జాతీయ క్రీడల్లో సెయింట్ జోసెఫ్ విద్యార్థుల జయకేతనం
హైదరాబాద్‌లోని బాయ్స్ టౌన్ పాఠశాలలో నిర్వహించిన 'మాంట్‌ఫోర్ట్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ – 2026' జాతీయ స్థాయి క్రీడా పోటీల్లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రుద్రంపూర్‌లోని సెయింట్ జోసెఫ్ హైస్కూల్ విద్యార్థులు అద్భుత ప్రతిభ కనబరిచారు. వివిధ క్రీడా విభాగాల్లో...
– మాంట్‌ఫోర్ట్ క్రీడా పోటీల్లో 7 పతకాలతో సత్తా
– బంగారు పతకం సాధించిన పి.ఉపాసన
రుద్రంపూర్, నవంబర్ 23 : హైదరాబాద్‌లోని బాయ్స్ టౌన్ పాఠశాలలో నిర్వహించిన ‘మాంట్‌ఫోర్ట్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ – 2026’ జాతీయ స్థాయి క్రీడా పోటీల్లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రుద్రంపూర్‌లోని సెయింట్ జోసెఫ్ హైస్కూల్ విద్యార్థులు అద్భుత ప్రతిభ కనబరిచారు. వివిధ క్రీడా విభాగాల్లో పోటీపడిన విద్యార్థులు ఒక స్వర్ణం, ఒక రజతం, ఐదు కాంస్య పతకాలతో కలిపి మొత్తం ఏడు పతకాలు కైవసం చేసుకుని పాఠశాలకు జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చారు.
స్వర్ణ పతకం (బంగారం) : జూనియర్ బాలికల జావెలిన్ త్రో విభాగంలో పి.ఉపాసన ప్రథమ స్థానంలో నిలిచి బంగారు పతకాన్ని సాధించింది.
రజత పతకం (వెండి) : సీనియర్ బాలుర 100 మీటర్ల పరుగు పందెంలో ఎస్కె. అర్హాన్ అలీ రజత పతకం గెలుచుకున్నాడు.
కాంస్య పతకాలు (వ్యక్తిగత విభాగం) : సీనియర్ బాలుర 200 మీటర్ల పరుగులో బి. మనీశ్వర్, జూనియర్ బాలుర 200 మీటర్ల పరుగులో పి. వినీత్ కుమార్, సీనియర్ బాలికల డిస్కస్ త్రోలో ఎస్. గాయత్రి కాంస్య పతకాలు సాధించారు.
కాంస్య పతకాలు (జట్టు విభాగం) : సీనియర్ బాలికల ఖో-ఖో జట్టు, 4×100 మీటర్ల రిలే జట్టు మూడో స్థానంలో నిలిచి కాంస్య పతకాలు కైవసం చేసుకున్నాయి.

జాతీయ క్రీడల్లో సెయింట్ జోసెఫ్ విద్యార్థుల జయకేతనం
ఇతర విభాగాల్లో ప్రతిభ
మార్చ్‌పాస్ట్ విభాగంలో పాఠశాల జట్టు మూడో స్థానం సాధించగా, షటిల్ బ్యాడ్మింటన్‌లో ఐ.యశ్వంత్, ఎస్.తేజ, పి.రాబిన్ జాషువా, ఎం.డి.తల్హా బృందం నాలుగో స్థానంలో నిలిచింది. జూనియర్ బాలికల 4×100 మీటర్ల రిలేలో (పి.ఉపాసన, పి.జాహ్నవి, వి.శ్రేష్ఠ, ఎన్.అక్షయ జయన్) జట్టు, జూనియర్ బాలికల 100 మీటర్ల పరుగులో పి.ఉపాసన నాలుగో స్థానం సాధించి ప్రతిభ చాటారు. విద్యతో పాటు క్రీడల్లోనూ రాణిస్తూ పాఠశాలకు, తల్లిదండ్రులకు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు కీర్తి ప్రతిష్ఠలు తీసుకువచ్చిన క్రీడాకారులను పాఠశాల యాజమాన్యం, స్కూల్ ప్రిన్సిపాల్ బ్రదర్ రాజశేఖర్ రెడ్డి, ఉపాధ్యాయ బృందం ప్రత్యేకంగా అభినందించారు. విద్యార్థుల క్రమశిక్షణ, నిరంతర సాధన, క్రీడాస్ఫూర్తే ఈ విజయాలకు కారణమని పేర్కొన్నారు. విద్యార్థులను తీర్చిదిద్దిన వ్యాయామ ఉపాధ్యాయులకు, ప్రోత్సహించిన తల్లిదండ్రులకు యాజమాన్యం కృతజ్ఞతలు తెలిపింది.
Read Today's Latest Khammam Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
జాతీయ క్రీడల్లో సెయింట్ జోసెఫ్ విద్యార్థుల జయకేతనం
Watch: ఇద్దరి వరుల మెడలో కోటి విలువైన కరెన్సీ దండలు.. వారిని ఆశ్చర్యపరిచిన బావ
Dimple Hayathi | నాకు ఇంకా పెళ్లి కాలేదు.. నెటిజన్‌కు డింపుల్ హయాతి రిప్లై
Crime News | రూ.1.25 కోట్ల భూమి కోసం గొడవ.. డాక్టర్ దారుణ హత్య..!
Pollution Effect On Foods | మనం రోజూ తీసుకునే ఆహారాలపై కాలుష్యం ఎలాంటి ప్రభావం చూపిస్తుందంటే.. నిపుణులు ఏం చెబుతున్నారు..?
ట్రెండింగ్ వార్తలు
Watch: ఇద్దరి వరుల మెడలో కోటి విలువైన కరెన్సీ దండలు.. వారిని ఆశ్చర్యపరిచిన బావ
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?

