Walking vs Yoga | నడక మంచిదా.. యోగా మంచిదా? మీ ఆరోగ్యానికి ఏది సరైనదో తెలుసుకోండి
Walking vs Yoga | వ్యాయామం అనగానే ఠక్కున గుర్తుకొచ్చేవి.. వాకింగ్, యోగ! పిల్లలు మొదలుకొని పెద్దల వరకూ ప్రతి ఒక్కరూ చేయగలుగుతారు. అయితే, ఈ రెండిటిలో ఏది మన ఆరోగ్యానికి ఎక్కువ మేలు చేస్తుంది?
Walking vs Yoga | వ్యాయామం అనగానే ఠక్కున గుర్తుకొచ్చేవి.. వాకింగ్, యోగ! పిల్లలు మొదలుకొని పెద్దల వరకూ ప్రతి ఒక్కరూ చేయగలుగుతారు. అయితే, ఈ రెండిటిలో ఏది మన ఆరోగ్యానికి ఎక్కువ మేలు చేస్తుంది? ఎలాంటి సమస్యలు ఉన్నవారు ఏది ఎంచుకోవాలి? అనే ప్రశ్నలకు నిపుణులు సమాధానాలు ఇస్తున్నారు.
మార్నింగ్ వాక్, యోగ.. రెండూ ఆరోగ్యానికి మేలు చేసేవే! అయితే, ఈ రెండిటి వల్ల కలిగే ప్రయోజనాలు, శరీరంపై చూపించే ప్రభావాలు మాత్రం వేర్వేరుగా ఉంటాయి. కాబట్టి, మీ శరీర అవసరాలు, ఆరోగ్యం, ఆశయాలను బట్టి ఏది ఎంచుకోవాలో నిర్ణయించుకోవచ్చు.
మార్నింగ్ వాక్:
ఇది అద్భుతమైన కార్డియో వ్యాయామం. శరీరాన్ని చురుగ్గా ఉంచడానికి.. నడక అనేది చాలా తేలికైన, ప్రభావవంతమైన మార్గం కూడా. మార్నింగ్ వాక్ వల్ల రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. కొలెస్ట్రాల్ తగ్గుతుంది. కేలరీలు వేగంగా కరిగిపోతాయి. కాబట్టి, బరువు తగ్గాలనుకునే వారికి వాకింగ్ బాగా ఉపయోగపడుతుంది. అంతేకాదు, ఊపిరితిత్తుల సామర్థ్యం పెరిగి, రోజంతా ఉత్సాహంగా ఉండటానికి సహాయపడుతుంది. టైప్-2 మధుమేహం ఉన్నవారు మార్నింగ్ వాక్ చేస్తే.. ఇన్సులిన్ నిరోధకత పెరుగుతుంది. ఉదయాన్నే స్వచ్ఛమైన గాలి పీల్చడం వల్ల ఒత్తిడి, ఆందోళన తగ్గి మూడ్ మెరుగుపడుతుంది.
యోగ:
యోగాభ్యాసం అంటే.. ఒక వ్యాయామం మాత్రమే కాదు. అది శరీరం, మనసు, శ్వాసల కలయిక. యోగాసనాల వల్ల కండరాలు, నరాలు సాగి.. శరీరం సరళంగా, చురుగ్గా తయారవుతుంది. జీవనశైలి లోపాల వల్ల వచ్చే నడుము నొప్పి, మెడ నొప్పి, కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది. ప్రాణాయామం, ధ్యానం వల్ల ఒత్తిడి, ఆందోళన పూర్తిగా తగ్గి, ఏకాగ్రత, నిద్ర లేమి సమస్యలు దూరమవుతాయి. వివిధ ఆసనాలు వేయడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. హార్మోన్ల సమతుల్యత సాధ్యమవుతుంది. నిటారుగా కూర్చోవడం, నిలబడటంలో శరీర ఆకృతి మెరుగుపడుతుంది.
ఎవరికి ఏది మంచిది?
బరువు తగ్గడం, గుండె ఆరోగ్యం, రక్తపోటు-షుగర్ నియంత్రణలో ఉంచుకోవడం మీ ప్రధాన లక్ష్యమైతే.. మార్నింగ్ వాక్ ఎంచుకోవడం మంచిది. ఇక ఒత్తిడి, శారీరక నొప్పుల నుంచి ఉపశమనం, ఫ్లెక్సిబిలిటీ, ప్రశాంతత కావాలనుకుంటే.. యోగాను ఆశ్రయించాలి. వీలైతే.. వారంలో మూడు నాలుగు రోజులు మార్నింగ్ వాక్, మిగతా రోజులు యోగా చేయడం అలవాటు చేసుకోవాలి. ఇంకా మెరుగైన ఫలితాలు కావాలనుకుంటే.. ఉదయం 15-20 నిమిషాలు వాకింగ్ చేసి, మరో 15 నిమిషాలు తేలికపాటి యోగాసనాలు వేస్తే సరిపోతుంది.
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jayesh Ranjan | రిజ్వీ బాటలోనే జయేశ్ రంజన్ వీఆర్ఎస్.. రేవంత్ సర్కార్‌లో పనిచేయలేమంటూ తప్పుకొంటున్న సీనియర్ ఐఏఎస్‌లు
Drought | కాంగ్రెస్ తెచ్చిన కరువు.. రాష్ట్రమంతా.. 111 మండలాల్లో తీవ్రం.. 254 మండలాల్లో మధ్యస్థ కరువు!
Paddy Seeds Ban | వరి విత్తనాలు అమ్మొద్దు.. డీలర్లకు వ్యవసాయ శాఖ అల్టిమేటం
Horoscope | 28-10-2026 బుధవారం.. మీ రాశి ఫలాలు
పంపులు బంద్‌పెట్టి పంటలను ఎండబెట్టిండ్రు
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

