Doctors Reattach Amputated Hand | తెగిన యువకుడి కుడి చేయి.. సర్జరీ ద్వారా తిరిగి అతికించిన డాక్టర్లు
Doctors Reattach Amputated Hand | ఒక యువకుడి కుడి చేయి యంత్రంలో ఇరుక్కుపోవడంతో మణికట్టు వరకు తెగిపోయింది. అయితే తెగిన చేతితో సహా అతడ్ని వెంటనే ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. డాక్టర్లు ఏడు గంటలకుపైగా సర్జరీ నిర్వహించారు. తెగిన చేతిని విజయవంతంగా పూర్తిగా అతికించారు.
లక్నో: ఒక యువకుడి కుడి చేయి యంత్రంలో ఇరుక్కుపోవడంతో మణికట్టు వరకు తెగిపోయింది. అయితే తెగిన చేతితో సహా అతడ్ని వెంటనే ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. డాక్టర్లు ఏడు గంటలకుపైగా సర్జరీ నిర్వహించారు. తెగిన చేతిని విజయవంతంగా పూర్తిగా అతికించారు. (Doctors Reattach Amputated Hand) ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో ఈ సంఘటన జరిగింది. హాపూర్‌కు చెందిన 18 ఏళ్ల యువకుడు, ఘజియాబాద్‌లోని ఒక నిర్మాణ సంస్థలో పనిచేస్తున్నాడు. జూలై 21న నిర్మాణ స్థలం వద్ద యంత్రంలో అతడి కుడి చేయి ఇరుక్కున్నది. అది నుజ్జుకావడంతో పాటు మణికట్టు వరకు తెగిపోయింది.
కాగా, తెగిన చేతితో పాటు ఆ యువకుడిని వెంటనే ఘజియాబాద్‌లోని యశోద మెడిసిటీ హాస్పిటల్‌కు తరలించారు. తీవ్ర రక్తస్రావం కావడంతో అత్యవసర విభాగంలో అడ్మిట్ చేసి చికిత్స అందించారు. ప్లాస్టిక్, పునర్నిర్మాణ సర్జన్ డాక్టర్ శోభిత్ శర్మ, ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ బ్రజేష్ కౌష్లే నేతృత్వంలోని బృందం ఆ యువకుడికి అత్యవసర శస్త్రచికిత్స చేయాలని నిర్ణయించారు. తెగిన కుడి చేయి యంత్రంలో తీవ్రంగా నలిగిపోవడంతో ఆపరేషన్ కష్టంగా మారింది. ఈ నేపథ్యంలో వైద్యులు ఏడు గంటలకుపైగా శ్రమించి సర్జరీ చేశారు.
మరోవైపు మొదట విరిగిన మణికట్టు ఎముకను డాక్టర్లు స్థిరీకరించారు. మైక్రోసర్జికల్ పద్ధతుల ద్వారా ధమనులు, సిరలను తిరిగి కలిపారు. ఆ తర్వాత దెబ్బతిన్న నరాలు, మృదు కణజాలాన్ని సరిచేశారు. రోగి అప్పటికే కొంత రక్తాన్ని కోల్పోవడంతో రక్తాన్ని కూడా ఎక్కించారు. తిరిగి అతికించిన చేతికి రక్త ప్రసరణను కూడా వైద్యులు పునరుద్ధరించారు.
కాగా, సంక్లిష్ట శస్త్రచికిత్స తర్వాత ఆ యువకుడు కోలుకున్నాడని, ఆరోగ్యంతో డిశ్చార్జ్ అయ్యాడని వైద్యులు తెలిపారు. అయితే పూర్తిగా కోలుకోవడానికి కొంత సమయం పడుతుందని చెప్పారు. వేళ్లలో కదలిక, స్పర్శ క్రమంగా తిరిగి వస్తాయని అన్నారు. చేతిలో బలం, పట్టు తిరిగి పొందడానికి ఫిజియోథెరపీ వంటివి అవసరమని వివరించారు. తెగిన చేతిని, అతడిని సకాలంలో సరైన వైద్య సదుపాయాలు ఉన్న ఆసుపత్రికి తీసుకురావడం వల్లనే సర్జరీ ద్వారా తిరిగి అతికించడం సాధ్యమైందని డాక్టర్లు వెల్లడించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Newzealand | భారత్‌తో వందేళ్ల క్రీడానుబంధం.. వన్డే సిరీస్ కోసం ప్రత్యేక జెర్సీ విడుదల..!
Thulabharam | రవితేజ, వివేక్ ఆత్రేయ క్రేజీ కాంబో.. ‘తులాభారం’ టైటిల్ గ్లింప్స్ వచ్చేసింది!
Prabhas Birthday | ప్రభాస్ బర్త్‌డే కానుక.. థియేటర్లలో సందడి చేయనున్న డార్లింగ్ బ్లాక్‌బస్టర్ మూవీస్ ‘వర్షం’, ‘ఛత్రపతి’!
Warangal | వరంగల్ భద్రకాళి ఆలయంలో భక్తుల రద్దీ.. ఏర్పాట్లలో విఫలమైన అధికార యంత్రాంగం
George Krish | జూనియర్ సైంటిస్ట్‌గా శర్వానంద్.. రామోజీ ఫిల్మ్‌సిటీలో ‘జార్జ్ క్రిష్’ ఊరమాస్ షూటింగ్!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

