‘విశ్వబ్రాహ్మణ విద్యార్థి వసతి గృహ కమిటీ ఏర్పాటు అప్రజాస్వామికం’
విశ్వబ్రాహ్మణ విద్యార్థి వసతి గృహ నిర్వహణ కమిటీ ఎన్నికైనట్లు పత్రికల్లో వచ్చిన ప్రకటన అవాస్తవమని, కొంతమంది స్వార్థ ప్రయోజనాల కోసం నాలుగు గోడల మధ్య ఏర్పాటు చేసుకున్న కమిటీ చెల్లదని విశ్వబ్రాహ్మణ సంఘం నాయకులు స్పష్టం చేశారు. ఈ సందర్భంగా సోమవారం విశ్వబ్రాహ్మణ విద్యార్ధి వసతి భవనంలో నిర్వహించిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు.
– కమిటీ ఏర్పాటు నిబంధనలకు విరుద్ధం
– పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించాలి
– విశ్వబ్రాహ్మణ సంఘం నాయకులు
రామగిరి, నవంబర్ 23 : విశ్వబ్రాహ్మణ విద్యార్థి వసతి గృహ నిర్వహణ కమిటీ ఎన్నికైనట్లు పత్రికల్లో వచ్చిన ప్రకటన అవాస్తవమని, కొంతమంది స్వార్థ ప్రయోజనాల కోసం నాలుగు గోడల మధ్య ఏర్పాటు చేసుకున్న కమిటీ చెల్లదని విశ్వబ్రాహ్మణ సంఘం నాయకులు స్పష్టం చేశారు. ఈ సందర్భంగా సోమవారం విశ్వబ్రాహ్మణ విద్యార్ధి వసతి భవనంలో నిర్వహించిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. వసతి గృహ నియమావళి ప్రకారం ప్రస్తుత కమిటీ గడువు ముగిసిన నేపథ్యంలో నూతన కమిటీ ఏర్పాటు కోసం ముందుగా జనరల్ బాడీ సమావేశం నిర్వహించాలని తెలిపారు. సభ్యుల సమక్షంలో ఎన్నికల నిర్వహణ కమిటీని ఏర్పాటు చేసి, పారదర్శకంగా ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలు జరపాల్సి ఉండగా, నిబంధనలను పక్కనపెట్టి ఏడాది కాలానికి కమిటీని ప్రకటించుకోవడం సమంజసం కాదన్నారు. ఎంతోమంది దాతలు, పెద్దల త్యాగాలు, కృషితో నిర్మితమైన విద్యార్థి వసతి గృహాన్ని వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఉపయోగించుకోవడం తగదని పేర్కొన్నారు. త్వరలో వసతి గృహ సభ్యులతో సమావేశమై, జిల్లా వ్యాప్తంగా వివిధ రంగాల్లో ఉన్న విశ్వబ్రాహ్మణ, విశ్వకర్మ ప్రముఖుల సమక్షంలో నిబంధనల ప్రకారం ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు వెల్లడించారు.
ఈ కార్యక్రమంలో విశ్వబ్రాహ్మణ విద్యార్థి వసతి గృహ మాజీ ప్రధాన కార్యదర్శి కొండోజు పుల్లయ్య చారి, మాజీ సహాధ్యక్షుడు రథం వెంకటరత్నాచారి, జిల్లా విశ్వబ్రాహ్మణ సేవా సమితి సభ్యులు కటకం వెంకటాచారి, పందిళ్లపల్లి బ్రహ్మచారి, జిల్లా విశ్వబ్రాహ్మణ, విశ్వకర్మ ఐక్య సంఘం అధ్యక్షుడు చొల్లేటి లక్ష్మణ్, పట్టణ మనుమయ సంఘం అధ్యక్షుడు సల్వోజు సైదాచారి, పట్టణ స్వర్ణకార సంఘం అధ్యక్షుడు చొల్లేటి హరిప్రసాద్, ప్రధాన కార్యదర్శి తాడూరి చర్మయ్య చారి, కోశాధికారి కటకం మహేశ్, రాష్ట్ర స్వర్ణకార సంఘం మాజీ ఉపాధ్యక్షుడు కన్నెకంటి సత్యం, విశ్వబ్రాహ్మణ పురోహితులు శీలోజు విష్ణుమూర్తి పాల్గొన్నారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dalits Complaint | కాంగ్రెస్ ఎమ్మెల్యే వేధింపులపై కలెక్టర్‌కు దళితుల ఫిర్యాదు
‘విశ్వబ్రాహ్మణ విద్యార్థి వసతి గృహ కమిటీ ఏర్పాటు అప్రజాస్వామికం’
Gas Refilling | అక్రమంగా వంట గ్యాస్ రీఫిల్లింగ్.. ముగ్గురు వ్యక్తులు అరెస్ట్
అర్హులైన ప్రతి కుటుంబానికి జీవిత బీమా
Life style | మీ బాత్రూమ్ కంపు కొడుతున్నదా.. అయితే ఈ టిప్స్‌తో సమస్యకు చెక్ పెట్టండి..!
ట్రెండింగ్ వార్తలు
Watch: ఇద్దరు వరుల మెడలో కోటి విలువైన కరెన్సీ దండలు.. వారిని ఆశ్చర్యపరిచిన బావ
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?

