The Breaking News | డిసెంబర్ 11న థియేటర్లలో సందడి చేయనున్న ‘ది బ్రేకింగ్ న్యూస్’!
తెలుగు ప్రేక్షకులను అలరించేందుకు మరో ఆసక్తికరమైన చిత్రం సిద్ధమైంది. మీడియా రంగం నేపథ్యంలో రూపొందిన ‘ది బ్రేకింగ్ న్యూస్’ చిత్రం డిసెంబర్ 11, 2026న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది.
తెలుగు ప్రేక్షకులను అలరించేందుకు మరో ఆసక్తికరమైన చిత్రం సిద్ధమైంది. మీడియా రంగం నేపథ్యంలో రూపొందిన ‘ది బ్రేకింగ్ న్యూస్’ చిత్రం డిసెంబర్ 11, 2026న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. ఓపెన్ స్కై క్రియేషన్స్ బ్యానర్‌పై హనుమంత రెడ్డి, ఉమా గుటూర్ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాకు పవన్ కడియాల రచన మరియు దర్శకత్వం వహించారు. సీనియర్ నటుడు మురళీ మోహన్, అనన్య నాగళ్ల ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రంలో సోనియా నాయుడు, ఆర్.కె. నాయుడు, వాసుదేవ్, ప్రేమ్ కృష్ణ, రవి ప్రకాష్, వాహిని తదితరులు ఇతర కీలక పాత్రలు పోషించారు.
వార్తా ప్రపంచంలోని అంతర్గత పరిణామాలు, మీడియా వ్యవస్థ నేపథ్యంలో సాగే ఉత్కంఠభరితమైన కథాంశంతో ఈ థ్రిల్లర్ చిత్రాన్ని తెరకెక్కించారు. గతంలో ఈ సినిమా ప్రారంభోత్సవంతో పాటు ఫస్ట్ లుక్‌ను మెగాస్టార్ చిరంజీవి ఆవిష్కరించగా, ఇటీవల నవంబర్ 20న టాలీవుడ్ హీరో సుమంత్ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. విడుదలైనప్పటి నుంచి ఈ ట్రైలర్ ప్రేక్షకుల నుంచి విశేష స్పందనను అందుకుంటూ సోషల్ మీడియాలో మంచి క్రేజ్ సంపాదించుకుంది.
ప్రతిభావంతులైన సాంకేతిక నిపుణులు ఈ చిత్రానికి పనిచేశారు. ఈ సినిమాకు శశి ప్రీతమ్ సంగీతం అందించగా, సైనాథ్ ఛాయాగ్రహణం, శిరీష్ ప్రసాద్ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహించారు. రేఖ బైరి, నరేన్ కె సహ నిర్మాతలుగా, రమణ రెడ్డి తాటిరెడ్డి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరించారు. చీఫ్ అసోసియేట్ డైరెక్టర్‌గా బి.ఎన్. గణేష్ భట్, అసోసియేట్ డైరెక్టర్లుగా సంజీవ్ ధరణి, సాయి యోగేష్ పనిచేశారు. సౌండ్ డిజైనర్‌గా జి. పురుషోత్తం రాజు, అసోసియేట్ ఎడిటర్‌గా శ్రీనివాస్ శాములేటి, ఫిల్మ్ వీడియో ఎడిటర్‌గా లూర్డు బాధ్యతలు నిర్వర్తించారు. రాకేష్ పట్వారీ, రోహిన్ ఏటూరి, అర్చన టి.ఎన్. క్రియేటివ్ టీమ్‌గా, మిట్టు అరెట్టి పబ్లిసిటీ డిజైనర్‌గా పనిచేయగా, మధుర ఆడియో సంస్థ ఈ చిత్ర ఆడియో హక్కులను సొంతం చేసుకుంది. పీఆర్వోగా వీరబాబు వ్యవహరిస్తున్నారు. ఆసక్తికరమైన కథాంశంతో రూపొందిన ‘ది బ్రేకింగ్ న్యూస్’ డిసెంబర్ 11న ప్రేక్షకుల ముందుకు రానుండటంతో సినీ వర్గాల్లో మంచి అంచనాలు నెలకొన్నాయి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
The Breaking News | డిసెంబర్ 11న థియేటర్లలో సందడి చేయనున్న ‘ది బ్రేకింగ్ న్యూస్’!
నవీన్ నాయక్ ప్రాణ త్యాగానికి జాతీయ గుర్తింపు
Man Attacks Police With Knife | ఐదుగురు పోలీసులపై కత్తితో దాడి చేసిన వ్యక్తి.. ఎన్కౌంటర్లో గాయాలు
బాధితుల సమస్యలపై సత్వరమే స్పందించాలి : ఎస్పీ శరత్ చంద్ర ప్రవార్
Dalits Complaint | కాంగ్రెస్ ఎమ్మెల్యే వేధింపులపై కలెక్టర్‌కు దళితుల ఫిర్యాదు
ట్రెండింగ్ వార్తలు
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?

