Orangutan cubs | ఆ ఐదు పిల్ల ఒరంగుటాన్లకు సంగీత చికిత్స.. ఎందుకంటే..!
Orangutan cubs | ఒడిశా (Odisha) లో అక్రమ రవాణాలో పట్టుబడిన ఐదు పిల్ల ఒరంగుటాన్ల (Baby Orangutans) కు సంబంధిత అధికారులు మ్యూజిక్ థెరపీ (Music Therapy) అందిస్తున్నారు. ప్రస్తుతం అవి సంగీతంతో స్వాంతన పొందుతున్నాయి. తల్లుల నుంచి వేరుపడి తీవ్ర ఒత్తిడికి గురైన ఈ అరుదైన జీవులకు భువనేశ్వర్ (Bhuvneshwar) లోని నందన్‌కానన్ జూలాజికల్ పార్కు (Nandankanan Zoological Park) లో ప్రత్యేక పర్యవేక్షణలో సంగీత చికిత్స అందిస్తున్నారు.
Orangutan cubs : ఒడిశా (Odisha) లో అక్రమ రవాణాలో పట్టుబడిన ఐదు పిల్ల ఒరంగుటాన్ల (Baby Orangutans) కు సంబంధిత అధికారులు మ్యూజిక్ థెరపీ (Music Therapy) అందిస్తున్నారు. ప్రస్తుతం అవి సంగీతంతో స్వాంతన పొందుతున్నాయి. తల్లుల నుంచి వేరుపడి తీవ్ర ఒత్తిడికి గురైన ఈ అరుదైన జీవులకు భువనేశ్వర్ (Bhuvneshwar) లోని నందన్‌కానన్ జూలాజికల్ పార్కు (Nandankanan Zoological Park) లో ప్రత్యేక పర్యవేక్షణలో సంగీత చికిత్స అందిస్తున్నారు. ఈ చికిత్సతో అవి క్రమంగా కోలుకుంటున్నాయని అధికారులు తెలిపారు.
ఇటీవల ఒడిశాలోని బాలసోర్ జిల్లా అటవీ ప్రాంతంలో అధికారులు ఐదు ఒరంగుటాన్ పిల్లలను గుర్తించారు. ఆరు నెలల నుంచి ఏడాది వయసున్న ఈ ఒరంగుటాన్లు సహజంగా ఇండోనేషియాలోని బోర్నియో, సుమత్రా వర్షారణ్యాలలో మాత్రమే కనిపిస్తాయి. తమ సహజ ఆవాసానికి సుమారు 4,000 కిలోమీటర్ల దూరంలో ఇవి కనిపించడంతో సముద్ర, భూ మార్గాల ద్వారా వీటిని అక్రమంగా తరలించి ఉంటారని అధికారులు అనుమానిస్తున్నారు.
సాధారణంగా ఒరంగుటాన్ పిల్లలు ఆరు నుంచి ఎనిమిది సంవత్సరాల పాటు తల్లి సంరక్షణలోనే పెరుగుతాయి. హఠాత్తుగా తల్లికి దూరం కావడంతో ఇవి తీవ్ర మానసిక ఒత్తిడికి, ఆందోళనకు గురయ్యాయి. ఈ సమస్యను అధిగమించేందుకు నందన్‌కానన్ జూ అధికారులు వాటికి సంగీత చికిత్సను ప్రారంభించారు. అవి ఉన్న ప్రదేశంలో తక్కువ వాల్యూమ్‌తో మృదువైన భారతీయ శాస్త్రీయ సంగీతం, వాయిద్య సంగీతాన్ని ప్లే చేస్తున్నారు.
ఈ ప్రశాంత వాతావరణం వాటి ఒత్తిడిని తగ్గించడానికి సహాయపడుతుందని నిపుణులు చెబుతున్నారు. జీవ శాస్త్రవేత్తల సలహా మేరకు ఈ చికిత్సను అందిస్తున్నామని అధికారులు తెలిపారు. సంగీతంతోపాటు వాటికి ఆడుకోవడానికి మృదువైన బొమ్మలు, ఊయలలు కూడా ఏర్పాటు చేశామని నందన్‌కానన్ జూ డిప్యూటీ డైరెక్టర్ ప్రదీప్ మిరాసే చెప్పారు. ప్రస్తుతం ఐదు ఒరంగుటాన్లలో మూడు చురుగ్గా ఆడుకుంటుండగా.. మిగిలిన రెండు ఇంకా కొంత ఆందోళనతోనే ఉన్నాయని తెలిపారు. వైద్య పరీక్షలు, డీవార్మింగ్తోపాటు వాటికి పండ్లు, బేబీ ఫుడ్, పాలు అందిస్తున్నారు.
Read Today's Latest Trending News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Python | చేపల వలలో చిక్కిన ఈ భారీ కొండచిలువను చూశారా..?
Varun Tej | నితిన్ అనుకున్న కథ వరుణ్ తేజ్ చేతికి.. ‘ఆయ్’ డైరెక్టర్‌తో మెగా హీరో సినిమా?
UPI fee | రూ.2,000 దాటిన యూపీఐ లావాదేవీలపై ఎండీఆర్ ఛార్జీలు.. దివాళి తర్వాత అమలు
Aadi Saikumar | శంబాల హిట్.. మరో మిస్టిక్ థ్రిల్లర్‌తో ప్రేక్షకుల ముందుకు ఆది సాయికుమార్!
Beauty Tips | తరచూ నెయ్యితో మర్దన చేస్తే జుట్టు బాగా పెరుగుతుందా..?
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

