జూలూరుపాడులో పోలీసుల నాకాబందీ
శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణే లక్ష్యంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఆదేశాల మేరకు జూలూరుపాడు పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం సాయంత్రం పోలీసులు ప్రత్యేక నాకాబందీ తనిఖీలు నిర్వహించారు. కొత్తగూడెం సబ్ డివిజన్ డీఎస్పీ ఆదినారాయణ ఆధ్వర్యంలో...
జూలూరుపాడు, నవంబర్ 23 : శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణే లక్ష్యంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఆదేశాల మేరకు జూలూరుపాడు పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం సాయంత్రం పోలీసులు ప్రత్యేక నాకాబందీ తనిఖీలు నిర్వహించారు. కొత్తగూడెం సబ్ డివిజన్ డీఎస్పీ ఆదినారాయణ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ తనిఖీల్లో భాగంగా చంద్రుగొండ క్రాస్ రోడ్, ప్రధాన రహదారి పక్కన ఉన్న మహదేవ్ హోటల్, పాపకొల్లు క్రాస్ రోడ్, సాయిబాబా ఆలయం వద్ద వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వాహనదారుల వివరాలతో పాటు వాహన పత్రాలను పరిశీలించి, అనుమానాస్పద వ్యక్తులు, వాహనాలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు.
అసాంఘిక కార్యకలాపాలను అరికట్టడం, గంజాయి వంటి మత్తు పదార్థాల అక్రమ రవాణాను నిరోధించడం, రోడ్డు ప్రమాదాల నివారణతో పాటు శాంతిభద్రతలను పరిరక్షించడమే ఈ నాకాబందీ తనిఖీల ప్రధాన ఉద్దేశమని డీఎస్పీ తెలిపారు. పోలీసుల తనిఖీలకు ప్రజలు సహకరించాలని, తమ పరిసరాల్లో అనుమానాస్పద వ్యక్తులు లేదా అసాంఘిక కార్యకలాపాలకు సంబంధించిన సమాచారం ఉంటే వెంటనే పోలీసులకు తెలియజేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో సిఐ శ్రీలక్ష్మి ఎస్ఐ జీనత్ కుమార్, చండ్రుగొండ అన్నపురెడ్డిపల్లి పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు
Read Today's Latest Khammam Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
జూలూరుపాడులో పోలీసుల నాకాబందీ
Jeevan Reddy | బీడీ కార్మికులకు కొత్త పెన్షన్లు మంజూరు చేయాలి : మాజీ మంత్రి జీవన్ రెడ్డి డిమాండ్
Devara Part 1 | తారక్ అభిమానులకు గుడ్ న్యూస్.. ఇక టీవీలోకి రాబోతున్న దేవర..!
The Breaking News | డిసెంబర్ 11న థియేటర్లలో సందడి చేయనున్న ‘ది బ్రేకింగ్ న్యూస్’!
నవీన్ నాయక్ ప్రాణ త్యాగానికి జాతీయ గుర్తింపు
ట్రెండింగ్ వార్తలు
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?

