కారు నడిపిన బీజేపీ కార్పొరేటర్ మైనర్ కుమారుడు.. బైక్‌ను ఢీకొట్టడంతో దంపతులు మృతి
BJP Corporator's Minor Son Rams SUV Into Bike | బీజేపీ కార్పొరేటర్ మైనర్ కుమారుడు కారును వేగంగా నడిపాడు. ఒక బైక్‌ను అతడు ఢీకొట్టాడు. దానిపై ప్రయాణిస్తున్న దంపతులు గాలిలోకి ఎగిరి రోడ్డుపై పడి మరణించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ముంబై: బీజేపీ కార్పొరేటర్ మైనర్ కుమారుడు కారును వేగంగా నడిపాడు. ఒక బైక్‌ను అతడు ఢీకొట్టాడు. దానిపై ప్రయాణిస్తున్న దంపతులు గాలిలోకి ఎగిరి రోడ్డుపై పడి మరణించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. (BJP Corporator’s Minor Son Rams SUV Into Bike) మహారాష్ట్రలోని బీడ్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. నవంబర్ 20న మధ్యాహ్నం 3:30 గంటల సమయంలో ప్రహ్లాద్ గైక్వాడ్, ఆయన భార్య సునీత బైక్‌పై వెళ్తున్నారు. ఒక ఎస్యూవీ వేగంగా దూసుకువచ్చింది. ఎదురుగా వస్తున్న ఆ బైక్‌ను ఢీకొట్టి వెళ్లిపోయింది.
కాగా, ఈ ప్రమాదం ధాటికి ఆ బైక్‌పై ఉన్న ఆ దంపతులు గాలిలోకి ఎగిరి రోడ్డుపై పడ్డారు. ప్రహ్లాద్ అక్కడికక్కడే మరణించగా ఆయన భార్య ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయింది. దీంతో పోలీసులు ఈ సంఘటనపై దర్యాప్తు చేపట్టారు. ఆ ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలించారు. బీజేపీ కార్పొరేటర్ దీపక్ మెండ్కే మైనర్ కుమారుడైన దక్ష ఆ కారు నడిపినట్లు పోలీసులు గుర్తించారు.
మరోవైపు మరణించిన దంపతుల పిల్లల ఫిర్యాదుపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ప్రమాదానికి సంబంధించిన సీసీటీవీ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో మైనర్ పిల్లలు వాహనాలు నడిపి ప్రమాదాలు కలిగించడంపై పలువురు ఆందోళన వ్యక్తం చేశారు.
Beed, Maharashtra – A tragic road accident in Majalgaon town of Maharashtra’s Beed district has claimed the lives of a motorcycle-borne couple after their bike was allegedly hit by a car driven by the son of a BJP councillor. The accident occurred on November 20 afternoon on Gadhi Road near a petrol pump. According to the police complaint, a car driven by Daksh Mendke, son of Majalgaon Municipal Council BJP councillor Deepak Mendke, collided head-on with a motorcycle carrying Prahlad Gaikwad and his wife, Sunita Gaikwad. CCTV footage of the incident, which has since surfaced, reportedly shows the force of the collision, with the couple being thrown into the air before landing on the road.
— NextMinute News (@nextminutenews7) November 23, 2026
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- bike
- BJP Corporator
- Couple
- Dies
RELATED ARTICLES
తాజా వార్తలు
Health tips | జొన్నలు షుగర్ పేషెంట్లకే కాదు.. గుండె వ్యాధులు ఉన్నవారికీ మేలు చేస్తాయట..!
కారు నడిపిన బీజేపీ కార్పొరేటర్ మైనర్ కుమారుడు.. బైక్‌ను ఢీకొట్టడంతో దంపతులు మృతి
Lungs Health | చలికాలంలో ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉండాలంటే.. ఈ ఆహారాలను తీసుకోవాలి..
OTT Movies | దృశ్యం 3 నుంచి హనుమాన్ అంశ్ వరకు.. ఈ వారం ఓటీటీలో సందడి చేయనున్న సినిమాలు, వెబ్‌సిరీస్‌లు!
Stock market | భారీ నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు.. ఇన్వెస్టర్ల సంపద రూ.5 లక్షల కోట్లు ఆవిరి..!
ట్రెండింగ్ వార్తలు
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ

