Man Attacks Police With Knife | ఐదుగురు పోలీసులపై కత్తితో దాడి చేసిన వ్యక్తి.. ఎన్కౌంటర్లో గాయాలు
Man Attacks Police With Knife | విచారణ కోసం పోలీస్ స్టేషన్కు తీసుకువచ్చిన వ్యక్తి కత్తితో పోలీసులపై దాడి చేశాడు. ఐదుగురు పోలీసులు గాయపడ్డారు. వీరిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నది. పారిపోయిన ఆ వ్యక్తి పోలీస్ ఎన్కౌంటర్లో గాయపడ్డాడు.
ఢిల్లీ: విచారణ కోసం పోలీస్ స్టేషన్కు తీసుకువచ్చిన వ్యక్తి కత్తితో పోలీసులపై దాడి చేశాడు. ఐదుగురు పోలీసులు గాయపడ్డారు. వీరిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నది. పారిపోయిన ఆ వ్యక్తి పోలీస్ ఎన్కౌంటర్లో గాయపడ్డాడు. (Man Attacks Police With Knife) దేశ రాజధాని ఢిల్లీలో ఈ సంఘటన జరిగింది. 30 ఏళ్ల నబీల్ అనే వ్యక్తి తన తల్లిని, సోదరిని వేధించినట్లు పోలీసులకు ఫిర్యాదు అందింది. దీంతో సోమవారం మధ్యాహ్నం పోలీసులు విచారణ కోసం జామా మసీదు పోలీస్ స్టేషన్కు అతడిని తీసుకువచ్చారు.
కాగా, నబీల్ను ప్రశ్నిస్తుండగా అకస్మాత్తుగా కత్తి తీసి పోలీసులపై దాడి చేశాడు. ఆ తర్వాత ఒక బైక్ చోరీ చేసి అక్కడి నుంచి పారిపోయాడు. అతడి దాడిలో ఐదుగురు పోలీసులకు మెడ, ముఖం భాగాల్లో గాయాలయ్యాయి. పరిస్థితి విషమంగా ఉన్న ముగ్గురు పోలీసులను సర్ గంగారామ్ ఆసుపత్రికి తరలించారు. గాయపడిన మరో ఇద్దరు పోలీసులు సంజీవని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
మరోవైపు పారిపోయిన నబీల్ను పాత ఢిల్లీలోని చిట్లీ ఖబర్ ప్రాంతంలో పోలీసులు గుర్తించారు. అతడ్ని అరెస్ట్ చేసేందుకు ప్రయత్నించగా మళ్లీ పోలీసులపై దాడి చేశాడు. దీంతో నబీల్పై పోలీసులు కాల్పులు జరిపారు. ఎన్కౌంటర్లో గాయపడిన అతడ్ని అదుపులోకి తీసుకున్నారు. ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అతడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ సంఘటన ఢిల్లీలో కలకలం రేపింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- cops
- Delhi
- MAN
- police encounter
RELATED ARTICLES
తాజా వార్తలు
నవీన్ నాయక్ ప్రాణ త్యాగానికి జాతీయ గుర్తింపు
Man Attacks Police With Knife | ఐదుగురు పోలీసులపై కత్తితో దాడి చేసిన వ్యక్తి.. ఎన్కౌంటర్లో గాయాలు
బాధితుల సమస్యలపై సత్వరమే స్పందించాలి : ఎస్పీ శరత్ చంద్ర ప్రవార్
Dalits Complaint | కాంగ్రెస్ ఎమ్మెల్యే వేధింపులపై కలెక్టర్కు దళితుల ఫిర్యాదు
‘విశ్వబ్రాహ్మణ విద్యార్థి వసతి గృహ కమిటీ ఏర్పాటు అప్రజాస్వామికం’
ట్రెండింగ్ వార్తలు
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?

