Life style | మీ బాత్రూమ్ కంపు కొడుతున్నదా.. అయితే ఈ టిప్స్‌తో సమస్యకు చెక్ పెట్టండి..!
Life style | మనం ఎంత శుభ్రం చేసినా సరే బాత్రూమ్ (Bathroom ) నుంచి గలీజ్ వాసన వస్తుంటుంది. ఈ వాసన తీవ్రంగా ఇబ్బంది పెడుతుంది. అంతేకాదు ఈ దుర్వాసన కారణంగా వ్యాధులు వచ్చే ప్రమాదం కూడా ఉంది. బాత్రూమ్ నుంచి దుర్వాసన వస్తుందంటే దానిలో బ్యాక్టీరియా (Bacteria) లాంటివి పెరుగుతున్నాయని అర్థం. కాబట్టి బాత్రూమ్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి.
Life style : మనం ఎంత శుభ్రం చేసినా సరే బాత్రూమ్ (Bathroom ) నుంచి గలీజ్ వాసన వస్తుంటుంది. ఈ వాసన తీవ్రంగా ఇబ్బంది పెడుతుంది. అంతేకాదు ఈ దుర్వాసన కారణంగా వ్యాధులు వచ్చే ప్రమాదం కూడా ఉంది. బాత్రూమ్ నుంచి దుర్వాసన వస్తుందంటే దానిలో బ్యాక్టీరియా (Bacteria) లాంటివి పెరుగుతున్నాయని అర్థం. కాబట్టి బాత్రూమ్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. లేదంటే అనారోగ్య సమస్యలు రావడం ఖాయం. మరి బాత్రూమ్ నుంచి దుర్వాసన రాకుండా ఉండాలంటే ఏం చేయాలో ఇప్పుడు చూద్దాం..
వెంటిలేషన్
బాత్రూమ్ నుంచి దుర్వాసన రావడానికి చాలా కారణాలు ఉంటాయి. అందులో వెంటిలేషన్ సమస్య కూడా ఒకటి. బాత్రూమ్ నుంచి దుర్వాసన వస్తూ ఉంటే ముందుగా వెంటిలేషన్ సరిగ్గా ఉందో లేదో చెక్ చేసుకోండి. బాత్రూమ్ లోకి వెంటిలేషన్ ఉంటే గాలి బయటకు వెళ్తూ వస్తూ ఉంటుంది. కానీ చాలా ఇళ్లలో బాత్రూమ్కు వెంటిలేషన్ సరిగా ఉండట్లేదు. అలాంటప్పుడు బాత్రూమ్కు ఎగ్జాస్ట్ ఫ్యాన్, విండో ఏర్పాటు చేసుకోవాలి.
రెగ్యులర్ క్లీనింగ్
బాత్రూమ్ నుంచి దుర్వాసన రాకుండా ఉండాలంటే రెండు రోజలుకు ఒకసారైనా శుభ్రం చేయాలి. అదేవిధంగా కేవలం నీళ్లతో కాకుండా బాత్రూమ్ను క్లీన్ చేయడానికి క్లీనింగ్ ఏజంట్లను ఉపయోగించాలి. దాంతో అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం తగ్గుతుంది.
ఫ్లష్ ట్యాంక్‌ను క్లీనింగ్
వెంటిలేషన్ సరిగ్గా ఉండి, బాత్రూమ్ క్లీన్ చేసినా దుర్వాసన వస్తూ ఉందంటే అందుకు ఫ్లష్ ట్యాంక్ కూడా కారణమై ఉండవచ్చు. ఎందుకంటే ఫ్లష్ ట్యాంకులో నీరు ఎక్కువగా నిల్వ ఉంటుంది. దానివల్ల బ్యాక్టీరియా పెరగడం, నాచు పట్టడం లాంటివి జరుగుతాయి. కాబట్టి తరచూ ఫ్లష్ ట్యాంకును శభ్రం చేస్తుండాలి.
ప్లంబింగ్ చెకింగ్
ప్లంబింగ్ లోపాల కారణంగా కూడా బాత్రూమ్ నుంచి దుర్వాసన వస్తుంది. సింక్స్, బ్రాత్రూమ్లో నిరంతరం దుర్వాసన వస్తూ ఉంటే ప్లంబర్ని పిలిపించి ఒకసారి ప్లంబింగ్ను చెక్ చేయించాలి. సింక్ గొట్టాల్లో చెత్త పేరుకుపోవడం వల్ల కూడా ఇలా దుర్వాసన వస్తుంది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Life style | మీ బాత్రూమ్ కంపు కొడుతున్నదా.. అయితే ఈ టిప్స్‌తో సమస్యకు చెక్ పెట్టండి..!
Nitin Nabin | రాహుల్‌గాంధీకి దేశాభివృద్ధి కాదు.. తన కుటుంబ అభివృద్ధే కావాలి : నితిన్ నబీన్
జాతీయ క్రీడల్లో సెయింట్ జోసెఫ్ విద్యార్థుల జయకేతనం
Watch: ఇద్దరు వరుల మెడలో కోటి విలువైన కరెన్సీ దండలు.. వారిని ఆశ్చర్యపరిచిన బావ
Dimple Hayathi | నాకు ఇంకా పెళ్లి కాలేదు.. నెటిజన్‌కు డింపుల్ హయాతి రిప్లై
ట్రెండింగ్ వార్తలు
Watch: ఇద్దరు వరుల మెడలో కోటి విలువైన కరెన్సీ దండలు.. వారిని ఆశ్చర్యపరిచిన బావ
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?

