నవీన్ నాయక్ ప్రాణ త్యాగానికి జాతీయ గుర్తింపు
అటవీ సంపద, వన్యప్రాణుల సంరక్షణ కోసం విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన సింగరేణి మండలం వెంకట్యతండాకు చెందిన ఫారెస్ట్ బీట్ అధికారి బానోత్ నవీన్ నాయక్ సేవలకు జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. ఆయన ప్రాణత్యాగాన్ని గుర్తించిన కేంద్ర ప్రభుత్వం..
-కేంద్ర మంత్రి భూపేందర్ యాదవ్ చేతుల మీదుగా పురస్కారం స్వీకరించిన కుటుంబ సభ్యులు
కారేపల్లి, నవంబర్ 23 : అటవీ సంపద, వన్యప్రాణుల సంరక్షణ కోసం విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన సింగరేణి మండలం వెంకట్యతండాకు చెందిన ఫారెస్ట్ బీట్ అధికారి బానోత్ నవీన్ నాయక్ సేవలకు జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. ఆయన ప్రాణత్యాగాన్ని గుర్తించిన కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మక పురస్కారంతో గౌరవించింది. సోమవారం న్యూఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో కేంద్ర పర్యావరణ, అటవీ శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ చేతుల మీదుగా నవీన్ నాయక్ తల్లిదండ్రులు దేవ్లా నాయక్, భార్య ప్రమీల, వెంకట్యతండా సర్పంచ్ బుల్లి పురస్కారాన్ని అందుకున్నారు.
పాల్వంచ అటవీ డివిజన్ పరిధిలోని చెరువుసింగారం వెస్ట్ బీట్లో విధులు నిర్వహిస్తున్న నవీన్ నాయక్.. వన్యప్రాణుల వేట కోసం ఏర్పాటు చేసిన విద్యుత్ తీగల ఉచ్చుకు బలై ప్రాణాలు కోల్పోయారు. విధి నిర్వహణలో ఆయన చూపిన అంకితభావం, అటవీ సంరక్షణకు అందించిన సేవలను గుర్తిస్తూ కేంద్ర ప్రభుత్వం ఈ గౌరవాన్ని ప్రకటించింది. కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర అటవీ శాఖ ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ వినయ్ కుమార్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా డీఎఫ్వో సిద్ధార్థ విక్రమ్ సింగ్ తదితరులు పాల్గొన్నారు. క్షేత్రస్థాయి అటవీ సిబ్బంది సేవలకు జాతీయ స్థాయిలో గుర్తింపు రావడం రాష్ట్ర అటవీ శాఖకు గర్వకారణమని పేర్కొన్నారు.
కన్నీటి మధ్య పురస్కార స్వీకరణ
కుమారుడిని కోల్పోయిన తల్లిదండ్రులకు ఆయన సేవలకు దేశస్థాయిలో గుర్తింపు లభించడం ఒకవైపు గర్వకారణంగా, మరోవైపు భావోద్వేగానికి గురిచేసింది. చిన్న గిరిజన తండా నుంచి అటవీ శాఖలో ఉద్యోగిగా ఎదిగి, విధి నిర్వహణలో ప్రాణత్యాగం చేసిన నవీన్ నాయక్ జాతీయ స్థాయి పురస్కారాన్ని అందుకోవడం వెంకట్యతండా ప్రజల్లో గర్వాన్ని నింపింది. ఆయన సేవలు అటవీ శాఖ క్షేత్రస్థాయి సిబ్బందికి స్ఫూర్తిగా నిలవనున్నాయి.
Read Today's Latest Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
నవీన్ నాయక్ ప్రాణ త్యాగానికి జాతీయ గుర్తింపు
Man Attacks Police With Knife | ఐదుగురు పోలీసులపై కత్తితో దాడి చేసిన వ్యక్తి.. ఎన్కౌంటర్లో గాయాలు
బాధితుల సమస్యలపై సత్వరమే స్పందించాలి : ఎస్పీ శరత్ చంద్ర ప్రవార్
Dalits Complaint | కాంగ్రెస్ ఎమ్మెల్యే వేధింపులపై కలెక్టర్కు దళితుల ఫిర్యాదు
‘విశ్వబ్రాహ్మణ విద్యార్థి వసతి గృహ కమిటీ ఏర్పాటు అప్రజాస్వామికం’
ట్రెండింగ్ వార్తలు
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?

