Srimathi trailer | భావోద్వేగాలతో కూడిన బలమైన సందేశం.. తిరువీర్, నివేదా థామస్ ‘శ్రీమతి’ ట్రైలర్ విడుదల
Srimathi On ZEE5 | విలక్షణ నటి నివేదా థామస్ ప్రధాన పాత్రలో నటించిన జీ5 ఒరిజినల్ చిత్రం ‘శ్రీమతి’ ట్రైలర్ను చిత్రబృందం సోమవారం విడుదల చేసింది. ఎన్నో ఆశలతో అత్తారింట్లోకి అడుగుపెట్టే కొత్త కోడలి జీవితం, సంసార బాధ్యతల మధ్య నలిగిపోయే ఆమె కలలు, ఆశయాల నేపథ్యంలో ఈ చిత్రాన్ని రూపొందించారు.
విలక్షణ నటి నివేదా థామస్ ప్రధాన పాత్రలో నటించిన జీ5 ఒరిజినల్ చిత్రం ‘శ్రీమతి’ ట్రైలర్ను చిత్రబృందం సోమవారం విడుదల చేసింది. ఎన్నో ఆశలతో అత్తారింట్లోకి అడుగుపెట్టే కొత్త కోడలి జీవితం, సంసార బాధ్యతల మధ్య నలిగిపోయే ఆమె కలలు, ఆశయాల నేపథ్యంలో ఈ చిత్రాన్ని రూపొందించారు. ఈ సినిమా డిసెంబర్ 4, 2026 నుంచి ప్రముఖ ఓటీటీ వేదిక జీ5 తెలుగులో స్ట్రీమింగ్ కానుంది. విశ్వక్ ఖండేరావు దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని కె. నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి నిర్మించారు.
విడుదలైన ట్రైలర్ ఆద్యంతం ఆలోచింపజేసేలా, భావోద్వేగభరితంగా సాగింది. ఇందులో నివేదా థామస్ (మధుశ్రీ), తిరువీర్ (వాసుదేవ్) నూతన దంపతులుగా కనిపించారు. పెళ్లైన తర్వాత అత్తారింటి ఆచారాలు పాటిస్తూనే, తన చదువు, కళ మరియు ఉద్యోగం విషయంలో ఒక సాధారణ మధ్యతరగతి మహిళకు ఇరుగుపొరుగు, బంధుమిత్రుల నుంచి ఎదురయ్యే ప్రశ్నలను ట్రైలర్లో సహజంగా చూపించారు. సగటు భారతీయ స్త్రీ అంతరంగాన్ని ఆవిష్కరించే ఈ కథాంశం అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంది.
ఈ చిత్రంలో నివేదా థామస్, తిరువీర్లతో పాటు హరితేజ (సునీత), రేణు దేశాయ్ (డ్యాన్స్ మెంటర్), గోపరాజు రమణ (హీరో తండ్రి), విజ్జి చంద్రశేఖర్ (జానకి), రాజీవ్ కనకాల (హీరోయిన్ తండ్రి), రాజశ్రీ (హీరోయిన్ తల్లి), ఐశ్వర్య భాస్కరన్ (అత్త), సుదర్శన్, విరాజ్ అశ్విన్ (అర్జున్), మానిక చక్కిలా తదితరులు కీలక పాత్రలు పోషించారు. సాంకేతిక వర్గంలో ఆదిత్య జవ్వాడి ఛాయాగ్రహణం, రవితేజ గిరిజాల ఎడిటింగ్, ఈ.ఎల్. విశ్వనాథ్ సంగీతం అందించగా, గోపిరెడ్డి మల్లికార్జున రెడ్డి చీఫ్ కో-డైరెక్టర్గా, శరణ్య లూయిస్ శర్మ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా వ్యవహరించారు. ఎలిసియం మాక్సిమా ఇండియా – చెన్నై సంస్థ క్రియేటివ్ మరియు ప్రొడక్షన్ బాధ్యతలు నిర్వహించింది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Srimathi trailer | భావోద్వేగాలతో కూడిన బలమైన సందేశం.. తిరువీర్, నివేదా థామస్ ‘శ్రీమతి’ ట్రైలర్ విడుదల
జూలూరుపాడులో పోలీసుల నాకాబందీ
Jeevan Reddy | బీడీ కార్మికులకు కొత్త పెన్షన్లు మంజూరు చేయాలి : మాజీ మంత్రి జీవన్ రెడ్డి డిమాండ్
Devara Part 1 | తారక్ అభిమానులకు గుడ్ న్యూస్.. ఇక టీవీలోకి రాబోతున్న దేవర..!
The Breaking News | డిసెంబర్ 11న థియేటర్లలో సందడి చేయనున్న ‘ది బ్రేకింగ్ న్యూస్’!
ట్రెండింగ్ వార్తలు
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?

