Khairatabad | ఖైరతాబాద్ మహాగణపతికి గవర్నర్ దంపతుల తొలి పూజ.. 69 అడుగుల పంచముఖ గణపతి ప్రత్యేకతలివే
Khairatabad | హైదరాబాద్ ఖైరతాబాద్‌లో మహాగణపతి కొలువుదీరాడు. 69 అడుగుల పంచముఖ సంకటహర మహాగణపతికి రాష్ట్ర గవర్నర్ శివప్రతాప్ శుక్లా దంపతులు తొలి పూజ నిర్వహించారు.
Khairatabad | హైదరాబాద్ ఖైరతాబాద్‌లో మహాగణపతి కొలువుదీరాడు. 69 అడుగుల పంచముఖ సంకటహర మహాగణపతికి రాష్ట్ర గవర్నర్ శివప్రతాప్ శుక్లా దంపతులు తొలి పూజ నిర్వహించారు. వినాయక చవితి సందర్భంగా ఖైరతాబాద్ గణేశ్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మహాగణపతికి అర్చకులు ప్రత్యేక పూజలు చేయించారు. గవర్నర్ దంపతులకు మంత్రి పొన్నం ప్రభాకర్, స్థానిక ఎమ్మెల్యే దానం నాగేందర్, ఉత్సవ కమిటీ సభ్యులు స్వాగతం పలికి స్వామివారి వద్దకు తీసుకెళ్లారు.
గవర్నర్ దంపతులు పూజలు నిర్వహించిన అనంతరం మంత్రి పొన్నం ప్రభాకర్ ఖైరతాబాద్ గణనాథుడికి పట్టువస్త్రాలు సమర్పించారు. పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో స్వామివారికి భారీ కండువా, యజ్ఞోపవీతాన్ని సమర్పించారు.
తొలి పూజ అనంతరం బడా గణేశ్ దర్శనానికి భక్తులను అనుమతించారు. భారీ వర్షం కురుస్తున్నప్పటికీ భక్తులు పెద్ద సంఖ్యలో ఖైరతాబాద్‌కు తరలివచ్చారు. దీంతో పరిసర ప్రాంతాల్లో సందడి వాతావరణం నెలకొంది.
పంచముఖ సంకటహర మహాగణపతి ప్రత్యేకతలు
ఖైరతాబాద్ గణేశ్ ఉత్సవ కమిటీ 72వ వసంతంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా ఈ ఏడాది 69 అడుగుల ఎత్తు, 28 అడుగుల వెడల్పుతో మట్టి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఐదు పడగల ఆదిశేషుడి నీడలో ఐదు ముఖాలు, ఎనిమిది హస్తాలతో పద్మంపై ఆశీనుడైన గణపతి రూపాన్ని తీర్చిదిద్దారు.
స్వామివారి కుడివైపు అంకుశం, త్రిశూలం, కమలం, అభయహస్తం ఉండగా.. ఎడమవైపు పాశం, పరశు, మాల, మోదకం ఉన్నాయి. గణపతి కుడివైపున సుమారు 20 అడుగుల ఎత్తులో ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటైన సోమనాథ్ జ్యోతిర్లింగం, ఎడమవైపు అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకటైన కాళికామాత విగ్రహాన్ని ఏర్పాటు చేశారు.
700 మంది పోలీసులతో బందోబస్తు
ఖైరతాబాద్ మహాగణపతి దర్శనానికి ఈసారి భారీగా భక్తులు తరలివచ్చే అవకాశం ఉండటంతో పోలీసులు ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేశారు. బారికేడ్లు, ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటు చేశారు. సుమారు 700 మంది పోలీసు సిబ్బంది శాంతిభద్రతల విధుల్లో పాల్గొంటున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అధికారులు చర్యలు చేపట్టారు. మహాగణపతి దర్శనానికి భక్తులు లక్షలాదిగా తరలివచ్చే అవకాశం ఉండటంతో ట్రాఫిక్ నియంత్రణపైనా పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
North Korea: బాలిస్టిక్ క్షిపణులను పరీక్షించిన ఉత్తర కొరియా
Aadarsha Kutumbam | ఆదర్శ కుటుంబంలో అదిరిపోయే సర్ప్రైజ్.. వెంకటేష్ అభిమానులకు త్రివిక్రమ్ ట్రీట్!
Road Accident | మద్యం మత్తులో కారు నడిపి స్కూటీని ఢీకొట్టిన యువకుడు.. ముగ్గురు దుర్మరణం..!
Mythri Movie Makers | మైత్రీ మూవీ మేకర్స్ నుంచి మరో రొమాంటిక్ కామెడీ.. డెబ్యూ ఇస్తున్న శ్రీకాంత్ కుమార్తె
IAS Transfers | ఏపీలో పలువురు ఐఏఎస్‌ల బదిలీ.. పర్యాటక శాఖ కార్యదర్శిగా ఆమ్రపాలికి పోస్టింగ్!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

