నాగార్జునసాగర్‌లో వరుణ యాగం
వరుణుడి కరుణ కోసం రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నల్లగొండ జిల్లా నాగార్జునసాగర్‌లో సోమవారం వరుణ యాగాన్ని నిర్వహించారు. హిల్‌కాలనీ విజయవిహార్‌లో కృష్ణానది తీరంలో నిర్వహించిన వరుణ యాగంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆయన సతీమణి గీతారెడ్డి పాల్గొని పూర్ణాహుతి కార్యక్రమాన్ని నిర్వహించారు.
- పూర్ణాహుతిలో పాల్గొన్న సీఎం రేవంత్‌రెడ్డి దంపతులు
- హాజరైన మంత్రులు ఉత్తమ్, కోమటిరెడ్డి, సురేఖ
నందికొండ, ఆగస్టు 10: వరుణుడి కరుణ కోసం రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నల్లగొండ జిల్లా నాగార్జునసాగర్‌లో సోమవారం వరుణ యాగాన్ని నిర్వహించారు. హిల్‌కాలనీ విజయవిహార్‌లో కృష్ణానది తీరంలో నిర్వహించిన వరుణ యాగంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆయన సతీమణి గీతారెడ్డి పాల్గొని పూర్ణాహుతి కార్యక్రమాన్ని నిర్వహించారు. తెల్లవారుజాము 4 గంటలకు నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ఆయన సతీమణి, కోదాడ ఎమ్మెల్యే పద్మావతితో వేద పండితులు వరుణ యాగ పూజా కార్యక్రమాలను ప్రారంభించారు. రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురవాలని కృష్ణా, గోదావరి నదులు పరువళ్లు తొక్కాలని, జలాశయాలు నిండాలని కోరుతూ 108 మంది రుత్వికులు, వేదపండితులు, అర్చకుల మంత్రోచ్ఛారణలతో యాగశాలలో పూజలు నిర్వహించారు. మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 4.20 నిమిషాల వరకు వరుణ యాగంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దంపతులు పాల్గొన్నారు. ఈ యాగంలో మంత్రులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, కొండా సురేఖ, మాజీ మంత్రి కుందూరి జానారెడ్డి, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, దేవాదాయ కమిషనర్ హనుమంతురావు, ఎమ్మెల్యేలు తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AH Movie | ‘అ’ ఒక సరికొత్త మిస్టరీ థ్రిల్లర్: ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేయడం ఖాయమన్న హీరో రాహుల్ విజయ్!
Moinabad | డ్రగ్స్ తరలిస్తున్న ఇద్దరు అరెస్ట్.. 2 లక్షల విలువైన ఎండీఎంఏ స్వాధీనం..!
Karepalli | కారేపల్లి మండలంలో ఘనంగా ‘ఎంగిలిపూల బతుకమ్మ’ వేడుకలు..!
Hanumakonda | విజయ డెయిరీ అభివృద్ధి కోసం రూ.1.85 కోట్ల నిధులు మంజూరు..!
KTR | తెలంగాణ ఉద్యమకారుడి కుటుంబానికి అండగా కేటీఆర్.. 10 లక్షల ఆర్థిక సాయం అందజేత..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

