Nitin Nabin | రాహుల్‌గాంధీకి దేశాభివృద్ధి కాదు.. తన కుటుంబ అభివృద్ధే కావాలి : నితిన్ నబీన్
Nitin Nabin | కాంగ్రెస్ ఎంపీ రాహుల్‌గాంధీకి దేశ అభివృద్ధికంటే తన కుటుంబ అభివృద్ధే ముఖ్యమని బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ విమర్శించారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణపై ఇండియా కూటమి రాద్ధాంతం చేస్తోందని ఆయన మండిపడ్డారు. ఎస్ఐఆర్ ప్రక్రియపై తాము ఇచ్చిన వివరణకు ప్రజలు మద్దతు తెలుపుతున్నారన్నారని అన్నారు.
Nitin Nabin | కాంగ్రెస్ ఎంపీ రాహుల్‌గాంధీకి దేశ అభివృద్ధికంటే తన కుటుంబ అభివృద్ధే ముఖ్యమని బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ విమర్శించారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణపై ఇండియా కూటమి రాద్ధాంతం చేస్తోందని ఆయన మండిపడ్డారు. ఎస్ఐఆర్ ప్రక్రియపై తాము ఇచ్చిన వివరణకు ప్రజలు మద్దతు తెలుపుతున్నారన్నారని అన్నారు. కాగా, ఎస్ఐఆర్పై విపక్షాల దుష్ప్రచారాన్ని తిప్పికొట్టేందుకు కరీంనగర్లో బీజేపీ మహాపాదయాత్ర చేపట్టింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన నితిన్ నబీన్ మాట్లాడుతూ.. రాజ్యాంగాన్ని రాహుల్ గాంధీ కేవలం జేబులో పెట్టుకుంటారని, కానీ తాము హృదయాల్లో పెట్టుకుంటామని చెప్పారు.
రాహుల్‌గాంధీ తరచూ ఓట్ చోరీ అని ఆరోపిస్తున్నారని, ఓట్లు తమకే ఉన్నాయని నబీన్ అన్నారు. దేశవ్యాప్తంగా మూడు కోట్ల మంది చనిపోయారని, వారి ఓట్లు ఇంకా జాబితాలో ఉండాలా..? అని ప్రశ్నించారు. మరో ఆరు కోట్ల మంది వలస వెళ్లారని, వారికి రెండు ప్రాంతాల్లో ఓట్లు ఉండాలా..? ఆయన క్వశ్చన్ చేశారు. చొరబాటుదారులకు ఓటువేసే అవకాశం కల్పించాలా..? అని అడిగారు. రాహుల్‌గాంధీ విదేశాలకు వెళ్లి దేశం పరువు తీస్తున్నారన్నారని ఆరోపించారు.
దేశ ఆర్థికవ్యవస్థ ఆపదలో ఉందని విదేశాల్లో రాహుల్ వ్యాఖ్యానించారని, దేశాభివృద్ధి ఆయనకు పట్టదని నితిన్ నబీన్ విమర్శించారు. ఆయన బాధంతా తన కుటుంబ అభివృద్ధి గురించేనని, రేవంత్‌రెడ్డి కేవలం రాహుల్ గాంధీకి ఏటీఎంలా పని చేస్తున్నారని అన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Nitin Nabin | రాహుల్‌గాంధీకి దేశాభివృద్ధి కాదు.. తన కుటుంబ అభివృద్ధే కావాలి : నితిన్ నబీన్
జాతీయ క్రీడల్లో సెయింట్ జోసెఫ్ విద్యార్థుల జయకేతనం
Watch: ఇద్దరు వరుల మెడలో కోటి విలువైన కరెన్సీ దండలు.. వారిని ఆశ్చర్యపరిచిన బావ
Dimple Hayathi | నాకు ఇంకా పెళ్లి కాలేదు.. నెటిజన్‌కు డింపుల్ హయాతి రిప్లై
Crime News | రూ.1.25 కోట్ల భూమి కోసం గొడవ.. డాక్టర్ దారుణ హత్య..!
ట్రెండింగ్ వార్తలు
Watch: ఇద్దరు వరుల మెడలో కోటి విలువైన కరెన్సీ దండలు.. వారిని ఆశ్చర్యపరిచిన బావ
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?

