Delimitation | మోదీ సర్కార్‌లో కొత్త ఆశలు.. డీలిమిటేషన్ బిల్లుకు డీఎంకే, ఎన్సీపీ(ఎస్పీ) మద్దతు!
Delimitation | నియోజకవర్గాల పునర్విభజన(డీలిమిటేషన్)పై ప్రతిపాదిత రాజ్యా ంగ సవరణను ఆమోదింపచేయడానికి అవసరమైన ప్రత్యేక మెజారిటీని సాధించే దిశగా బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే ఒక అడుగు ముందుకు వేసింది. సవరించిన ప్రతిపాదనలకు డీఎంకే, ఎన్సీపీ(ఎస్పీ) తమ మద్దతును ప్రకటించాయి.
Delimitation | న్యూఢిల్లీ: నియోజకవర్గాల పునర్విభజన(డీలిమిటేషన్)పై ప్రతిపాదిత రాజ్యా ంగ సవరణను ఆమోదింపచేయడానికి అవసరమైన ప్రత్యేక మెజారిటీని సాధించే దిశగా బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే ఒక అడుగు ముందుకు వేసింది. సవరించిన ప్రతిపాదనలకు డీఎంకే, ఎన్సీపీ(ఎస్పీ) తమ మద్దతును ప్రకటించాయి. మొత్తం 30 మంది లోక్‌సభ ఎంపీలను కలిగి ఉన్న ఈ రెండు పార్టీలు మద్దతు ఇస్తే ప్రభుత్వానికి లభించే మద్దతు సంఖ్య 320 నుంచి 350కి పెరగవచ్చు. అయితే ప్రస్తుత సభ్యులందరూ(540 మంది) ఓటింగ్‌లో పాల్గొంటే, ప్రభుత్వం కోరుకున్న మూడింట రెండు వంతుల మెజారిటీని సాధించడానికి ఇంకా 10 ఓట్ల కొరత ఉంటుంది.
ఎన్డీయే లెక్కలేంటి?
ప్రభుత్వానికి మద్దతు ఉంటుందని అంచనా వేసిన 320 మంది ఎంపీలలో బీజేపీకి చెందిన 241 మంది పార్లమెంట్ సభ్యులతో పాటు ఆ పార్టీ మిత్రపక్షాలు, ఇతర సమూహాలకు చెందిన సభ్యులు కూడా ఉన్నారు. డీఎంకేకు చెందిన 22 మంది ఎంపీలు, ఎన్సీపీ(ఎస్పీ)కి చెందిన 8 మంది ఎంపీలు లోటును గణనీయంగా తగ్గించగలరు. వైఎస్ఆర్సీపీ కూడా మద్దతు ఇచ్చే అవకాశం ఉన్న మరో పక్షం. ఆ పార్టీకి లోక్‌సభలో నలుగురు సభ్యులు ఉన్నారు. ఒక రాజ్యాంగ సవరణకు ప్రతి సభలోని మొత్తం సభ్యులలో మెజారిటీతో పాటు హాజరై ఓటు వేసిన సభ్యుల ఓట్లలో కనీసం మూడింట రెండు వంతుల బలం లభించాలి.
అందువల్ల బిల్లుకు మద్దతు ఇచ్చే ఎంపీల సంఖ్యను పెంచకుండానే ఓటింగ్‌కు దూరంగా ఉండటం, హాజరుకాకపోవడం ఫలితాన్ని ప్రభావితం చేయగలవు. ఉదాహరణకు మొత్తం సభ్యులలో 525 మందికి మించకుండా ఓటు వేసినట్లయితే 350 అనుకూల ఓట్లు మూడింట రెండు వంతుల నిబంధనను నెరవేరుస్తాయి. ఒకవేళ 354 అనుకూల ఓట్లు పడితే ఓట్ల సంఖ్య 531 అవుతుంది. సభలోని మొత్తం సభ్యుల సంఖ్యలో మెజారిటీ ఉండాలనే ప్రత్యేక నిబంధన కూడా యథాతథంగా వర్తిస్తుంది. ఏప్రిల్ 17న రాజ్యాంగ సవరణకు అవసరమైన మెజారిటీని సాధించడంలో ప్రభుత్వం విఫలమైంది. అప్పుడు బిల్లుకు అనుకూలంగా 298 ఓట్లు, వ్యతిరేకంగా 230 ఓట్లు వచ్చాయి.
బీజేడీకి బుజ్జగింపులు
ప్రతిపాదిత డీలిమిటేషన్ బిల్లుపై రాజకీయ చర్చ వేడెక్కుతున్న తరుణంలో అధికార ఎన్డీయే, ప్రతిపక్ష ఇండియా కూటమి రెండూ కూడా బిజూ జనతా దళ్(బీజేడీ) మద్దతు కోరినట్టు సమాచారం. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, పార్టీ సీనియర్ నాయకుడు జైరామ్ రమేశ్ శనివారం బీజేడీ రాజ్యసభ ఎంపీ మానస్ మంగరాజ్తో ఫోన్లో మాట్లాడినట్టు తెలుస్తున్నది. ఎన్డీయే కూడా బీజేడీని సంప్రదించింది. బిల్లుకు బీజేడీ మద్దతు కోరేందుకు మంగరాజ్ను కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు సంప్రదించినట్టు బీజేడీ వర్గాలు తెలిపాయి.

Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- BJP
- Delimitation
- loksabha seats
- NDA
RELATED ARTICLES
తాజా వార్తలు
Delimitation | మోదీ సర్కార్‌లో కొత్త ఆశలు.. డీలిమిటేషన్ బిల్లుకు డీఎంకే, ఎన్సీపీ(ఎస్పీ) మద్దతు!
Nizamia Tibbi | శతాబ్దాల ఘనత ఢిల్లీకి వినపడలే.. అత్యంత పురాతన మెడికల్ కాలేజీ హైదరాబాద్‌లో.. అయినా గుర్తింపునకు నోచుకోలే!
Telangana | తెలంగాణలో కొత్త రాజకీయం.. 27కు పెరుగనున్న మంత్రులు.. మహిళలకు 9లోక్‌సభ, 60 అసెంబ్లీ సీట్లు
Assembly Elections | అసెంబ్లీ ఎన్నికలు ఎప్పుడు.. ప్రస్తుత ప్రభుత్వాన్నే కొనసాగిస్తారా? లేక.. రాష్ట్రపతి పాలన విధిస్తారా??
Delimitation | తెలంగాణకు 26 లోక్‌సభ సీట్లు.. పునర్విభజన తర్వాత పెరిగే లోక్‌సభ స్థానాల పటాన్ని విడుదల చేసిన కేంద్రం!
ట్రెండింగ్ వార్తలు
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!

