Pollution Effect On Foods | మనం రోజూ తీసుకునే ఆహారాలపై కాలుష్యం ఎలాంటి ప్రభావం చూపిస్తుందంటే.. నిపుణులు ఏం చెబుతున్నారు..?
మన చుట్టూ గాలి కాలుష్యం పెరుగుతున్నప్పుడు బయటకు వెళ్లడంపై ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటాం. గాలి నాణ్యత సూచీని పరిశీలించడం, కిటికీలు మూసి ఉంచడం, బయట ఎక్కువసేపు గడపకపోవడం వంటివి చేస్తుంటాం. అయితే కాలుష్యం మనం తినే ఆహారంపై కూడా ప్రభావం చూపుతుందనే విషయాన్ని చాలామంది పట్టించుకోరు.
Pollution Effect On Foods | మన చుట్టూ గాలి కాలుష్యం పెరుగుతున్నప్పుడు బయటకు వెళ్లడంపై ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటాం. గాలి నాణ్యత సూచీని పరిశీలించడం, కిటికీలు మూసి ఉంచడం, బయట ఎక్కువసేపు గడపకపోవడం వంటివి చేస్తుంటాం. అయితే కాలుష్యం మనం తినే ఆహారంపై కూడా ప్రభావం చూపుతుందనే విషయాన్ని చాలామంది పట్టించుకోరు. మనం కొనుగోలు చేసే ఆకుకూరలు, కూరగాయలు, బియ్యం, గోధుమలు, పాలు వంటి ఆహార పదార్థాల నాణ్యత వాటిని పండించే గాలి, నేల, నీటిపై ఆధారపడి ఉంటుంది. కొన్ని కాలుష్య కారకాలు పంటలను దెబ్బతీయడంతోపాటు వాటిలోని పోషక విలువలను ప్రభావితం చేస్తాయి. అలాగే ఆహార గొలుసులోకి కూడా ప్రవేశించే అవకాశం ఉంటుంది.
సవాల్‌గా మారుతున్న ఓజోన్ కాలుష్యం..
భారత్‌లో గోధుమలు, వరి పంటలకు భూతల ఓజోన్ కాలుష్యం ఒక సవాలుగా మారుతోంది. మొక్కల ఆకుల్లోని చిన్న రంధ్రాల ద్వారా ఈ వాయువు లోపలికి ప్రవేశించి కిరణజన్య సంయోగక్రియకు ఆటంకం కలిగిస్తుంది. దీనివల్ల మొక్కల కణాలు దెబ్బతిని దిగుబడి తగ్గుతుంది. 2014లో ప్రచురితమైన ఒక అధ్యయనం ప్రకారం, ఓజోన్ ప్రభావంతో దేశంలో శీతాకాలపు గోధుమల దిగుబడి 5 నుంచి 11 శాతం, రబీ వరి దిగుబడి 3 నుంచి 6 శాతం వరకు తగ్గినట్లు అంచనా వేశారు. మరోవైపు గాలిలోని సూక్ష్మ ధూళి కణాలు సీసం, కాడ్మియం, క్రోమియం, నికెల్ వంటి భారలోహాలను మోసుకెళ్లి ఆకుకూరలు, కూరగాయలపై పేరుకుపోతాయి. నేల, సాగునీటి ద్వారా కూడా ఈ కలుషితాలు పంటల్లోకి చేరే అవకాశం ఉంటుంది.
జంతు ఆధారిత ఆహారాలపైనా కాలుష్యం ప్రభావం..
పంటలతోపాటు పాలు, గుడ్లు, మాంసం వంటి జంతు ఆధారిత ఆహార పదార్థాలపైనా కాలుష్యం ప్రభావం చూపుతుంది. పశువులు కలుషితమైన మేత, నీరు తీసుకోవడం లేదా కాలుష్య గాలిని పీల్చడం ద్వారా వాటి శరీరంలోకి హానికర పదార్థాలు చేరుతాయి. 2023లో ప్రచురితమైన ఒక అధ్యయనంలో పాడి పరిశ్రమల పరిసరాల్లోని సూక్ష్మ ధూళి కణాలకు, ఆవు పాలలోని భారలోహాల స్థాయిలకు సంబంధం ఉన్నట్లు గుర్తించారు. కొన్ని పాల నమూనాల్లో సీసం పరిమితికి మించి ఉన్నట్లు వెల్లడైంది. 2025లో రాయ్‌పూర్‌లో నిర్వహించిన మరో అధ్యయనంలో పారిశ్రామిక ప్రాంతాల నుంచి సేకరించిన ఆవు, గేదె పాలలో భారలోహాల కలుషితం ఎక్కువగా ఉన్నట్లు గుర్తించారు. పశువుల మేత, నీరు ఇందుకు కారణాలు అవుతాయని పేర్కొన్నారు.
కూరగాయలన్నీ కలుషితమైనట్లేనా..
గాలి కాలుష్య సూచీ ఎక్కువగా ఉందని ఆ ప్రాంతంలో విక్రయించే కూరగాయలన్నీ కలుషితమయ్యాయని భావించకూడదు. అవి ఎక్కడ పండించారనే అంశంతోపాటు అక్కడి నేల, నీరు, పంట రకం కూడా కలుషిత స్థాయిని నిర్ణయిస్తాయి. కూరగాయలను, ముఖ్యంగా ఆకుకూరలను శుభ్రమైన ప్రవహించే నీటితో బాగా కడగడం ఇప్పటికీ అవసరమైన ప్రాథమిక జాగ్రత్త. అయితే పంటల్లోకి ఇప్పటికే చేరిన భారలోహాలను కేవలం కడగడం ద్వారా తొలగించడం సాధ్యం కాదు. అందుకే పంటలు, సాగునీరు, నేల, పాలు, పశువుల మేతలోని కలుషితాల స్థాయిలను క్రమం తప్పకుండా పరీక్షించాలి. ఇటువంటి పర్యవేక్షణ ఉన్నప్పుడే కాలుష్యం మన ఆహార నాణ్యతపై చూపుతున్న ప్రభావాన్ని గుర్తించి వినియోగదారుల ఆరోగ్యాన్ని కాపాడవచ్చు.
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Pollution Effect On Foods | మనం రోజూ తీసుకునే ఆహారాలపై కాలుష్యం ఎలాంటి ప్రభావం చూపిస్తుందంటే.. నిపుణులు ఏం చెబుతున్నారు..?
కోదాడ కోర్టులో ఏఐఎల్యూ సభ్యత్వ నమోదు
Kiran Komrewar | పెన్షన్లు పెంచాలి.. రాజీవ్ యువ వికాసం అమలు చేయాలి : కిరణ్ కొమ్రేవార్
Vrushakarma | నాగ చైతన్య ‘వృషకర్మ’ రన్‌టైమ్ 3 గంటలకు పైగానే .. థ్రిల్లర్ మూవీపై ఆసక్తికర ప్రచారం!
విద్యార్థుల అభ్యసన సామర్థ్యాన్ని పెంపొందించాలి : కలెక్టర్ అంకిత్
ట్రెండింగ్ వార్తలు
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ

