Devara Part 1 | తారక్ అభిమానులకు గుడ్ న్యూస్.. ఇక టీవీలోకి రాబోతున్న దేవర..!
Devara part 1| జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) దేవర పార్టు- 1 సెప్టెంబర్ 27న (2024) గ్రాండ్‌గా విడుదలై బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. మరోవైపు జపాన్‌లో కూడా విడుదలై మంచి స్పందన రాబట్టుకుంది.
Devara Part 1 | టాలీవుడ్ క్రేజీ కాంబోల్లో ఒకటి జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR)- కొరటాల శివ (Siva Koratala).ఈ ఇద్దరి కలయికలో వచ్చిన ప్రాజెక్ట్ దేవర (Devara). పాన్ ఇండియా బ్యాక్ డ్రాప్లో డైరెక్ట్ చేసిన ఈ మూవీ రెండు పార్టులుగా రాబోతుందని తెలిసిందే. అయితే దేవర పార్టు- 1 సెప్టెంబర్ 27న (2024) గ్రాండ్‌గా విడుదలై బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. మరోవైపు జపాన్‌లో కూడా విడుదలై మంచి స్పందన రాబట్టుకుంది.
కాగా ఈ సినిమా వచ్చి రెండేళ్లు దాటిపోతున్నా ఇప్పటివరకు ఇంకా టీవీలోకి రాలేదు. ఇప్పటిదాకా దేవర శాటిలైట్ రైట్స్ అమ్ముడుపోకపోవడంతో అభిమానులు, మూవీ లవర్స్ నిరాశలో మునిగిపోయారు. ఇప్పుడు వారి కోసం ఆసక్తికర అప్డేట్ వచ్చేసింది. దేవరను థియేటర్లలో మిస్సయిన వారి కోసం టెలివిజన్ ప్రీమియర్‌తో సందడి చేయనుంది. తాజా అప్ డేట్ ప్రకారం పాపులర్ నెట్ వర్క్ సోనీ దేవర శాటిలైట్ రైట్స్‌ను దక్కించుకుందట. 2027లో దేవర టీవీలోకి రానుండగా.. ప్రీమియర్ డేట్‌పై క్లారిటీ రావాల్సి ఉంది.
ఫిషింగ్ హార్బర్ విలేజ్, పోర్ట్ మాఫియా నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో బాలీవుడ్ యాక్టర్ సైఫ్ అలీఖాన్ భైర పాత్రలో నటించగా.. ప్రకాశ్ రాజ్, షైన్ టామ్ ఛాకో, శ్రీకాంత్, మురళీ శర్మ ఇతర కీలక పాత్రలపు పోషించారు. ఈ చిత్రంలో బాలీవుడ్ భామ జాన్వీకపూర్ ఫీ మేల్ లీడ్ రోల్లో నటించింది. ఈ మూవీ జాన్వీకపూర్ తెలుగు డెబ్యూ ప్రాజెక్ట్.
దేవరకు పాపులర్ కంపోజర్ అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందించాడు. ఈ మూవీని ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్లపై సుధాకర్ మిక్కిలినేని, కొనరాజు హరికృష్ణ, కల్యాణ్ రామ్ సంయుక్తంగా తెరకెక్కించారు.
Read Also :
‘ఎన్నికల ప్రక్రియపై విద్యార్థులు అవగాహన కలిగి ఉండాలి’
Protests | సోనియాగాంధీ ఆత్మకథపై ఏక్నాథ్ షిండే వర్గం శివసేన ఆగ్రహం.. Video
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Devara Part 1 | తారక్ అభిమానులకు గుడ్ న్యూస్.. ఇక టీవీలోకి రాబోతున్న దేవర..!
The Breaking News | డిసెంబర్ 11న థియేటర్లలో సందడి చేయనున్న ‘ది బ్రేకింగ్ న్యూస్’!
నవీన్ నాయక్ ప్రాణ త్యాగానికి జాతీయ గుర్తింపు
Man Attacks Police With Knife | ఐదుగురు పోలీసులపై కత్తితో దాడి చేసిన వ్యక్తి.. ఎన్కౌంటర్లో గాయాలు
బాధితుల సమస్యలపై సత్వరమే స్పందించాలి : ఎస్పీ శరత్ చంద్ర ప్రవార్
ట్రెండింగ్ వార్తలు
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?

