అర్హులైన ప్రతి కుటుంబానికి జీవిత బీమా
అర్హులైన ప్రతి కుటుంబానికి జీవిత బీమా పథకం వర్తిస్తుందని కరకగూడెం మండలం కొత్తగూడెం పంచాయతీ సర్పంచ్ ఎరం పొట్టయ్య, సమత్మాతే పంచాయతీ సర్పంచ్ ఎల్లబోయిన ముత్తమ్మ అన్నారు. సోమవారం ఆయా పంచాయతీలలో ఏర్పాటు చేసిన ఇందిరమ్మ జీవిత బీమా...
కరకగూడెం, నవంబర్ 23 : అర్హులైన ప్రతి కుటుంబానికి జీవిత బీమా పథకం వర్తిస్తుందని కరకగూడెం మండలం కొత్తగూడెం పంచాయతీ సర్పంచ్ ఎరం పొట్టయ్య, సమత్మాతే పంచాయతీ సర్పంచ్ ఎల్లబోయిన ముత్తమ్మ అన్నారు. సోమవారం ఆయా పంచాయతీలలో ఏర్పాటు చేసిన ఇందిరమ్మ జీవిత బీమా కార్యక్రమంలో వారు పాల్గొని మాట్లాడారు. పేద, మధ్య తరగతి కుటుంబాలకు ఆర్ధిక భరోసా కల్పించేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కుటుంబంలో సంపాదించే వ్యక్తి మరణిస్తే రూ.5 లక్షల ఆర్థిక సాయం ప్రభుత్వం నుండి అందుతుందని వివరించారు. 18 ఏండ్ల నుండి 59 ఏండ్ల వారికి ఈ పథకం వర్తిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శులు సురేశ్, విజయ్, ఉప సర్పంచ్ ఇర్ఫ కుశేలుడు, వార్డు సభ్యులు గుడ్ల రంజిత్ కుమార్, ఇర్ఫ సునిత, గ్రామ యువత, పెద్దలు పాల్గొన్నారు.
Read Today's Latest Khammam Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
అర్హులైన ప్రతి కుటుంబానికి జీవిత బీమా
Life style | మీ బాత్రూమ్ కంపు కొడుతున్నదా.. అయితే ఈ టిప్స్‌తో సమస్యకు చెక్ పెట్టండి..!
Nitin Nabin | రాహుల్‌గాంధీకి దేశాభివృద్ధి కాదు.. తన కుటుంబ అభివృద్ధే కావాలి : నితిన్ నబీన్
జాతీయ క్రీడల్లో సెయింట్ జోసెఫ్ విద్యార్థుల జయకేతనం
Watch: ఇద్దరు వరుల మెడలో కోటి విలువైన కరెన్సీ దండలు.. వారిని ఆశ్చర్యపరిచిన బావ
ట్రెండింగ్ వార్తలు
Watch: ఇద్దరు వరుల మెడలో కోటి విలువైన కరెన్సీ దండలు.. వారిని ఆశ్చర్యపరిచిన బావ
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?

