MNS Style reply | రాజ్ ఠాక్రేను కించపరుస్తూ రీల్.. ఇన్‌ఫ్లుయెన్సర్‌కు ‘ఎంఎస్ఎస్ స్టైల్’లో రిప్లై
MNS Style reply | మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎంఎన్ఎస్) అధినేత రాజ్ ఠాక్రేను కించపరుస్తూ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ ఒక రీల్ పోస్ట్ చేశాడు. ఎంఎన్ఎస్ కార్యకర్తలు దీనిపై ఆగ్రహించారు. ఆ వ్యక్తిని తమ కార్యాలయానికి తీసుకువచ్చారు. ‘ఎంఎన్ఎస్ స్టైల్’లో అతడికి బుద్ధిచెప్పారు.
ముంబై: మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎంఎన్ఎస్) అధినేత రాజ్ ఠాక్రేను కించపరుస్తూ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ ఒక రీల్ పోస్ట్ చేశాడు. ఎంఎన్ఎస్ కార్యకర్తలు దీనిపై ఆగ్రహించారు. ఆ వ్యక్తిని తమ కార్యాలయానికి తీసుకువచ్చారు. ‘ఎంఎన్ఎస్ స్టైల్’లో అతడికి బుద్ధిచెప్పారు. (MNS Style reply) పూణేకు చెందిన సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ మహేష్ మోటే 15 రోజుల కిందట ఎంఎన్ఎస్ చీఫ్ రాజ్ ఠాక్రేను అపహాస్యం చేస్తూ ఒక రీల్ పోస్ట్ చేశాడు. ఆ తర్వాత కేరళ వెళ్లిన అతడు ఇటీవల పూణేకు తిరిగి వచ్చాడు. ఇది తెలుసుకున్న ఎంఎన్ఎస్ కార్యకర్తలు మహేష్‌ను పట్టుకుని తమ పార్టీ కార్యాలయానికి తీసుకెళ్లారు. అక్కడ ‘ఎంఎన్ఎస్ స్టైల్’లో అతడికి బుద్ధిచెప్పారు.
కాగా, ఎంఎన్ఎస్ పార్టీ కార్యాలయలోని రాజ్ ఠాక్రే ఫొటో ముందు ఇన్ఫ్లుయెన్సర్ మహేష్ మోటేతో ఆ పార్టీ నేతలు సాష్టాంగ నమస్కారం చేయించారు. అతడి ముఖానికి నల్ల సిరా పూశారు. తలపై చెప్పులతో గుంజీలు తీయించారు. ఆ తర్వాత అతడితో క్షమాపణలు చెప్పించారు. ‘నేను అనుకోకుండా రాజ్ సాహెబ్ గురించి తప్పుగా మాట్లాడాను. అలాగే శుభం దాదా, ఇతర ఎంఎన్ఎస్ కార్యకర్తల గురించి కూడా పొరపాటున అనుచితంగా మాట్లాడాను. ఈ రోజు నా తప్పు పట్ల నేను తీవ్రంగా చింతిస్తున్నా. ఈ రీల్ కారణంగానే నేను ఈ క్లిష్ట పరిస్థితిలో చిక్కుకున్నాను. ఎంఎన్ఎస్ పార్టీకి, మీ అందరికీ నేను మనస్ఫూర్తిగా క్షమాపణలు చెబుతున్నా’ అని మహేష్ మోటే అన్నాడు. కన్నీళ్లతో క్షమాపణలు చెబుతూ తనను వేధించవద్దని ఎంఎన్ఎస్ నేతలను వేడుకున్నాడు.
మరోవైపు తమ అధినేత రాజ్ ఠాక్రేను కించపరిచిన ఇన్‌ఫ్లుయెన్సర్‌కు ఎంఎన్ఎస్ స్టైల్లో గుణపాఠం చెప్పినట్లు హడప్సర్ అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన ఎంఎన్ఎస్ సబ్-డివిజనల్ అధ్యక్షుడు శుభమ్ జగ్దలే తెలిపారు. తమ కార్యాలయంలో మోటేకు ‘మహాప్రసాద్’ అందించామని చెప్పారు. రాజ్ ఠాక్రేను అవమానించే ఎవరికైనా ఇదే గతి పడుతుందని ఆయన హెచ్చరించారు. ఎంఎన్ఎస్ నేతలు పోస్ట్ చేసిన ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
FACE SMEARED WITH INK. SLIPPERS HELD ON HEAD. FORCED APOLOGY. AN INFLUENCER IN TEARS.
How dare he post a video on MNS chief @RajThackeray! That too, in a democracy!
I didn’t use the words ‘assault & humiliation’. Let’s leave it to Mr. Thackeray’s wise discretion. pic.twitter.com/Q77JCP0mLs
— Nidhi Sharma (@NidhiPoV) September 21, 2026
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Puneeth Rajkumar: గంటన్నర పాటు కిక్ బాక్సింగ్.. పునీత్ రాజ్‌కుమార్ చివరి క్షణాలు గురించి చెప్పిన డాక్టర్
‘పేదింటి ఆడబిడ్డల పెళ్లికి భరోసా కల్యాణలక్ష్మి’
వైటీపీఎస్ స్టేజ్ -1 చీఫ్ ఇంజినీర్ సురేష్ నాయక్ సస్పెన్షన్
Vijay Deverakonda | ‘రణబాలి’ విడుదల వేళ పుట్టపర్తిలో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న!
Jobs | యూకో బ్యాంక్‌లో 530 అప్రెంటిస్ ఖాళీలు.. అక్టోబర్ 29 చివరితేదీ
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

