విద్యార్థుల అభ్యసన సామర్థ్యాన్ని పెంపొందించాలి : కలెక్టర్ అంకిత్
విద్యార్థుల అభ్యసన సామర్ధ్యాన్ని పెంపొందించేలా నాణ్యమైన బోధన అందించాలని ఉపాధ్యాయులకు కలెక్టర్ అంకిత్ సూచించారు. సోమవారం బూర్గంపహాడ్ మండల పరిధిలోని మోరంపల్లిబంజర్ ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్ విద్యార్థులతో...
బూర్గంపహాడ్, నవంబర్ 23 : విద్యార్థుల అభ్యసన సామర్ధ్యాన్ని పెంపొందించేలా నాణ్యమైన బోధన అందించాలని ఉపాధ్యాయులకు కలెక్టర్ అంకిత్ సూచించారు. సోమవారం బూర్గంపహాడ్ మండల పరిధిలోని మోరంపల్లిబంజర్ ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్ విద్యార్థులతో మాట్లాడి బోధనా తీరును పరిశీలించారు. విద్యార్థులకు అందిస్తున్న బోధనా విధానం, విద్యార్థుల అభ్యసన సామర్ధ్యం, డిజిటల్ విద్యావనరుల వినియోగం, ఉపాధ్యాయుల బోధన తీరును కలెక్టర్ పరిశీలించారు. తరగతి గదులను సందర్శించిన ఆయన విద్యార్థులతో మాట్లాడి పాఠ్యాంశాలపై వారి అవగాహనను పరీక్షించారు. పాఠ్యాంశాల్లో ప్రశ్నలు అడుగుతూ సమాధానాలు రాబట్టారు. ఉపాధ్యాయులు మైండ్ మ్యాపింగ్ విధానంతో పాఠ్యాంశాలను బోధించడం, ప్రధాన అంశాలను విద్యార్థులతో సులభంగా గుర్తించి నోట్స్ రాయించడం వంటి బోధనా పద్ధతులు కలెక్టర్ పరిశీలించారు.
ఇంగ్లీష్ లో ఉన్న ప్రశ్నలను అర్ధం చేసుకునేలా అవసరమైన చోట తెలుగులోనూ వివరించాలని, కేవలం నిర్వచనాలు నేర్చుకోవడమే కాకుండా పాఠ్యాంశాలపై పూర్తి అవగాహన కల్పించాలని సూచించారు. పాఠశాలలో ఏడు ల్యాప్టాప్లు, ఆరు కంప్యూటర్ల పనితీరుపై ఆరాతీసి పాత కంప్యూటర్లకు అవసరానికి అనుగుణంగా అప్డేట్ చేసుకోవాలని సూచించారు. డిజిటల్ వనరులను కేవలం అందుబాటులో ఉంచడమే కాకుండా విద్యార్థుల అభ్యసనానికి ఉపయోగపడేలా ప్రతిరోజూ వినియోగించేలా చర్యలు తీసుకోవాలన్నారు. కలెక్టర్ వెంట డిప్యూటీ తాసీల్దార్ ధనియాల వెంకటేశ్వర్లు, ఎంఈవో యదుసింహరాజు ఉన్నారు.
Read Today's Latest Khammam Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
విద్యార్థుల అభ్యసన సామర్థ్యాన్ని పెంపొందించాలి : కలెక్టర్ అంకిత్
దీక్షా దివస్ను విజయవంతం చేయాలి : ఎంపీ వద్దిరాజు రవిచంద్ర
Sneha Shabarish | పిల్లలను ఎందుకు నిలబెట్టారు.. అధికారులకు కలెక్టర్ స్నేహ శబరీష్ వార్నింగ్.. వీడియో
Adilabad | కరువు మండలంగా ప్రకటించాలని ఆర్డీవో కాళ్లు మొక్కిన రైతు
Health tips | జొన్నలు షుగర్ పేషెంట్లకే కాదు.. గుండె వ్యాధులు ఉన్నవారికీ మేలు చేస్తాయట..!
ట్రెండింగ్ వార్తలు
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ

