Lungs Health | చలికాలంలో ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉండాలంటే.. ఈ ఆహారాలను తీసుకోవాలి..
ఢిల్లీలో కాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరుకోవడంతో ప్రజలు శ్వాసకోశ సమస్యల బారిన పడకుండా ఉండేందుకు అనేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా పీఎం2.5 వంటి సూక్ష్మ ధూళి కణాలు ఊపిరితిత్తుల్లోకి చేరి ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతాయి. ఇంట్లో గాలి నాణ్యతను మెరుగుపరిచేందుకు ఎయిర్ ప్యూరిఫైయర్లు ఉపయోగపడతాయి.
Lungs Health | ఢిల్లీలో కాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరుకోవడంతో ప్రజలు శ్వాసకోశ సమస్యల బారిన పడకుండా ఉండేందుకు అనేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా పీఎం2.5 వంటి సూక్ష్మ ధూళి కణాలు ఊపిరితిత్తుల్లోకి చేరి ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతాయి. ఇంట్లో గాలి నాణ్యతను మెరుగుపరిచేందుకు ఎయిర్ ప్యూరిఫైయర్లు ఉపయోగపడతాయి. అయితే ఆహారపు అలవాట్లు కూడా కాలుష్యం వల్ల శరీరంపై పడే ప్రభావాలను ఎదుర్కోవడంలో సహాయపడతాయని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు. ఈ సందర్భంగా నాలుగు రకాల ఆహారపు అలవాట్లను పాటించాలని చెబుతున్నారు.
బీటా కెరోటిన్ ఉండే ఆహారాలు..
క్యారెట్లు, గుమ్మడికాయ, చిలగడదుంపలు వంటి బీటా కెరోటిన్ అధికంగా ఉండే ఆహార పదార్థాలను తీసుకోవడం మంచిది. ఇవి శ్వాసనాళాల లోపలి పొర ఆరోగ్యాన్ని కాపాడడంలో సహాయపడతాయి. అలాగే బాదం, వాల్నట్స్, పాలకూర వంటి విటమిన్ ఇ అధికంగా ఉండే ఆహారాలను తీసుకోవాలి. వీటిలోని పోషకాలు కణాల రక్షణకు తోడ్పడతాయి. వాల్నట్స్ వంటి వాటిలో ఉండే ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు శ్వాసనాళాల్లో వాపును తగ్గించడంలో సహాయపడతాయి. ఉసిరి, జామ, నారింజ, నిమ్మ వంటి విటమిన్ సి అధికంగా ఉండే పండ్లను కూడా ఆహారంలో చేర్చుకోవాలి.
లివర్ కణాలకు దోహదం చేసేవి..
బ్రొకోలీ, క్యాబేజీ, ఆవ ఆకులు వంటి క్రూసిఫెరస్ కూరగాయలను తీసుకోవడం మరో ముఖ్యమైన అలవాటు. వీటిలో ఉండే సల్ఫోరఫేన్ అనే పదార్థం కాలేయంలోని కొన్ని రక్షణ ప్రక్రియలను ప్రేరేపించడంలో సహాయపడుతుంది. తద్వారా శరీరంలోకి చేరిన కాలుష్య కారకాలను ప్రాసెస్ చేసి బయటకు పంపే ప్రక్రియకు తోడ్పడుతుంది. వీటిని కూరలు, వేపుళ్లు, సూప్‌ల రూపంలో తీసుకోవచ్చు. ముఖ్యంగా సాయంత్రం వేళ బ్రొకోలీ సూప్ తీసుకోవడం మంచి ఎంపికగా పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు.
తగినంత నీరు తాగాలి..
వీటితో పాటు తగినంత నీరు తాగడం కూడా చాలా ముఖ్యం. గోరువెచ్చని నీరు, ఇతర వెచ్చని ద్రవ పదార్థాలు తీసుకోవడం వల్ల శ్వాసనాళాలు తేమగా ఉండడానికి సహాయపడుతుంది. రోజుకు సుమారు రెండు నుంచి మూడు లీటర్ల నీటిని తీసుకుంటూ శరీరంలో నీటి కొరత ఏర్పడకుండా చూసుకోవాలి. అయితే ఎలాంటి ఆహారం తీసుకున్నా వాయు కాలుష్యం నుంచి పూర్తిస్థాయిలో రక్షణ కల్పించలేదని గుర్తుంచుకోవాలి. పోషకాహారం శరీర ఆరోగ్యానికి తోడ్పడుతుంది కానీ కాలుష్య ప్రభావాన్ని పూర్తిగా అడ్డుకోలేదు. కాబట్టి ఆరోగ్యకరమైన ఆహారంతో పాటు ఎయిర్ ప్యూరిఫైయర్ల వినియోగం, కాలుష్యం ఎక్కువగా ఉన్నప్పుడు బయట తిరగడం తగ్గించడం వంటి జాగ్రత్తలు కూడా పాటించాలని నిపుణులు చెబుతున్నారు.
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Lungs Health | చలికాలంలో ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉండాలంటే.. ఈ ఆహారాలను తీసుకోవాలి..
OTT Movies | దృశ్యం 3 నుంచి హనుమాన్ అంశ్ వరకు.. ఈ వారం ఓటీటీలో సందడి చేయనున్న సినిమాలు, వెబ్‌సిరీస్‌లు!
Stock market | భారీ నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు.. ఇన్వెస్టర్ల సంపద రూ.5 లక్షల కోట్లు ఆవిరి..!
‘ఐలు నల్లగొండ 12వ జిల్లా మహాసభలను జయప్రదం చేయండి’
QS Rankings | క్యూఎస్ వరల్డ్ ర్యాంకింగ్స్- 2027.. 76 స్థానాలు మెరుగుపరచుకున్న ఐఐటీ హైదరాబాద్
ట్రెండింగ్ వార్తలు
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ

