Sheraz Mehdi | ‘ఓ అందాల రాక్షసి’ సినిమాకు థియేటర్లు దక్కడం లేదని ఆవేదన.. ప్రజావాణిలో కలెక్టర్‌ను కలిసిన షెరాజ్ మెహదీ
Sheraz Mehdi | తెలుగు చిత్ర పరిశ్రమలో చిన్న బడ్జెట్ సినిమాల నిర్మాతలకు జరుగుతున్న అన్యాయం, థియేటర్ల కేటాయింపులో వివక్షపై విచారణ జరిపించి న్యాయం చేయాలని కోరుతూ నటుడు, దర్శకుడు షెరాజ్ మెహదీ సోమవారం హైదరాబాద్ జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు.
Sheraz Mehdi | తెలుగు చిత్ర పరిశ్రమలో చిన్న బడ్జెట్ సినిమాల నిర్మాతలకు జరుగుతున్న అన్యాయం, థియేటర్ల కేటాయింపులో వివక్షపై విచారణ జరిపించి న్యాయం చేయాలని కోరుతూ నటుడు, దర్శకుడు షెరాజ్ మెహదీ సోమవారం హైదరాబాద్ జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. ప్రజావాణి కార్యక్రమంలో కలెక్టర్‌ను కలిసిన ఆయన, తాను నిర్మించిన ‘ఓ అందాల రాక్షసి’ చిత్రానికి గత ఏడాదిన్నరగా తగినన్ని థియేటర్లు, షోలు కేటాయించకపోవడంతో తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు వినతిపత్రంలో పేర్కొన్నారు. భారీ బడ్జెట్ చిత్రాలకే ఎక్కువ థియేటర్లు ఇస్తూ చిన్న నిర్మాతలు, కొత్త దర్శకులకు అవకాశాలు లేకుండా చేస్తున్నారని, దీనివల్ల ఓటీటీ, శాటిలైట్, డిజిటల్ హక్కుల ఆదాయం కూడా దెబ్బతిని పెట్టుబడులకు రక్షణ లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
మల్టీప్లెక్స్‌లు, సింగిల్ స్క్రీన్లలో చిన్న సినిమాలకు సమాన అవకాశాలు కల్పించాలని, థియేటర్ల కేటాయింపులో బంధుప్రీతి, వివక్షపై విచారణ జరిపించి ప్రత్యేక ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థను ఏర్పాటు చేయాలని షెరాజ్ మెహదీ కోరారు. చిన్న, మధ్యతరహా సినిమాలకు ఆర్థిక ప్రోత్సాహకాలతో పాటు నష్టాల్లో 20 నుంచి 30 శాతం వరకు సబ్సిడీ ఇవ్వాలని, హైదరాబాదీ భాషా చిత్రాలను కూడా ప్రోత్సహించాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ, చిన్న చిత్రాలకు క్యూబ్ రేట్ల భారం తగ్గించాలని, కార్మికులకు ప్రభుత్వ హెల్త్ కార్డులు అందేలా కృషి చేస్తానని తెలిపారు. ఈ సందర్భంగా తెలుగు ఫిల్మ్ ఛాంబర్ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ నిర్మాతల మండలి నేత సి. కళ్యాణ్‌పై ఘాటు వ్యాఖ్యలు చేసిన ఆయన, సమస్యలు పరిష్కరించలేని వారు పదవుల్లో ఉండటం ఎందుకని ప్రశ్నించారు. తమ పోరాటం కోర్టులోనూ కొనసాగుతోందని, త్వరలోనే విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Watch: బ్రేకప్ చెప్పిన ప్రియురాలు.. ఆమె ఇంటికి నిప్పంటించిన వ్యక్తి
CM Revanth Reddy | బర్లు కాసుకునేవాళ్లు కాళేశ్వరం దగ్గర సెల్ఫీలు దిగుతున్నరు : సీఎం రేవంత్ రెడ్డి
Sheraz Mehdi | ‘ఓ అందాల రాక్షసి’ సినిమాకు థియేటర్లు దక్కడం లేదని ఆవేదన.. ప్రజావాణిలో కలెక్టర్‌ను కలిసిన షెరాజ్ మెహదీ
Srimathi trailer | భావోద్వేగాలతో కూడిన బలమైన సందేశం.. తిరువీర్, నివేదా థామస్ ‘శ్రీమతి’ ట్రైలర్ విడుదల
జూలూరుపాడులో పోలీసుల నాకాబందీ
ట్రెండింగ్ వార్తలు
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?

