Congress | వందే మాతరం పాడటానికి కారణం ఏంటి: కాంగ్రెస్
Congress | భారత్-అఫ్గానిస్థాన్ మధ్య టీ20 మ్యాచ్ ప్రారంభం సందర్భంగా జాతీయ గేయం వందే మాతరం వినిపించారు. దీనికి కారణం ఏంటి అని కాంగ్రెస్ నాయకులు కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
Congress | టీ20 క్రికెట్ సిరీస్ను భారత్-అఫ్గానిస్థాన్ మధ్య సెప్టెంబర్ 13 ఆదివారం ప్రారంభమైంది. న్యూఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో ప్రారంభ మ్యాచ్లో జాతీయ గీతం జనగణమనకు ముందు వందే మాతరం పాడారు. ఓ అంతర్జాతీయ క్రీడలో వందే మాతరం పాడటం ఇదే తొలిసారి. ఇకపై ప్రతి సిరీస్ ప్రారంభంలో వందే మాతరం వినిపిస్తారని బీసీసీఐ (Board of Control for Cricket in India) వర్గాలు తెలిపాయి. అయితే జాతీయ గీతంలోని మొత్తం ఆరు చరణాలను వినిపించడాన్ని వ్యతిరేకిస్తున్న ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ మరోసారి తన వ్యతిరేకతను వెల్లడించింది.
కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఉదిత్ రాజ్ (Udit Raj) ఈ గేయం పాడటం వెనుకు ఉన్న ఉద్దేశం ఏంటి అని ప్రశ్నించారు. ఏ కారణం లేకుండా వందే మాతరం పాడటానికి కారణం, దీనివల్ల ఉపాధి లభిస్తుందా? భారత జట్టు బలపడుతుందా? చాలా వెనుకబడి ఉన్న సైన్స్ అండ్ టెక్నాలజీ అభివృద్ధికి ఉపకరిస్తుందా? దేశ ఎగుమతులు తగ్గాయి, అప్పులు పెరిగాయి, Gen Z తరం సమస్యలు వంటి వాటిని పరిష్కరిస్తుందా? అని ఉదిత్ రాజ్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ తన 1937 నాటి తీర్మానాన్ని ప్రస్తావిస్తూ జాతీయ గీతంలోని రెండు చరణాలకే పరిమితం కావాలని ఇటీవల నిర్ణయించుకున్న సంగతి తెలిసిందే.
జాతీయ గేయం వందే మాతరం (Vande Mataram) 150 సంవత్సరాల వేడుకల్లో భాగంగా ఈ గేయం ఆలపించే విధానంపై కేంద్ర హోం శాఖ ఫిబ్రవరి 6న మార్గదర్శకాలను జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ మార్గదర్శకాల ప్రకారం 3 నిమిషాల 10 సెకన్ల గేయాన్ని వినిపించాలి. గేయం వినిపించే సమయంలో అక్కడ ఉన్నవారంతా అటెన్షన్ విధానంలో నిలబడాలి. అధ్యక్షుడు లేదా గవర్నర్ పాల్గొనే అధికారిక ప్రభుత్వ కార్యక్రమాల్లో, రేడియో, టీవీల్లో అధ్యక్షుల ప్రసంగాలకు ముందు, తర్వాత, పరేడ్ కోసం జాతీయ జెండాను తీసకువచ్చేటప్పుడు ఆరు చరణాలు కలిగిన పూర్తి గేయాన్ని ఆలపించాలని మార్గదర్శకాలు జారీ చేసిన సంగతి విదితమే.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

