Watch: బ్రేకప్ చెప్పిన ప్రియురాలు.. ఆమె ఇంటికి నిప్పంటించిన వ్యక్తి
Man Sets Woman's Flat on Fire | ప్రియురాలు బ్రేకప్ చెప్పడంపై ఒక వ్యక్తి ఆగ్రహించాడు. అర్ధరాత్రి వేళ ఆమె ఇంటికి చేరుకున్నాడు. డోర్ వద్ద పెట్రోల్ పోసి నిప్పంటించాడు. దర్యాప్తు చేసిన పోలీసులు ఆ వ్యక్తిని అరెస్ట్ చేశారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
ముంబై: ప్రియురాలు బ్రేకప్ చెప్పడంపై ఒక వ్యక్తి ఆగ్రహించాడు. అర్ధరాత్రి వేళ ఆమె ఇంటికి చేరుకున్నాడు. డోర్ వద్ద పెట్రోల్ పోసి నిప్పంటించాడు. దర్యాప్తు చేసిన పోలీసులు ఆ వ్యక్తిని అరెస్ట్ చేశారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. (Man Sets Woman’s Flat on Fire) మహారాష్ట్రలోని థానే జిల్లాలో ఈ సంఘటన జరిగింది. ఎనిమిదేళ్ల రిలేషన్ తర్వాత దీపేష్ రస్తోగి అనే వ్యక్తికి ప్రియురాలు బ్రేకప్ చెప్పింది. దీంతో అతడు రగిలిపోయాడు. నవంబర్ 16న తెల్లవారుజామున 2:45 గంటల సమయంలో డోంబివ్లీలోని ఆ మహిళ ఇంటికి దీపేష్ చేరుకున్నాడు. ముఖానికి ముసుగు ధరించిన అతడు ఆమె ఫ్లాట్ డోర్ వద్ద పెట్రోల్ పోసి నిప్పంటించి పారిపోయాడు.
కాగా, ఆ సమయంలో ఆ మహిళ, ఆమె తల్లిదండ్రులు ఆ ఇంట్లో నిద్రిస్తున్నారు. మంటలను గమనించిన వారు అప్రమత్తమయ్యారు. ఇంటి లోపలకు మంటలు వ్యాపించకముందే వాటిని ఆర్పేశారు. ఈ సంఘటనలో ఆ కుటుంబ సభ్యులెవరికీ ఎలాంటి హాని జరుగలేదు.
మరోవైపు ఆ మహిళ ఫిర్యాదుపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. ఆ బిల్డింగ్‌లోని సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలించారు. ఆ మహిళ మాజీ ప్రియుడైన దీపేష్‌ను నిందితుడిగా గుర్తించారు. అతడ్ని అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెట్టి రిమాండ్‌కు తరలించారు.
అయితే తన చర్యల పట్ల దీపేష్ ఎలాంటి పశ్చాత్తాపం లేదా విచారాన్ని వ్యక్తం చేయలేదని పోలీసులు తెలిపారు. మాజీ ప్రియురాలితో పాటు ఆమె కుటుంబాన్ని అంతం చేసేందుకు అతడు ప్రయత్నించాడా? అన్నది దర్యాప్తు చేస్తున్నారు. మహిళ ఫ్లాట్‌కు అతడు నిప్పంటించిన సీసీటీవీ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
🎥 CCTV Captures Accused Deepesh Rastogi Entering Girlfriend’s Building Before Setting Her House Ablaze In Dombivli
Reported by @AzmiJourno
#Dombivli #MaharashtraNews https://t.co/G7JDKcyqeJ
— Free Press Journal (@fpjindia) November 23, 2026
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Watch: బ్రేకప్ చెప్పిన ప్రియురాలు.. ఆమె ఇంటికి నిప్పంటించిన వ్యక్తి
CM Revanth Reddy | బర్లు కాసుకునేవాళ్లు కాళేశ్వరం దగ్గర సెల్ఫీలు దిగుతున్నరు : సీఎం రేవంత్ రెడ్డి
Srimathi trailer | భావోద్వేగాలతో కూడిన బలమైన సందేశం.. తిరువీర్, నివేదా థామస్ ‘శ్రీమతి’ ట్రైలర్ విడుదల
జూలూరుపాడులో పోలీసుల నాకాబందీ
Jeevan Reddy | బీడీ కార్మికులకు కొత్త పెన్షన్లు మంజూరు చేయాలి : మాజీ మంత్రి జీవన్ రెడ్డి డిమాండ్
ట్రెండింగ్ వార్తలు
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?

