Crime News | రూ.1.25 కోట్ల భూమి కోసం గొడవ.. డాక్టర్ దారుణ హత్య..!
Crime News | కోటీ ఇరవై ఐదు లక్షల రూపాయల భూమి విషయంలో రాజుకున్న వివాదం ఓ డాక్టర్ ప్రాణం తీసింది. కొనుగోలు చేసిన భూమికి సంబంధించి ఇవ్వాల్సిన డబ్బుల కమిషన్ విషయంలో ల్యాండ్ ఏజంట్‌తో గొడవ జరిగింది. ఈ క్రమంలో ల్యాండ్ ఏజెంట్ (Land Agent) డాక్టర్‌పై దాడి చేయడంతో అతడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.
Crime News : కోటీ ఇరవై ఐదు లక్షల రూపాయల భూమి విషయంలో రాజుకున్న వివాదం ఓ డాక్టర్ ప్రాణం తీసింది. కొనుగోలు చేసిన భూమికి సంబంధించి ఇవ్వాల్సిన డబ్బుల కమిషన్ విషయంలో ల్యాండ్ ఏజంట్‌తో గొడవ జరిగింది. ఈ క్రమంలో ల్యాండ్ ఏజెంట్ (Land Agent) డాక్టర్‌పై దాడి చేయడంతో అతడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. మహారాష్ట్ర (Maharastra) లోని జల్గావ్ జిల్లా (Jalgao district) పచోర తాలూకా (Pachora Taluka) లోని గొరాడ్ఖేడా (GoradKheda) గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. గోరాడ్ఖేడా గ్రామానికి చెందిన డాక్టర్ సంజయ్ తేలి.. గ్రామంలోనే రూ.1.25 కోట్ల విలువైన వ్యవసాయ భూమిని కొన్నాడు. ఆ భూమికి రూ.80 లక్షలు చెల్లించాడు. ఇంతలో బేరానికి మద్యవర్తిగా ఉన్న ల్యాండ్ ఏజెంట్ రూ.1.90 లక్షల కమిషన్ డిమాండ్ చేశాడు. అందుకు డాక్టర్ సంజయ్ నిరాకరించాడు. దాంతో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. ఈ క్రమంలో ల్యాండ్ ఏజెంట్ ధర్మరాజ్ పాటిల్ సంజయ్ తేలిపై దాడిచేశాడు.
ఈ దాడిలో డాక్టర్ మృతిచెందాడు. అనంతరం సాక్ష్యాలు లేకుండా చేయడం కోసం తన దగ్గర పనిచేసే మరి ఇద్దరితో కలిసి మృతదేహాన్ని మాయం చేశాడు. బహుళా డ్యామ్‌లో ఆ మృతదేహాన్ని పడేశాడు. హత్య అనంతరం మృతుడి కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతుడి లాస్ట్ లోకేషన్, కాల్ రికార్డ్స్ ఆధారంగా ధర్మరాజ్ పాటిల్‌ను, అతడి ఉద్యోగులను నిందితులుగా గుర్తించి అరెస్ట్ చేశారు.
Read Today's Latest Crime News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Crime News | రూ.1.25 కోట్ల భూమి కోసం గొడవ.. డాక్టర్ దారుణ హత్య..!
Pollution Effect On Foods | మనం రోజూ తీసుకునే ఆహారాలపై కాలుష్యం ఎలాంటి ప్రభావం చూపిస్తుందంటే.. నిపుణులు ఏం చెబుతున్నారు..?
కోదాడ కోర్టులో ఏఐఎల్యూ సభ్యత్వ నమోదు
Kiran Komrewar | పెన్షన్లు పెంచాలి.. రాజీవ్ యువ వికాసం అమలు చేయాలి : కిరణ్ కొమ్రేవార్
Vrushakarma | నాగ చైతన్య ‘వృషకర్మ’ రన్‌టైమ్ 3 గంటలకు పైగానే .. థ్రిల్లర్ మూవీపై ఆసక్తికర ప్రచారం!
ట్రెండింగ్ వార్తలు
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ

