ముంబై: జాతరను సందర్శించిన ఒక మహిళ అక్కడ ఏర్పాటు చేసిన జెయింట్ వీల్ ఎక్కింది. అయితే సీటు వెనుక ఉన్న బేరింగ్‌లో ఆమె జుట్టు చిక్కుకున్నది. జెయింట్ వీల్ వేగంగా తిరుగడంతో ఆమె జుట్టును బేరింగ్ బలంగా లాగింది. ఈ నేపథ్యంలో ఆ మహిళ తల చర్మంలో కొంతభాగం ఊడివచ్చింది. రక్తం కారడంతో తీవ్ర బాధతో ఆమె అల్లాడిపోయింది. (Woman’s Hair Caught In Ferris Wheel) మహారాష్ట్రలోని యవత్మాల్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. శుక్రవారం మహగావ్ తాలూకాలో ‘తన్హా పోలా’ జాతర జరిగింది. పునేశ్వర్ మహాదేవ్ ఆలయంలో వార్షిక సంప్రదాయం ప్రకారం నిర్వహించిన ఒక్క రోజు జాతరకు భక్తులు పోటెత్తారు.
కాగా, ఫుల్సావంగికి చెందిన 25 ఏళ్ల బాలి మారోతి కూడా ఈ జాతరను సందర్శించింది. జాతర సందర్భంగా ఏర్పాటు చేసిన జెయింట్ వీల్‌ను ఆమె ఎక్కింది. అయితే ఆ రైడ్ వేగంగా తిరిగినప్పుడు ఆ యువతి కూర్చున్న సీటు వెనుక భాగంలోని తిరిగే బేరింగ్‌లో ఆమె జుట్టు చిక్కుకున్నది. జెయింట్ వీల్ మరింత వేగంగా తిరుగడంతో చిక్కుకున్న ఆమె జుట్టును ఆ బేరింగ్ మరింత బలంగా లాగింది. ఈ నేపథ్యంలో ఆ మహిళ తల చర్మంలో కొంతభాగం ఊడివచ్చింది. రక్తం కారుతుండగా ఆ మహిళ బాధతో అరిచింది.
మరోవైపు అక్కడున్న స్థానికులు, పోలీసులు వెంటనే స్పందించారు. ఆ రైడ్‌ను తక్షణమే నిలిపివేశారు. ఆ మహిళను సురక్షితంగా రైడ్ నుంచి దించారు. ఆ వెంటనే చికిత్స కోసం ఆమెను ఆసుపత్రికి తరలించారు. అయితే జాతర సమయాల్లో ఏర్పాటు చేసే రైడ్ల భద్రతపై మరోసారి ఆందోళనలు రేకెత్తించింది. ఈ షాకింగ్ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
Yavatmal – A 25-year-old woman was seriously injured at a temple fair in Phulsawangi of Mahagaon taluka afternoon after her hair got caught in a Ferris wheel bearing, pulling off part of her scalp. The accident took place during the Tanha Polya fair held at the foot of Puneswar… pic.twitter.com/hQDd8C6J01
— NextMinute News (@nextminutenews7) September 12, 2026