే ఒళ్లంతా మంటగా ఉంటోందని, నీళ్లలోనే హాయిగా ఉందని చెబుతున్నాడు. అతడి వింత ప్రవర్తన స్థానికులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
వివరాల్లోకి వెళ్తే.. పశ్చిమబెంగాల్లోని ముర్షిదాబాద్ జిల్లా బెల్దాంగాకు చెందిన 16 ఏళ్ల ఇక్బాల్ షేక్ గత ఐదేళ్లుగా బయటకంటే ఏళ్లలోనే ఎక్కువగా ఉంటున్నాడు. అతడు చెరువుల్లోనే ఎక్కువగా గడుపుతున్నాడని స్థానికులు చెబుతున్నారు. అయితే శరీరంలో మంటగా అనిపించడం వల్లే నీటిలో ఉంటున్నానని ఇక్బాల్ చెబుతున్నాడు. నీళ్ల నుంచి బయటకు రాగానే మంట మొదలవుతుందని, నీటిలోకి వెళ్లగానే ఉపశమనం కలుగుతుందని అంటున్నాడు. ఇలా రోజుల తరబడి నీటిలో ఉండటంతో అతడు అనారోగ్యాల బారినపడుతున్నాడు.
చర్మవ్యాధులు వస్తున్నాయి. తరచూ జలుబు, దగ్గు వెంటాడుతున్నాయి. స్థానిక ప్రభుత్వాసుపత్రిలో చికిత్స తీసుకున్నా ఫలితం లేకుండాపోయింది. ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లే స్తోమత తమకు లేదని ఇక్బాల్ కుటుంబసభ్యులు చెబుతున్నారు. దాంతో అతడికి చికిత్స చేయించేందుకు స్థానికులు ముందుకొస్తున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
Night Routine Habits | రాత్రి ఈ 6 పనులు చేస్తున్నారా? మీ జీవితంలో అద్భుతమైన మార్పు ఖాయం!
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

