Health tips | జొన్నలు షుగర్ పేషెంట్లకే కాదు.. గుండె వ్యాధులు ఉన్నవారికీ మేలు చేస్తాయట..!
Health tips | ఈ రోజుల్లో ఆరోగ్యం బాగుండాలంటే చిరుధాన్యాల (Millets) కు మించిన ప్రత్యామ్నాయం లేదు. మధుమేహం (Diabetes), బీపీ (High Blood Pressure) లాంటి దీర్ఘకాలిక రోగుల సంఖ్య ఏటికేడు పెరిగిపోతుండటంతో చిరుధాన్యాలకు డిమాండ్ ఏర్పడింది. ముఖ్యంగా కొర్రలు, అరికలు, జొన్నలు, రాగులు, సజ్జలు వంటి వాటిని జనం ఎక్కువగా వినియోగిస్తున్నారు.
Health tips : ఈ రోజుల్లో ఆరోగ్యం బాగుండాలంటే చిరుధాన్యాల (Millets) కు మించిన ప్రత్యామ్నాయం లేదు. మధుమేహం (Diabetes), బీపీ (High Blood Pressure) లాంటి దీర్ఘకాలిక రోగుల సంఖ్య ఏటికేడు పెరిగిపోతుండటంతో చిరుధాన్యాలకు డిమాండ్ ఏర్పడింది. ముఖ్యంగా కొర్రలు, అరికలు, జొన్నలు, రాగులు, సజ్జలు వంటి వాటిని జనం ఎక్కువగా వినియోగిస్తున్నారు. వీటిలో అన్నింటి కంటే ఎక్కువ ప్రయోజనకరమైనవి, మిగతావాటితో పోల్చితే తక్కువ ధరకు లభ్యమయ్యేవి జొన్నలు (Jowar) మాత్రమే. జొన్నలతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
1. జొన్నలతో చేసే ఏ పదార్థమైనా బలవర్ధకమైనదే. బియ్యం, గోధుమలతో పోల్చితే జొన్నల్లో కాల్షియం ఎక్కువగా ఉంటుంది. రోజూ జొన్నపిండితో చేసిన రొట్టెలు తినడంవల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. అదేవిధంగా జొన్న గటక, జొన్న జావ, జొన్న అన్నం ఇలా ఏ రకంగా తీసుకున్నా జొన్నలతో మేలే జరుగుతుంది.
2. జొన్నల్లో ఇనుము, ప్రోటీన్లు, పీచు పదార్ధాల్లాంటి పోషకాలు ఎక్కువ. కాబట్టి గుండె జబ్బులు రాకుండా అడ్డుకునే గుణం జొన్నల్లో ఉంది. గుండె జబ్బులు ఉన్నవాళ్లకు కూడా సమస్య తీవ్రం కాకుండా చూడటంలో జొన్నలు తోడ్పడుతాయి.
3. ఆరోగ్యానికి కావాల్సిన యాంటీ ఆక్సిడెంట్స్ జొన్నల్లో పుష్కలంగా ఉంటాయి. శరీరంలో ఉండే చెడు కొవ్వును తగ్గించే శక్తి జొన్నలకు ఉంది.
4. ఎముకలను బలిష్టంగా ఉంచేందుకు కావాల్సిన ఫాస్పరస్ జొన్నల్లో లభిస్తుంది. నరాల బలహీనతను తగ్గించే గుణం కూడా జొన్నలకు ఉంది.
5. రోజూ జొన్నలతో చేసిన ఆహార పదార్థాలు తీసుకోవడంవల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. వయసు పెరిగేకొద్దీ వచ్చే మతిమరుపు, కంటిచూపు మందగించడం లాంటి సమస్యలు కూడా జొన్నలు ఎక్కువగా వాడటంవల్ల తగ్గుతాయి.
6. జొన్నల్లో పిండి పదార్థం ఎక్కువగా ఉండటంవల్ల జీర్ణశక్తి పెంపొందుతుంది. జొన్నలు ఆహారంగా తీసుకోవడంవల్ల జీర్ణశక్తికి కావాల్సిన హార్మోన్లు కూడా వృద్ధి చెందుతాయి.
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Health tips | జొన్నలు షుగర్ పేషెంట్లకే కాదు.. గుండె వ్యాధులు ఉన్నవారికీ మేలు చేస్తాయట..!
కారు నడిపిన బీజేపీ కార్పొరేటర్ మైనర్ కుమారుడు.. బైక్‌ను ఢీకొట్టడంతో దంపతులు మృతి
Lungs Health | చలికాలంలో ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉండాలంటే.. ఈ ఆహారాలను తీసుకోవాలి..
OTT Movies | దృశ్యం 3 నుంచి హనుమాన్ అంశ్ వరకు.. ఈ వారం ఓటీటీలో సందడి చేయనున్న సినిమాలు, వెబ్‌సిరీస్‌లు!
Stock market | భారీ నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు.. ఇన్వెస్టర్ల సంపద రూ.5 లక్షల కోట్లు ఆవిరి..!
ట్రెండింగ్ వార్తలు
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ

