యూనిటీ మాల్లో ప్రభుత్వానికి దకే మొత్తం నిర్మిత ప్రాంతం 9.18 లక్షల చదరపు అడుగులు కాగా, ప్రైవేట్ డెవలపర్‌కు 18లక్షల చదరపు అడుగుల స్థలంతోపాటు అదనపు హక్కుల్ని కల్పించారు. ఖరీదైన ప్రభుత్వ భూమి, కేంద్ర నిధులు మంజూరవుతున్న ఈ ప్రాజెక్టులో ప్రైవేట్‌కు ఇంత భారీ మొత్తంలో కమర్షియల్ హకులు ఎందుకు కల్పిస్తున్నారో.. కాంగ్రెస్ ప్రభుత్వం వెల్లడించాలి. కాంగ్రెస్ అవినీతిపై పదే పదే మాట్లాడే ప్రధాని, కేంద్రమంత్రులు దీనిపై చర్యలెందుకు తీసుకోవడం లేదో చెప్పాలి. – కేటీఆర్
హైదరాబాద్, ఆగస్టు 10 (నమస్తే తెలంగాణ) : హైదరాబాద్‌లోని రాయదుర్గ్‌లో ప్రతిపాదించిన పీఎం ఏక్తా(యూనిటీ) మాల్ టెండర్లలో తీవ్రమైన ఆర్థిక అక్రమాలు, భారీ కుంభకోణం జరిగిందని బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. యూనిటీ మాల్ టెండర్ల లో కావాలని రేవంత్‌రెడ్డి ప్రభుత్వం అక్రమ, అనుమానాస్పద నిబంధనలతో ప్రజా వనరులను తాకట్టు పెట్టి ప్రైవేట్ డెవలపర్‌కు లబ్ధి చేకూరుస్తున్నదని ఆయన విమర్శించారు. తక్షణమే ఆ టెండర్‌ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌కు కేటీఆర్ సోమవారం లేఖ రాశారు. ప్రాజెక్టుపై తుది నిర్ణయాలు తీసుకోకముందే, ప్రైవేట్ సంస్థల జేబుల్లోకి వెళ్లే కేంద్ర నిధు ల విడుదలను తక్షణమే నిలిపివేయాలని, మొత్తం వ్యవహారంపై స్వతంత్ర దర్యాప్తునకు ఆదేశించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. భూమి విలువ కాకుండా, ఈ ప్రాజెక్టు అంచనా వ్యయం దాదాపు రూ.2,059.81 కోట్లు అని, ఇందులో రేవంత్ సర్కార్ భారీ అక్రమాలకు పాల్ప డుతున్నదని లేఖలో ప్రస్తావించారు. రా యదుర్గ్లోని అత్యంత విలువైన 6.30 ఎ కరాల స్థలంలో, 27లక్షల చదరపు అడుగుల నిర్మిత ప్రాంతంతో ఈ ప్రాజెక్టును త లపెట్టారని.. ఇందుకోసం సుమారు రూ.202కోట్ల కేంద్ర సహాయం మంజూరైందని కేటీఆర్ గుర్తుచేశారు. తెలిపారు.
ప్రైవేట్ డెవలపర్‌కు భారీ హకులా?
ఎంపిక చేసిన డెవలపర్ కన్సార్టియం లో వంశీరామ్ బిల్డర్స్ అండ్ డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ లీడ్ మెంబర్‌గా, అపర్ణ ఇన్ఫ్రా హౌసింగ్ ప్రైవేట్ లిమిటెడ్ భాగస్వామిగా ఉన్నాయని కేటీఆర్ వివరించా రు. టెండర్ మూల్యాంకనం ప్రకారం.. ఈ కన్సార్టియం ప్రభుత్వానికి లభించే క నీస వాటా కంటే అదనంగా 18వేల చదరపు అడుగుల గ్రేడ్-ఏ కమర్షియల్ స్థలా న్ని ఇచ్చేందుకు ప్రతిపాదించిందని, దీంతో ప్రభుత్వానికి దకే మొత్తం నిర్మిత ప్రాంతం 9.18 లక్షల చదరపు అడుగులకు చేరుతుందని తెలిపారు. ప్రైవేట్ డెవలపర్‌కు మాత్రం కనీసం 18లక్షల చదరపు అడుగుల స్థలంతోపాటు భవిష్యత్తు ప్రణాళికలు ద్వారా వచ్చే అదనపు ప్రాంతాన్ని కూడా పొందే హకును క ల్పించారని ఆక్షేపించారు. ఖరీదైన ప్రభు త్వ భూమి, కేంద్ర నిధులు మంజూరవుతున్న ఈ ప్రాజెక్టులో ప్రైవేట్ డెవలపర్‌కు ఇంత భారీ మొత్తంలో కమర్షియల్ హ కులు ఎందుకు కల్పిస్తున్నారో.. కాంగ్రెస్ ప్రభుత్వం సమాధానం చెప్పాలని డి మాండ్ చేశారు. కేటాయిస్తున్న విలువ ప్ర జలకు దకుతున్నదనా?లేదా? అని ప్ర శ్నించారు. ఈ ప్రాజెక్టు ఆర్థిక నమూనాపై కూడా తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేశారు.
మోదీ, మంత్రులు మాటలకేనా?
రాష్ట్రంలోని కాంగ్రెస్ సర్కార్ పాలన, అవినీతిపై స్వయంగా ప్రధాని, పలువురు కేంద్ర మంత్రులు బహిరంగంగా వ్యాఖ్య లు చేస్తున్నారు కానీ, కేంద్ర ప్రభుత్వం ఎలాంటి ప్రత్యక్ష చర్యలు తీసుకోకపోవడం అనేక అనుమానాలకు తావిస్తున్నదని కేటీఆర్ పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో జరుగుతున్న అమృత్ టెండర్ల అక్రమాలు, బొగ్గు కుంభకోణం వంటి అనేక అవినీతి వ్యవహారాలపై ఆధారాల తో కేంద్రం దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదని విమర్శించారు. స్వతంత్ర విచారణలు జరిపించాలని బీఆర్ఎస్ వరుసగా పోరాడుతున్నదని కేటీఆర్ గుర్తుచేశారు. పీఎం ఏక్తా మాల్ టెండర్లలో వెలుగుచూసిన ఆరోపణలపై కేంద్ర ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకోవాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. కేంద్ర నిధులు ఇందులో ఉన్నందున, ప్రజాధనం దుర్వినియోగం కాకముందే, ఉపసంహరించుకోలేని నిర్ణయాలు తీసుకోకముందే కేంద్ర ఆర్థికశాఖ తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రస్తుత టెండరును వెంటనే రద్దు చేయాలని, ఈ లావాదేవీపై స్వతంత్ర విచారణ పూర్త య్యే వరకు ఎలాంటి కేంద్ర నిధులను విడుదల చేయవద్దని కేటీఆర్ డిమాండ్ చేశా రు. ఈ విచారణ ద్వారా భూమి విలువ, ప్రాజెక్టు వ్యయం, ఆర్థిక నమూ నా, టెండర్ నిబంధనలు, బిడ్ మూ ల్యాంకనం, ప్రభుత్వ వాటా, ప్రైవేట్ డెవలపర్ హకులు, కేంద్ర నిధుల వినియోగంపై స్పష్టత రావాలని చెప్పారు. ఈ టెండర్ నిబంధనలు లేదా ఆర్థిక నమూ నా వల్ల ఏదైనా ప్రైవేట్ సంస్థకు అనుచిత లేదా నిబంధనలకు విరుద్ధమైన లబ్ధి చే కూరిందో లేదో కూడా ఈ విచారణ తే ల్చాలని కోరారు. పూర్తిస్థాయి డీపీఆర్, ఫైనాన్షియల్ మోడల్, ల్యాండ్ వాల్యుయేషన్, టెండర్ డాక్యుమెంట్లు, బిడ్ మూల్యాంకన రికార్డులను కూడా పబ్లిక్ స్రూటినీకి ఉంచాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.
బాధ్యులపై చర్యలు తీసుకోవాలి
ఈ అంశంలో కాగ్‌తోపాటు అర్హత కలిగిన ఆడిట్, విజిలెన్స్, విచారణ సంస్థల ద్వారా స్వతంత్ర తనిఖీ జరిపించి, వాస్తవాలను తేల్చి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. విలువైన ప్రజల భూమి, కేంద్ర నిధులతో కూడిన ఈ టెండర్ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం జవాబుదారీతనం నుంచి తప్పించుకోలేదని హెచ్చరించారు. ‘తెలంగాణ ప్రజల ఆస్తులను ప్రైవేట్ బేరసారాల కోసం వాడుకోలేరు. ప్రజాధనం ప్రైవేట్ వ్యక్తుల అక్రమ సంపాదనకు పునాది కాకూడదు’ అని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రజాధనం, ఆస్తుల దుర్వినియోగం చేస్తున్న ప్రతి సందర్భంలోనూ అందుబాటులో ఉన్న ఆధారాలను అధికారుల ముందుపెట్టి, బాధ్యులను చట్టం ముందు నిలబెట్టే దాకా బీఆర్ఎస్ పోరాటం కొనసాగిస్తూనే ఉంటుందని కేటీఆర్ స్పష్టంచేశారు.
పీఎం ఏక్తా మాల్ కవచంగా..
స్పెషల్ అసిస్టెన్స్ టు స్టేట్స్ ఫర్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్(ఎస్ఏఎస్సీఐ) పథకం కింద పీఎం యూనిటీ మాల్ కోసం మంజూరైన రూ.200 కోట్ల వడ్డీ లేని రుణాన్ని తెలంగాణ ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ లిమిటెడ్(టీజీటీపీసీ) ద్వారా సదరు డెవలపర్‌కు నిధులు మళ్లించేలా టెండర్ నిబంధనలు రూపొందించారని కేటీఆర్ తెలిపారు. ప్రాజెక్ట్ సిద్ధం చేయడం, కన్సల్టెన్సీ, సర్వేలు, అనుమతులు, వంటి ప్రాథమిక పనులకు ఇప్పటికే చేసిన ఖర్చును ఈ నిధుల నుంచి సర్దుబాటు చేసే వెసులుబాటు కల్పించారని తెలిపారు. ప్రజాధనాన్ని కేటాయించే ముందు ఈ ఆర్థిక నమూనాపై స్వతంత్ర దర్యాప్తు జరుగాల్సిన అవసరం ఉన్నదని పేర్కొన్నారు. అనుమానాస్పద టెండర్లను కప్పిపుచ్చుకోవడానికి కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్ర సహాయాన్ని లేదా పీఎం ఏక్తా మాల్ అనే బ్రాండ్ పేరును కవచంగా వాడుకుంటున్నదని విమర్శించారు. ఒక ప్రతిష్ఠాత్మక పేరు ఉన్నంత మాత్రాన ఒక అవినీతి ఒప్పందం పారదర్శకంగా మారిపోదని మండిపడ్డారు.