Man Kills Mother, Sister | తల్లి, సోదరి మధ్య గొడవలతో కలత.. వారిని హత్య చేసి ఆత్మహత్య చేసుకున్న వ్యక్తి
Man Kills Mother, Sister | తల్లి, సోదరి మధ్య గొడవలపై ఒక వ్యక్తి కలత చెందాడు. వారిద్దరిని హత్య చేశాడు. ఆ తర్వాత గదిలో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ విషయాన్ని సూసైడ్ నోట్లో పేర్కొన్నాడు. పోలీసులు దీనిపై దర్యాప్తు చేస్తున్నారు.
జైపూర్: తల్లి, సోదరి మధ్య గొడవలపై ఒక వ్యక్తి కలత చెందాడు. వారిద్దరిని హత్య చేశాడు. ఆ తర్వాత గదిలో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ విషయాన్ని సూసైడ్ నోట్లో పేర్కొన్నాడు. పోలీసులు దీనిపై దర్యాప్తు చేస్తున్నారు. (Man Kills Mother, Sister) రాజస్థాన్ రాజధాని జైపూర్‌లో ఈ సంఘటన జరిగింది. 50 ఏళ్ల సరోజా తివారీ, 27 ఏళ్ల ఆమె కుమారుడు లక్కీ, 25 ఏళ్ల కుమార్తె శివాంగి ఒక ఇంట్లో నివసిస్తున్నారు. అయితే తల్లి, సోదరి తరచుగా గొడవ పడటంపై లక్కీ విసిగిపోయాడు. ఈ విషయంపై కలత చెందిన అతడు గురువారం వారిద్దరిని హత్య చేశాడు. ఆ తర్వాత ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
కాగా, ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు ఆ ఇంటికి చేరుకున్నారు. వేర్వేరు గదుల్లో ముగ్గురు కుటుంబ సభ్యుల మృతదేహాలను గుర్తించారు. ఫోరెన్సిక్ బృందాన్ని రప్పించి ఆధారాలు సేకరించారు. లక్కీ ఉరివేసుకున్న గది వద్ద ఒక కాగితంపై మొబైల్ ఫోన్ పిన్ రాసి ఉండటాన్ని పోలీసులు గమనించారు. అతడి ఫోన్ ఓపెన్ చేసి పరిశీలించగా ఇంగ్లీష్‌లో ఉన్న సూసైడ్ నోట్ కనిపించింది. గురువారం మధ్యాహ్నం 2:30 గంటల సమయంలో తాను ఇంటికి తిరిగి వచ్చినప్పడు తన తల్లి, సోదరి గొడవ పడటంపై తాను తీవ్రంగా కలత చెందినట్లు లక్కీ అందులో రాశాడు. దీంతో బరువైన వస్తువుతో తల్లి, సోదరి తలపై కొట్టి వారిని హత్య చేశానని, ఆ తర్వాత ఆత్మహత్య చేసుకుంటున్నట్లు ఆ నోట్లో పేర్కొన్నాడు.
మరోవైపు పొరుగువారితో సంబంధాలు లేకుండా ఎక్కువగా ఇంట్లోనే గడిపే ఆ కుటుంబంలోని ముగ్గురు సభ్యులు ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్‌తో బాధపడుతున్నట్లు పోలీసులు తెలుసుకున్నారు. వారి ఇంట్లో, చుట్టుపక్కల పరిశుభ్రత లోపించడాన్ని గమనించారు. స్థిరమైన ఉద్యోగం లేకపోవడంతో లక్కీ ఒక ఆన్లైన్ వ్యాపారం చేస్తున్నాడని పోలీస్ అధికారి తెలిపారు. అతడి తండ్రి అనారోగ్యంతో బాధపడుతూ కొన్నేళ్ల కిందట ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిసిందన్నారు. వారి మరణం గురించి బంధువులకు సమాచారం ఇచ్చినట్లు వివరించారు. ఆ కుటుంబం మానసిక, ఆర్థిక పరిస్థితిపై కూడా దర్యాప్తు చేస్తున్నట్లు పోలీస్ అధికారి వెల్లడించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Uday Singh Bayas | పౌల్ట్రీ ఇండియా ఎగ్జిబిషన్‌కు అపూర్వ స్పందన : ఉదయ్ సింగ్ బయాస్
‘విద్యారంగ సమస్యలపై రాజీలేని పోరాటాలు’
Man Kills Mother, Sister | తల్లి, సోదరి మధ్య గొడవలతో కలత.. వారిని హత్య చేసి ఆత్మహత్య చేసుకున్న వ్యక్తి
గుబ్బలమంగి వాగు సమీపంలో యథేచ్ఛగా గోమాంస విక్రయాలు!
Banana Leaf | అరటి ఆకుల్లో భోజనం చేస్తే ఏమవుతుంది..? జీర్ణకోశ నిపుణులు ఏమంటున్నారు..?
ట్రెండింగ్ వార్తలు
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!
Anjali Kulthe | ఆ ఉగ్రదాడి నుంచి 20 మంది గర్భిణీలను కాపాడిన నర్సు..!

