AI Investment Advice | ఏఐ చెప్పిందని పెట్టుబడి పెడుతున్నారా.. ఈ తప్పు చేస్తే భారీ నష్టమే.. నిపుణుల హెచ్చరికలు ఇవీ!
గత కొన్నేండ్లుగా ఆర్థిక మార్గదర్శకాల కోసం ఏఐని వాడుతున్నవారి సంఖ్య అంతకంతకూ పెరిగిపోతున్నది. బ్రిటన్‌లో దాదాపు 2.8 కోట్ల మంది గత ఏడాది తమ వ్యక్తిగత ఆర్థిక వ్యవహారాల్లో ఏఐ సాధనాలను సలహాలు అడిగారని లాయిడ్స్ బ్యాంకింగ్ గ్రూప్ చెప్తుండటం గమనార్హం. దీంతో ఏఐ ద్వారా వచ్చిన సలహా అన్నివేళలా పాటించడానికి వీలైంది కాదని నిపుణులు సూచిస్తున్నారు.
AI Investment Advice | కృత్రిమ మేధస్సు (ఏఐ) సేవలు అందరికీ అందుబాటులోకి వచ్చిన తర్వాత వాటి వినియోగం విస్తృతమైపోయింది. సందేహాల నివృత్తికి, సమాచార శోధనకు.. ఇలా అన్నింటికీ ఇప్పుడు ఏఐనే ఆధారమంటే ఎంతమాత్రం అతిశయోక్తి కాదు. ఈ క్రమంలోనే ఆర్థికపరమైన వ్యవహారాల్లో సలహాల కోసం కూడా ఏఐపై ఆధారపడుతున్నారు. మీరు కూడా అంతేనా? అయితే జాగ్రత్త. ఏఐని అడిగి పెట్టుబడులు పెడితే ముప్పేనని నిపుణులు హెచ్చరిస్తున్నారు మరి. ఏఐ అనేది ఓ సాధనం మాత్రమేనని గుర్తుచేస్తున్నారు.
గత కొన్నేండ్లుగా ఆర్థిక మార్గదర్శకాల కోసం ఏఐని వాడుతున్నవారి సంఖ్య అంతకంతకూ పెరిగిపోతున్నది. బ్రిటన్‌లో దాదాపు 2.8 కోట్ల మంది గత ఏడాది తమ వ్యక్తిగత ఆర్థిక వ్యవహారాల్లో ఏఐ సాధనాలను సలహాలు అడిగారని లాయిడ్స్ బ్యాంకింగ్ గ్రూప్ చెప్తుండటం గమనార్హం. దీంతో ఏఐ ద్వారా వచ్చిన సలహా అన్నివేళలా పాటించడానికి వీలైంది కాదని నిపుణులు సూచిస్తున్నారు. ఉదాహరణకు పన్నుల భారాన్ని తగ్గించుకోవడానికి నేను ఏం చేయాలి? అని చాట్‌బోట్‌ను ఓ యూజర్ అడిగినప్పుడు.. అది మోనాకోకు వెళ్లాలని సమాధానం ఇచ్చినట్టు చార్టెడ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పర్సనల్ అండ్ డెవలప్మెంట్కు ఏఐ సలహాదారుడిగా ఉన్న డానిలో మెక్గెర్రీ వివరించారు. దీన్నిబట్టి ఏఐ సమాధానాల్లో ఉన్న అనుసరణీయత ఎంత? అన్నది బయటపడుతున్నదని అంటున్నారంతా. నిజానికి సాంకేతికంగా ఈ సమాధానం సరైనదే (అక్కడ పన్నులు తక్కువ) అయినప్పటికీ.. వాస్తవ పరిస్థితులకు మాత్రం విరుద్ధమన్నది ఎక్స్పర్ట్స్ మాట. ఇక రిటైల్ మదుపర్లలో 18-34 ఏండ్ల మధ్య ఉన్నవారు (36 శాతం) ఏఐపై ఆధారపడి తమ పెట్టుబడులపై ఎక్కువగా నిర్ణయాలు తీసుకుంటున్నారని ఫిడెలిటి ఇంటర్నేషనల్ అధ్యయనంలో తేలింది. ఆ తర్వాత 35-54 ఏండ్లవారు (29 శాతం) ఉన్నారన్నది. 55 ఏండ్లకుపైబడినవారిలో 5 శాతం మందే ఏఐపై ఆధాపడుతున్నారు.
వాడుకోవచ్చు కానీ..
నిపుణుల సలహాలు సులభంగా దొరుకనివారికి ఏఐ ఇచ్చే ఆర్థికపరమైన సమాచారమే కీలకంగా మారుతున్నది. అయితే తొందరపాటు నిర్ణయాలకు భారీ మూల్యాన్ని చెల్లించుకోవాల్సి వస్తుందని నిపుణులు హితవు పలుకుతున్నారు. ఏఐ కేవలం ఓ సాధనమేనని, విచక్షణ కలిగిన అధికారి కాదని అంటున్నారు. కాబట్టి మితిమీరిన ఏఐ వినియోగం వల్ల నష్టాలేనని ఏఐ ఎథిక్స్‌లో పలువురు స్పెషలిస్టులు చెప్తున్నారు. మార్కెట్ పరిస్థితులు, సందర్భాలనుబట్టి సలహాలు ఇవ్వడం ఏఐ ద్వారా సాధ్యం కాదని స్పష్టం చేస్తున్నారు. సేవింగ్స్ ఖాతాలో నగదు పెట్టుబడులకున్న అవకాశాలు, ఏయే సాధనాల్లో పెట్టుబడులు లాభదాయకం వంటి ప్రశ్నలకు మీ ఆదాయం, పన్నుల స్థితిగతులు, అవసరాలు తెలియకుండా వచ్చే సమాధానాలు.. మీ ఆర్థిక లక్ష్యాల సాధనకు సరితూగవని వివరిస్తున్నారు.
ఆర్థికపరమైన అంశాలను అనేకం ప్రభావితం చేస్తాయి. కనుక ఎప్పటికప్పుడు మారే మార్కెట్ పరిస్థితులనుబట్టి సరైన సలహాలు ఇవ్వగలిగేది ఆర్థిక నిపుణులు మాత్రమే. విషయాలను లోతుగా పరిశీలించడానికి, వాటిపై ఓ అవగాహనను ఏర్పర్చుకోవడానికి ఏఐ సాయం తీసుకున్నా.. దానిపైనే ఆధారపడి మాత్రం అంతిమ నిర్ణయాలు తీసుకోకపోవడమే ఉత్తమం. ఏఐ సాధనాల్లోని సమాధానాలు.. ముందుగానే ఫిక్స్ చేసినవి. తమకున్న సమాచారాన్నిబట్టి ఆయా రంగాల ఎక్స్పర్ట్స్ ద్వారా సేకరించినవి. అయితే అందరి సమస్యలు, పరిస్థితులు, ఆదాయ వనరులు, అవసరాలు, లక్ష్యాలు ఒకేలా ఉండవు. మార్కెట్ ట్రెండ్ కూడా అనుక్షణం మారుతూ ఉంటుంది. కాబట్టి మీ పరిస్థితులకు తగ్గ నిర్ణయాలు తీసుకోవాలన్నా, తగిన ప్రతిఫలాలు పొందాలన్నా నిపుణులను సంప్రదించాలి.
జర భద్రం
ఏఐ చాట్బోట్లతో సున్నితమైన ఆర్థిక సమాచారం పంచుకునే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోవాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఏఐ సాధనాల్లోకి వెళ్లిన సమాచారం.. అక్కడే నిక్షిప్తమయ్యే వీలున్నదని, సాంకేతికంగా సదరు సాధనాలను భవిష్యత్తులో మరింత మెరుగుపర్చడానికి దాన్ని వినియోగించుకోవచ్చని చెప్తున్నారు. ఇది సైబర్ మోసగాళ్లకు చిక్కితే ప్రమాదమని వివరిస్తున్నారు. అందుకే బ్యాంక్ ఖాతా నెంబర్లు, పాస్వర్డ్లు, ట్యాక్స్ ఐడెంటిఫికేషన్ నెంబర్లు, ఇతరత్రా వ్యక్తిగత వివరాలను ఆన్లైన్లో పెట్టరాదని సూచిస్తున్నారు. ముఖ్యంగా ఉచిత ఏఐ సాధనాలను వాడేటప్పుడు మరింత జాగ్రత్త.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sai Durga Tej | చిన్ననాటి స్నేహితురాలితో పెళ్లికి సిద్ధమైన సాయి దుర్గా తేజ్.. కాబోయే భార్యకు స్పెషల్ లవ్ లెటర్!
Bigg Boss 10 | వర్షిణికి నాగార్జున గట్టి కౌంటర్.. దేబ్జానీకి క్లాస్, నరేష్‌కు షాక్!
Allahabad High Court | యూపీలో సిగ్గుచేటుగా పౌరస్వేచ్ఛ.. రాష్ట్ర హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు
Sonia Gandhi | ఎమెర్జెన్సీ విధించడం పొరపాటు నిర్ణయం.. ఆత్మకథలో పేర్కొన్న సోనియా
Agniveer Scheme | మరో రెండేండ్ల సర్వీసు తర్వాత అగ్నివీరులకు పొడిగింపు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

