గుబ్బలమంగి వాగు సమీపంలో యథేచ్ఛగా గోమాంస విక్రయాలు!
దుమ్ముగూడెం మండల పరిధిలో గోమాంస విక్రయాలు యథేచ్ఛగా కొనసాగుతున్నాయనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. చినబండిరేవు గ్రామ శివారులోని గుబ్బలమంగి వాగు సమీపంలో ఓ షెడ్డు నిర్మించి పశువులను వధిస్తూ మాంసం విక్రయిస్తున్నట్లు...
– వాగులో వ్యర్థాలు కలిస్తే తాగునీరు కలుషితమయ్యే ప్రమాదం
దుమ్ముగూడెం, నవంబరు 27 : దుమ్ముగూడెం మండల పరిధిలో గోమాంస విక్రయాలు యథేచ్ఛగా కొనసాగుతున్నాయనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. చినబండిరేవు గ్రామ శివారులోని గుబ్బలమంగి వాగు సమీపంలో ఓ షెడ్డు నిర్మించి పశువులను వధిస్తూ మాంసం విక్రయిస్తున్నట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. వారంలో మూడు రోజులు ఈ విక్రయాలు పెద్దఎత్తున సాగుతున్నాయని చెబుతున్నారు. శుక్రవారం చర్ల మండలానికి చెందిన ఓ మహిళ ఈ విక్రయాలు నిర్వహిస్తున్నట్లు స్థానికులు పేర్కొంటున్నారు. పశువుల రవాణా, విక్రయాలకు సంబంధించి నిబంధనలు అమల్లో ఉన్నప్పటికీ వాటిని పట్టించుకోకుండా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. పశువుల రవాణా, వధ, మాంసం విక్రయాలకు అవసరమైన అనుమతులు, నిబంధనల అమలుపై సంబంధిత అధికారులు తనిఖీలు నిర్వహించాలని స్థానికులు కోరుతున్నారు.
తాగునీటికి ముప్పు
గుబ్బలమంగి వాగు సమీపంలోనే పశువులను వధించి, వ్యర్థాలు, రక్తం, ఇతర అవశేషాలు వాగులో కలిసే ప్రమాదం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ వాగు ద్వారా కలుషితమైన నీరు గోదావరిలోకి చేరితే అక్కడి నుండి మిషన్ భగీరథ పథకం ద్వారా సరఫరా అయ్యే తాగునీరు కలుషితమయ్యే ప్రమాదం ఉందని పేర్కొంటున్నారు. దీనివల్ల పరిసర గ్రామాల ప్రజల ఆరోగ్యానికి ముప్పు వాటిల్లే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ వ్యవహారంపై రెవెన్యూ, పోలీసు సిబ్బందికి సమాచారం అందించినప్పటికీ తగిన స్పందన లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. అధికారులు తక్షణమే స్పందించి తనిఖీలు నిర్వహించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
Read Today's Latest Khammam Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
గుబ్బలమంగి వాగు సమీపంలో యథేచ్ఛగా గోమాంస విక్రయాలు!
Banana Leaf | అరటి ఆకుల్లో భోజనం చేస్తే ఏమవుతుంది..? జీర్ణకోశ నిపుణులు ఏమంటున్నారు..?
Health tips | ఆరోగ్యానికి ఎంతో మేలుచేసే ఈ పంపరపనస పండును ఎప్పుడైనా తిన్నారా..?
ఫిర్యాదుల పట్ల నిర్లక్ష్యం వహించొద్దు : ఎస్పీ అక్షాన్ష్ యాదవ్
భద్రాద్రి డీపీఆర్‌ఓపై విచారణకు ఆదేశం
ట్రెండింగ్ వార్తలు
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!
Anjali Kulthe | ఆ ఉగ్రదాడి నుంచి 20 మంది గర్భిణీలను కాపాడిన నర్సు..!

