Vrushakarma | నాగ చైతన్య ‘వృషకర్మ’ రన్‌టైమ్ 3 గంటలకు పైగానే .. థ్రిల్లర్ మూవీపై ఆసక్తికర ప్రచారం!
Vrushakarma | అక్కినేని నాగ చైతన్య కెరీర్లోనే భారీ బడ్జెట్‌తో, అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం ‘వృషకర్మ’. విభిన్న కథాంశంతో రూపొందుతున్న ఈ మిస్టికల్ థ్రిల్లర్‌పై ఇప్పటికే ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ‘విరూపాక్ష’తో మంచి విజయాన్ని అందుకున్న దర్శకుడు కార్తీక్ దండు ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.
Vrushakarma | అక్కినేని నాగ చైతన్య కెరీర్లోనే భారీ బడ్జెట్‌తో, అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం ‘వృషకర్మ’. విభిన్న కథాంశంతో రూపొందుతున్న ఈ మిస్టికల్ థ్రిల్లర్‌పై ఇప్పటికే ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ‘విరూపాక్ష’తో మంచి విజయాన్ని అందుకున్న దర్శకుడు కార్తీక్ దండు ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. డిసెంబర్ 4న ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ ఆసక్తికర వార్త సోషల్ మీడియాలో, సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ‘వృషకర్మ’ రన్‌టైమ్ మూడు గంటలకు పైగా ఉండబోతుందనే ప్రచారం జరుగుతోంది. సాధారణంగా థ్రిల్లర్ సినిమాలు వేగవంతమైన కథనం, ఉత్కంఠభరిత సన్నివేశాలతో తక్కువ నిడివిలో ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. అలాంటిది ఈ సినిమా మూడు గంటలకు పైగా ఉంటుందనే వార్త ఆసక్తిని పెంచుతోంది.
అయితే ఈ రన్‌టైమ్‌పై చిత్రబృందం నుంచి ఇప్పటివరకు అధికారిక ప్రకటన రాలేదు. సెన్సార్ కార్యక్రమాలు పూర్తయి సర్టిఫికెట్ వచ్చిన తర్వాత సినిమా నిడివిపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. నిజంగానే మూడు గంటలకు పైగా సినిమా ఉంటుందా? లేక ప్రచారంలో ఉన్న వార్తల్లో నిజం ఎంత? అనేది తెలియాల్సి ఉంది. ఈ సినిమాలో నాగ చైతన్యకు జోడీగా మీనాక్షి చౌదరి హీరోయిన్గా నటిస్తోంది. వీరితో పాటు స్పర్శ్ శ్రీవాస్తవ, జయరామ్, కియారా ఖన్నా తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. మిస్టరీ, మాంత్రిక అంశాలు, థ్రిల్లింగ్ సన్నివేశాలతో కూడిన కథ ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని అందించనుందని సమాచారం.
‘వృషకర్మ’ చిత్రాన్ని బీవీఎస్ఎన్ ప్రసాద్, సుకుమార్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఎస్వీసీసీ, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లపై భారీ స్థాయిలో ఈ సినిమాను రూపొందిస్తున్నారు. అజనీష్ లోక్‌నాథ్ సంగీతం అందిస్తున్నారు.‘విరూపాక్ష’ తర్వాత కార్తీక్ దండు మరో మిస్టికల్ థ్రిల్లర్‌తో ప్రేక్షకుల ముందుకు వస్తుండటం, నాగ చైతన్య కెరీర్లోనే భారీ ప్రాజెక్ట్ కావడంతో ‘వృషకర్మ’పై అంచనాలు పెరుగుతున్నాయి. డిసెంబర్ 4న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kiran Komrewar | పెన్షన్లు పెంచాలి.. రాజీవ్ యువ వికాసం అమలు చేయాలి : కిరణ్ కొమ్రేవార్
Vrushakarma | నాగ చైతన్య ‘వృషకర్మ’ రన్‌టైమ్ 3 గంటలకు పైగానే .. థ్రిల్లర్ మూవీపై ఆసక్తికర ప్రచారం!
విద్యార్థుల అభ్యసన సామర్థ్యాన్ని పెంపొందించాలి : కలెక్టర్ అంకిత్
దీక్షా దివస్‌ను విజయవంతం చేయాలి : ఎంపీ వద్దిరాజు రవిచంద్ర
Sneha Shabarish | పిల్లలను ఎందుకు నిలబెట్టారు.. అధికారులకు కలెక్టర్ స్నేహ శబరీష్ వార్నింగ్.. వీడియో
ట్రెండింగ్ వార్తలు
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ

