Adilabad | కరువు మండలంగా ప్రకటించాలని ఆర్డీవో కాళ్లు మొక్కిన రైతు
Adilabad | వర్షాలు లేక పంటలు ఎండిపోయి ఆర్థికంగా నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవాలని రాష్ట్రంలో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఆదిలాబాద్ : వర్షాలు లేక పంటలు ఎండిపోయి ఆర్థికంగా నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవాలని రాష్ట్రంలో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కనిపించిన ప్రతీ అధికారికి తమ గోడును వెల్లబు చ్చుకుంటున్నారు. కరెంట్ సక్రమంగా ఇవ్వాలని,ఎండిన పంటలకు పరిహారం అందించాలని పదేపదే వేడుకుంటున్నారు. కరువు మండలంగా ప్రకటిస్తే కొంతలో కొంత ఆర్థిక వెసులుబాటు దొరుకుతుందన్న ఆశతో రైతులు అధికారులకు కాళ్ల, వేళ్ల బ్రతిమిలాడుతున్నారు.
ఆదిలాబాద్ జిల్లా తలమడుగు( Talamadugu ) మండలాన్ని కరువు మండలం ( Drought ) గా ప్రకటించాలని మండల రైతులు సోమవారం జాతీయ రహదారిపై నాలుగు గంటల పాటు రాస్తారోకో నిర్వహించారు. దీంతో ఇరువైపులా ట్రాఫిక్ నిలిచిపోయి ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. ఆర్డీవో, పోలీసులు రైతులకు నచ్చేజేపేందుకు వచ్చారు. ఇంతల్లో లస్మన్న అనే రైతు ఆర్డీవో జగదీశ్వర్ రావు కాళ్లు ( RDOs feet ) పట్టుకొని కరువు మండలంగా ప్రకటించాలని వేడుకోవడం అందరిని కలిచివేసింది. రైతుల సమస్యను జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇవ్వడంతో రైతులు రాస్తారోకోను విరమించుకున్నారు.
Read Today's Latest Adilabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sneha Shabarish | పిల్లలను ఎందుకు నిలబెట్టారు.. అధికారులకు కలెక్టర్ స్నేహ శబరీష్ వార్నింగ్.. వీడియో
Adilabad | కరువు మండలంగా ప్రకటించాలని ఆర్డీవో కాళ్లు మొక్కిన రైతు
Health tips | జొన్నలు షుగర్ పేషెంట్లకే కాదు.. గుండె వ్యాధులు ఉన్నవారికీ మేలు చేస్తాయట..!
కారు నడిపిన బీజేపీ కార్పొరేటర్ మైనర్ కుమారుడు.. బైక్ను ఢీకొట్టడంతో దంపతులు మృతి
Lungs Health | చలికాలంలో ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉండాలంటే.. ఈ ఆహారాలను తీసుకోవాలి..
ట్రెండింగ్ వార్తలు
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ

